ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Visakha: ప్రైవేటు ఆస్పత్రిలో కామాంధుడు.. తలకు దెబ్బ తగిలిందని వెళ్తే..

ABN, Publish Date - Dec 10 , 2024 | 09:43 PM

విశాఖ పెద్దవాల్తేరు ప్రాంతంలో సోమవారం రాత్రి ప్రమాదవశాత్తూ ఓ మహిళ తలకు గాయమైంది. దీంతో ఆమె హుటాహుటిన ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లింది. పరీక్షించిన వైద్యులు గాయం పెద్దదిగా ఉండడంతో తల స్కానింగ్ తీయాలని చెప్పారు.

విశాఖ: మహిళలపై లైంగిక వేధింపులు ఏమాత్రం ఆగడం లేదు. దేశవ్యాప్తంగా ప్రతి రోజూ ఏదో ఓ మూలన మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, హత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. అలాంటి ఘటనలు సంచలనంగా మారుతున్నాయి. అయితే ఓ ఘటన జరిగిన రోజుల వ్యవధిలోనే మరో దాడి జరుగుతుండడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఎవ్వరిని నమ్మాలో అర్థం కాని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పాఠశాలలు, కార్యాలయాలు, రోడ్లు, బస్సులు, రైళ్లు ఆఖరికి ఇంట్లోనూ వారికి రక్షణ లేకుండా పోతోంది. ఇళ్లల్లో ఉన్న ఆడవారిపైనా ప్రేమోన్మాదులు, కామాంధులు రెచ్చిపోతూ విచక్షణ రహితంగా దాడులకు తెగబడుతున్నారు. కామవాంఛలు తీర్చుకునేందుకు మహిళల ప్రాణాలు సైతం తీస్తున్నారు. నిందితులను పట్టుకుని ఎంత కఠినంగా శిక్షించినా రోజుల వ్యవధిలోనే మరో దారుణ ఘటన వెలుగు చూస్తోంది.


తాజాగా అటువంటి ఘటనే ఒకటి విశాఖలో చోటు చేసుకుంది. అనారోగ్యం కారణంగా ఆస్పత్రికి వచ్చిన ఓ మహిళ పట్ల సిబ్బంది దారుణంగా ప్రవర్తించారు. అసభ్యకరంగా తాకుతూ ఆమెపై అత్యాచారం చేసేందుకు యత్నించారు. ప్రతిఘటించిన ఆ యువతి.. కామాంధుడు నుంచి తృటిలో తప్పించుకుంది. కాగా సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


విశాఖ పెద్దవాల్తేరు ప్రాంతంలో సోమవారం రాత్రి ప్రమాదవశాత్తూ ఓ మహిళ తలకు గాయమైంది. దీంతో ఆమె హుటాహుటిన ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లింది. పరీక్షించిన వైద్యులు గాయం పెద్దదిగా ఉండడంతో తల స్కానింగ్ తీయాలని చెప్పారు. దీంతో ఆస్పత్రిలోని స్కానింగ్ యంత్రం వద్దకు వెళ్లింది. అయితే స్కానింగ్ కోసం వెళ్లిన ఆమెకు బట్టలు తీసేయాలని స్కానింగ్ సెంటర్ ఇన్‌ఛార్జ్ ప్రకాశ్ చెప్పాడు. దీంతో ఆమె దుస్తులు తీసేసింది. ఆ తర్వాత మహిళతో అసభ్యంగా ప్రవర్తించడం మెుదలుపెట్టాడు ప్రకాశ్. వెంటనే అప్రమత్తమైన మహిళ కేకలు వేయడం ప్రారంభించింది. అప్రమత్తమైన స్థానికులు లోపలికి వెళ్లగా విషయాన్ని వారికి చెప్పింది. దీంతో అంతా కలిసి కామాంధుడికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.


ఘటనపై సమాచారం అందుకున్న విశాఖ మూడో పట్టణ సీఐ రమణయ్య హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. కాగా, కోర్టు అతనికి రిమాండ్ విధించింది. అయితే నిందితుడు ప్రకాశ్ గతంలోనూ ఇలాంటి పనులకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. అయితే ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల అనేక మంది రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. దీనిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Guntur: సీఎం చంద్రబాబును కలిసిన టీటీడీ అదనపు ఈవో.. విషయం ఏంటంటే..

Visakha: జాయ్ జమీమా.. మాజీ ఎంపీ హర్ష కుమార్ వ్యాఖ్యలను ఖండించిన బాధితుడి తల్లి..

AP News: హోంమంత్రి అనితకు ఏపీ హైకోర్టులో ఊరట.. ఎందుకంటే..

Updated Date - Dec 10 , 2024 | 09:46 PM