ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Steel Plant: ఆ విషయంలో కూటమి ప్రభుత్వ విధానం స్పష్టం చేయాలి: ఎమ్మెల్సీ బొత్స..

ABN, Publish Date - Sep 15 , 2024 | 07:02 PM

కూటమి పార్టీలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అనుకూలమా లేక వ్యతిరేకమా? చెప్పాలంటూ మాజీ మంత్రి బొత్స ప్రశ్నించారు. ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం రైతులు వేలాది ఎకరాలు ఇచ్చారని, ఎంతో మంది ప్రాణ త్యాగం చేసి దాన్ని సంపాదించుకున్నట్లు బొత్స చెప్పుకొచ్చారు.

విశాఖ: స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వ విధానం స్పష్టం చేయాలని వైసీపీ నేతలు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. కూటమి పార్టీలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అనుకూలమా లేక వ్యతిరేకమా? చెప్పాలంటూ మాజీ మంత్రి బొత్స ప్రశ్నించారు. ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం రైతులు వేలాది ఎకరాలు ఇచ్చారని, ఎంతో మంది ప్రాణ త్యాగం చేసి దాన్ని సంపాదించుకున్నట్లు బొత్స చెప్పుకొచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలంటూ రెండు వారాలుగా కార్మికులు నిరసన చేస్తున్నారని, దీనిపై ఏపీ ప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు.


ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.." విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడాలి. కేంద్ర పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి స్టీల్ ప్లాంట్ పరిశీలించినా ప్రయోజనం లేకుండా పోయింది. ప్లాంట్ కాపాడుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దీనిపై వైసీపీ వైఖరిని పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రధాని మోదీకి తెలిపారు. ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయడం వల్ల ఉపయోగం లేదు. వైసీపీ హయాంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని కేంద్రానికి చెప్పడం వల్లే ప్రైవేటీకరణ జరగలేదు. వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో కేంద్రంలోని ఎన్డీయేకి బలం ఎక్కువగా ఉంది. అయినా మేము ప్రైవేటీకరణ ఆపగలిగాం. ఇప్పుడు భాగస్వామ్య పార్టీల మీద ఎన్డీయే ప్రభుత్వం ఆధారపడి ఉంది. ఇప్పుడు సీఎం చంద్రబాబు ఒత్తిడి చేసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి" అని అన్నారు.


మరోవైపు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.." విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో లేదు. ఉద్దేశపూర్వకంగా అప్పుల ఊబిలోకి నెట్టేశారు. ప్రజాప్రతినిధుల రాజీనామాలతో సమస్య పరిష్కారం కాదు. ప్రైవేటీకరణ ఆగాలంటే కేంద్ర ప్రభుత్వంతో సీఎం చంద్రబాబు మాట్లాడాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే మద్దతు పునఃసమీక్షించుకుంటామని ఆయన చెప్తే ప్రైవేటీకరణ ఆగిపోతుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ తరఫున పోరాడతాం" అని చెప్పుకొచ్చారు.

ఈ వార్తలు కూడా చదవండి:

AP News: నటి జత్వానీ వ్యవహారంలో సంచలన పరిణామం.. ముగ్గురు ఐపీఎస్‌లపై సస్పెన్షన్ వేటు

AP NEWS: వైసీపీ పాలనలో రోడ్లు నిర్వీర్యం.. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి విసుర్లు

Pawan Kalyan: ఇంజనీర్లకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు

Updated Date - Sep 15 , 2024 | 07:06 PM

Advertising
Advertising