ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

YS Sharmila: షర్మిల పాదయాత్రకు వైసీపీ నాయకురాలు.. మరికాసేపట్లో కాంగ్రెస్‌లోకి..

ABN, Publish Date - Apr 05 , 2024 | 11:19 AM

వైసీపీకి దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నాయి. పార్టీలోని నేతలంతా తలో దిక్కు చూసుకుంటున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో పార్టీకి భారీ దెబ్బ పడింది. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. కాంగ్రెస్‌లో చేరక ముందే నేడు ఆమె కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ వైఎస్ షర్మిల పాదయాత్రలో పాల్గొన్నారు.

కడప: వైసీపీకి దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నాయి. పార్టీలోని నేతలంతా తలో దిక్కు చూసుకుంటున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో పార్టీకి భారీ దెబ్బ పడింది. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. కాంగ్రెస్‌లో చేరక ముందే నేడు ఆమె కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) పాదయాత్రలో పాల్గొన్నారు. మరికాసేపట్లో షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో కిల్లి కృపారాణి చేరనున్నారు.

Raghurama Krishnaraju: ఏ పార్టీ సభ్యత్వం తీసుకున్నా.. మరుక్షణమే నా ఎంపీ సీటు పోతుంది

శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. కేంద్రమాజీ మంత్రి కిల్లి కృపారాణి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. 2009లో శ్రీకాకుళం ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. తరువాత మారిన రాజకీయ సమీకరణలతో ఆమె వైసీపీలో చేరారు. అయితే టెక్కలి ఎమ్మెల్యే, శ్రీకాకుళం ఎంపీ టికెట్‌ను ఆమె ఆశించారు. చివరికి నామినేటెడ్ పదవుల్లోనూ ఆమెకు అవకాశం కల్పించలేదు. ఈ ఎన్నికల్లో టికెట్ నిరాకరించడంతో పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తాజాగా వైసీపీకి రాజీనామా చేసిన ఆమె కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టెక్కలి నియోజకవర్గంలో కనీసం గౌరవం దక్కడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ రాజీనామా సమర్పించారు. నియోజకవర్గంలో ఎవరూ పట్టించుకోవడం లేదని, పార్టీ కోసం కష్టపడే వాళ్లకు గుర్తింపు దక్కడం లేదన్నారు.

Janasena-YCP: జనసేన అభ్యర్థికి వైసీపీ నేతల బెదిరింపులు

జిల్లాలో కీలకనేతగా..

కల్లి కృపారాణి 2012-14 మధ్య కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రిగా మన్మోహన్ సింగ్ కేబినేట్‌లో పనిచేశారు. జిల్లాలోని బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతగా ఉన్నారు. ఆమె టెక్కలి అసెంబ్లీ లేదా శ్రీకాకుళం ఎంపీ టికెట్ ఆశించారు. ఆమెకు దక్కలేదు. టెక్కలి ఎమ్మెల్యే టికెట్ దువ్వాడ శ్రీనివాస్‌కు ఇవ్వగా.. ఎంపీ టికెట్ పేరాడ తిలక్‌కు ఇచ్చారు. వీరిద్దరూ కృపారాణి సామాజిక వర్గానికి చెందినవాళ్లే.

AP Elections: దోచేయ‌డానికి సిద్ధమా.. ప్ర‌జ‌ల ప్ర‌శ్న‌ల‌తో వైసీపీ ఉక్కిరి బిక్కిరి..!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 05 , 2024 | 11:19 AM

Advertising
Advertising