AP Politics: వైసీపీ నుంచి మరో కీలక ప్రకటన.. ఆ నేతలకు కీలక బాధ్యతలు..!
ABN , Publish Date - Feb 10 , 2024 | 09:53 PM
YSRCP Regional Coordinators: వైసీపీ అధిష్టానం మరో కీలక ప్రకటన చేసింది. పార్టీకి చెందిన పలువురు రీజినల్ కో-ఆర్డినేటర్లకు పలు పార్లమెంట్ నియోజకవర్గాలు, జిల్లాల బాధ్యతలను అప్పగించారు. పార్టీ అధినేత, సీఎం జగన్ నిర్ణయం ప్రకారం ప్రకటన విడుదల చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి.. ఒంగోలు పార్లమెంట్, ఉమ్మడి నెల్లూరు జిల్లాల రీజినల్ కో-ఆర్డినేటర్‌గా బాధ్యతలు అప్పగించింది వైసీపీ అధిష్టానం. వి. విజయసాయిరెడ్డికి.. గుంటూరు పార్లమెంట్, నర్సారావుపేట పార్లమెంట్..

అమరావతి, ఫిబ్రవరి 10: వైసీపీ అధిష్టానం మరో కీలక ప్రకటన చేసింది. పార్టీకి చెందిన పలువురు రీజినల్ కో-ఆర్డినేటర్లకు పలు పార్లమెంట్ నియోజకవర్గాలు, జిల్లాల బాధ్యతలను అప్పగించారు. పార్టీ అధినేత, సీఎం జగన్ నిర్ణయం ప్రకారం ప్రకటన విడుదల చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి.. ఒంగోలు పార్లమెంట్, ఉమ్మడి నెల్లూరు జిల్లాల రీజినల్ కో-ఆర్డినేటర్‌గా బాధ్యతలు అప్పగించింది వైసీపీ అధిష్టానం. వి. విజయసాయిరెడ్డికి.. గుంటూరు పార్లమెంట్, నర్సారావుపేట పార్లమెంట్, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాల రీజినల్ కో-ఆర్డినేటర్‌గా బాధ్యతలు అప్పగించారు. పి. రామసుబ్బారెడ్డి.. కర్నూలు పార్లమెంట్, నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గాల రీజినల్ కో-ఆర్డినేటర్‌గా నియమించారు. కె. సురేష్‌బాబు.. కడప పార్లమెంట్, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల రీజినల్ కో-ఆర్డినేటర్‌గా నియమించారు. ఉమ్మడి విశాఖ జిల్లా డిప్యూటీ రీజినల్ కో-ఆర్డినేటర్‌గా గుడివాడ అమర్‌నాథ్‌ను నియమించారు. ఈయన సంబంధిత రీజినల్ కో-ఆర్డినేటర్ ఆధ్వర్యంలో పని చేస్తారు). అలాగే, విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడిగా మల్లాది విష్ణును నియమించారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం శనివారం ప్రకటన విడుదల చేసింది.