AP News: అగ్రిగోల్డ్ భూముల్లో కలప లేపేసిన వైసీపీ దొంగలు..
ABN , Publish Date - May 18 , 2024 | 10:28 AM
వైసీపీ నేతల అక్రమాలకు అంతూ పొంతూ లేకుండా పోతోంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఏదో ఒక అవినీతికి పాల్పడుతూనే ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణాతో పాటు డ్రగ్స్‌కు అడ్డాగా రాష్ట్రాన్ని మార్చేశారు. అది చాలదన్నట్టు ఇప్పుడు నెల్లూరు జిల్లాలో మరో అక్రమానికి తెరలేపారు.
నెల్లూరు: వైసీపీ (YSRCP) నేతల అక్రమాలకు అంతూ పొంతూ లేకుండా పోతోంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఏదో ఒక అవినీతికి పాల్పడుతూనే ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణాతో పాటు డ్రగ్స్‌కు అడ్డాగా రాష్ట్రాన్ని మార్చేశారు. అది చాలదన్నట్టు ఇప్పుడు నెల్లూరు జిల్లాలో మరో అక్రమానికి తెరలేపారు. ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీ దొంగలు రెచ్చిపోతున్నారు. దుత్తలూరు మండలం రాచవారిపల్లి ప్రాంతంలోని అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్ అక్రమ రవాణా చేస్తున్నారు.
Big Alert: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. మెట్రో రైలు వేళలు మారిపోయాయ్..
ప్రతి వారంలో అయిదు లారీల్లో జామాయిల్ కలపను అక్రమంగా వేరే ప్రాంతాలకు తరలించారు. 200 ఎకరాల అగ్రిగోల్డ్ భూముల్లో రూ.50 లక్షల కలప మాయమైందంటే ఆ పార్టీ నేతలు ఏ స్థాయిలో అక్రమాలకు తెరదీస్తున్నారో అర్థమవుతుంది. ఫిర్యాదులు అందుతున్నా, అధికారులు పట్టించుకోలేదు. 2019లో అగ్రిగోల్డ్ బాధితులు అందరికీ న్యాయం చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. అరకొరగా చెల్లింపులు జరిపి అగ్రిగోల్డ్ బాధితులకి జగన్ ప్రభుత్వం అన్యాయం చేసింది. అగ్రిగోల్డ్ ఆస్థులు కాపాడటంలోనూ వైఫల్యం చెందింది.
ఇవి కూడా చదవండి..
AP Government: ఏబీ వెంకటేశ్వరరావుపై ప్రభుత్వం కక్ష సాధింపు..
AP News: వాన పడింది.. వజ్రాల వేట మొదలైంది..
Read more AP News and Telugu News