Share News

IRCTC: పండుగల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరకే ప్రసిద్ధ ఆలయాల సందర్శన

ABN , Publish Date - Oct 03 , 2024 | 05:40 PM

మీరు పండుగల సందర్భంగా దేశంలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించాలని చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే ఎప్పటిలాగే IRCTC మరో డివైన్ టూర్ ప్యాకేజీతో ముందుకొచ్చింది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.

IRCTC: పండుగల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరకే ప్రసిద్ధ ఆలయాల సందర్శన
IRCTC Divine Puri 2024

దేశవ్యాప్తంగా దసరా పండుగ హాడావిడి మొదలైంది. ఈ క్రమంలోనే మీరు వచ్చే దీపావళి పండుగ సందర్భంగా ఏదైనా ప్రత్యేక ఆలయాలను ఫ్యామిలీతో కలిసి సందర్శించాలని ప్లాన్ చేస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే IRCTC అందుకోసం తక్కువ ధరల్లో ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీ పేరు డివైన్ పూరి. ఈ టూర్ ప్యాకేజీ 3 రాత్రులు, 4 రోజులు ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీలో పర్యాటకులు పూరి, చిల్కా సరస్సు, కోణార్క్, భువనేశ్వర్‌లలోని ప్రముఖ ఆలయాలను చూసేందుకు తక్కువ ధరల్లో విమాన సౌకర్యంతో సందర్శించడానికి వెళతారు.


ఒంటరిగా వెళితే

IRCTC ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధరను రూ. 31,500గా ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీలో పర్యాటకులు విమానంలో ప్రయాణిస్తారు. టూర్ ప్యాకేజీలో మొత్తం 30 సీట్లు ఉంటాయి. IRCTC ఈ టూర్ ప్యాకేజీకి ఎప్పటికప్పుడు ఛార్జీలు మారుతూ ఉంటాయి. ముందుగా బుక్ చేసుకుంటే తక్కువ ధరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. టూర్ ప్యాకేజీలో ఒంటరిగా ప్రయాణిస్తే మీరు ఒక్కో వ్యక్తికి రూ. 44,600 చెల్లించాలి. IRCTC టూర్ ప్యాకేజీలలో పర్యాటకులకు వసతి, ఆహారం ఉచితంగా అందించబడతాయి. టూర్ ప్యాకేజీలలో పర్యాటకులకు అనేక ఇతర సౌకర్యాలు కూడా అందించబడతాయి.


పిల్లలకు ఎంత

ఇద్దరు వ్యక్తులతో ఈ టూర్ ప్యాకేజీలో ప్రయాణిస్తే ఒక్కొక్కరికి రూ.34,200 చెల్లించాల్సి ఉంటుంది. టూర్ ప్యాకేజీలో ముగ్గురితో ప్రయాణిస్తే ఒక్కొక్కరికి రూ. 31,500 చెల్లించాలి. మీరు ఈ ప్యాకేజీలో 5 నుంచి 11 సంవత్సరాల మధ్య పిల్లలతో ప్రయాణం చేస్తే, మీరు ఒక్కొక్కరికి రూ. 25,000 చెల్లించాలి. అదే సమయంలో 5 నుంచి 11 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు, మీరు బెడ్ ఛార్జీ లేకుండా రూ. 24,900 పే చేయాలి. 2 నుంచి 4 సంవత్సరాల వయస్సు గల పిల్లల ఛార్జీ కోసం మీరు రూ. 20,800 చెల్లించాలి. ఈ టూర్ ప్యాకేజీ నవంబర్ 29, 2024 నుంచి ప్రారంభమై, డిసెంబర్ 14 వరకు కొనసాగుతుంది. ఇది ఢిల్లీ నుంచి ప్రారంభమవుతుంది.


రీఫండ్ వస్తుందా?

మీరు ఈ టూర్ ప్రోగ్రామ్‌ను ముందుగా బుక్ చేసుకుంటే తప్పకుండా హాజరు కావాల్సి ఉంటుంది. ఒక వేళ మీరు దీనికి హాజరు కాకపోతే మీరు చెల్లించిన డబ్బు వాపసు ఇవ్వబడదు. ఈ టూర్ ప్రారంభమైన వెంటనే మీరు అందులో ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి. ఏదైనా కారణం వల్ల ప్రయాణం అసంపూర్తిగా ఉంటే దానికి మీరే బాధ్యులవుతారు. ఇది కాకుండా మీ కారణంగా ఎవరైనా ఏదైనా సమస్యను ఎదుర్కొంటే కంపెనీ మీ ప్రయాణాన్ని మధ్యలోనే ఆపివేసే అవకాశం ఉంటుంది. ఆ క్రమంలో కూడా మీకు డబ్బు తిరిగి చెల్లించబడదని ముందుగానే IRCTC ప్రకటించింది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ https://www.irctctourism.com/pacakage_description?packageCode=NDA15 క్లిక్ చేయండి.


ఇవి కూడా చదవండి:

Loans: గూగుల్ పే నుంచి క్షణాల్లోనే రూ. 50 లక్షల లోన్స్


SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్‌ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు

Cash Deposit Machine: క్యాష్ డిపాజిట్ మెషిన్ ద్వారా రోజు ఎంత డిపాజిట్ చేసుకోవచ్చు..


Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Read More Business News and Latest Telugu News

Updated Date - Oct 03 , 2024 | 05:41 PM