ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

YS Sharmila: గంగవరం పోర్టును అదానీ పాలు చేసిన జగన్

ABN, Publish Date - Mar 16 , 2024 | 09:12 PM

సీఎం జగన్ రెడ్డి గంగవరం పోర్టును అదానీ పాలు చేశారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) అన్నారు. శనివారం నాడు విశాఖలో జరిగిన ‘సేవ్ విశాఖ-సేవ్ స్టీల్ ప్లాంట్’ సభలో షర్మిల మాట్లాడుతూ.. కేవలం భూముల కోసం విశాఖ స్టీల్ ఫ్లాంట్‌ను కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు కలిసి నష్టాల్లోకి తీసుకెళ్లారని మండిపడ్డారు.

విశాఖపట్నం: సీఎం జగన్ రెడ్డి గంగవరం పోర్టును అదానీ పాలు చేశారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) అన్నారు. శనివారం నాడు విశాఖలో జరిగిన ‘సేవ్ విశాఖ-సేవ్ స్టీల్ ప్లాంట్’ సభలో షర్మిల మాట్లాడుతూ.. కేవలం భూముల కోసం విశాఖ స్టీల్ ఫ్లాంట్‌ను కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు కలిసి నష్టాల్లోకి తీసుకెళ్లారని మండిపడ్డారు. స్టీల్ ఫ్లాంట్ కోసం టీడీపీ అధినేత చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. పాలకపక్షం, ప్రతిపక్షం బీజేపీకి తొత్తులుగా మారాయని ధ్వజమెత్తారు. స్టీల్ ఫ్లాంట్ కోసం జగన్ ఎందుకు ఉద్యమించలేదని నిలదీశారు. చంద్రబాబు బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారని ప్రశ్నించారు. టీడీపీ, వైసీపీ, బీజేపీ చేతుల్లో ఉన్నాయన్నారు.బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అని చెప్పారు. జగన్ రెడ్డి దేనికి సిద్ధమని ప్రశ్నించారు. సిద్ధం సభ కోసం రూ. ఆరు వందల కోట్లు ఖర్చుపెట్టారని మండిపడ్డారు.

జగన్‌కు పబ్లిసిటీ పిచ్చి పట్టుకుందన్నారు. బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా అని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్ట్, విశాఖ రైల్వేజోన్, స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధమా అన్నారు. మహిళలను, రైతులను, యువకులను మోసం చేయడానికి సిద్ధమా అని ప్రశ్నించారు. జగన్ననను ప్రజలు ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా జగన్ మాఫీయానే అని చెప్పారు. మద్యం పేరుతో దోపిడి చేస్తున్నారని మండిపడ్డారు. జగనన్న వాగ్దానాలు మద్యం షాపుల్లో నిలబెట్టుకున్నారని ఆరోపించారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేకహోదా కోసం ఎప్పుడైనా ప్రశ్నించారా అన్నారు. మాజీ మంత్రి వివేకా కేసులో అంతకులను కాపాడటానికి జగన్ ఢిల్లీ వెళ్తున్నారన్నారు. ప్రత్యేకహోదా రావాలి అంటే - ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని చెప్పారు. విశాఖ స్టీల్ ఫ్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉండాలంటే - కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. తన పుట్టినిల్లు ఏపీలో ప్రజలకు అన్యాయం జరుగుతుందనే తాను పోరాటం చేస్తున్నానని షర్మిల పేర్కొన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 16 , 2024 | 09:12 PM

Advertising
Advertising