Share News

Viral Video: వడోదర కారు ప్రమాదంలో నిందితుడు డ్రైవింగ్ చేయలేదా..బాటిల్ వీడియో వైరల్

ABN , Publish Date - Mar 17 , 2025 | 12:05 PM

ఇటీవల గుజరాత్‌లోని వడోదరలో జరిగిన కారు ప్రమాదం ప్రస్తుతం హాట్ టాపిక్‎గా మారిపోయింది. ఈ ఘటన గురించి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

Viral Video: వడోదర కారు ప్రమాదంలో నిందితుడు డ్రైవింగ్ చేయలేదా..బాటిల్ వీడియో వైరల్
Vadodara Car Accident

గుజరాత్‌(Gujarat)లోని వడోదరలో ఇటీవల జరిగిన భయానక రోడ్డు ప్రమాదం (Vadodara car accident) గురించి రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. 20 ఏళ్ల లా విద్యార్థి రక్షిత్ చౌరాసియా తన కారుతో ఐదుగురిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా, మిగిలిన వారు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటనకు సంబంధించిన తాజాగా మరోక సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది.

వీడియోలో ప్రమాదానికి కొద్ది గంటల ముందు రక్షిత్ తన స్నేహితుడు ప్రాన్షుతో కలిసి మరో స్నేహితుడి ఇంట్లో ఉన్నాడు. ఆ క్రమంలో రక్షిత్ ఒక బాటిల్ పట్టుకుని ఉన్నాడు. అయితే, అందులో ఏముందో స్పష్టంగా తెలియలేదు. మరో వీడియో క్లిప్‌లో, నల్లటి సెడాన్ రోడ్డు దాటి వెళ్లి, సమీపంలో ఆగినట్లు కనిపించింది. ఇది ప్రమాదానికి గురైన కారు కావొచ్చని అనుమానిస్తున్నారు.


ఇంకొక రౌండ్

సీసీటీవీ ఫుటేజ్, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాల ప్రకారం రక్షిత్, ప్రాన్షు ప్రమాదానికి ముందు దాదాపు 45 నిమిషాల పాటు ఒక ఇంటి వద్ద గడిపారు. మొదట ప్రాన్షు కారును నడిపిస్తుండగా, చివరి క్షణంలో రక్షిత్ డ్రైవర్ సీట్లోకి మారి, కారు వేగంగా నడిపారని అంటున్నారు. అతను కారు నడిపే సమయంలో చాలా మద్యం తాగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ప్రమాదం సంభవించిన వెంటనే, కారు దిగిన రక్షిత్ ఇంకొక రౌండ్, ఇంకొక రౌండ్ అంటూ అరిచాడు.

ప్రమాదం ఎలా జరిగింది?

ఆ క్రమంలో వడోదరలో శుక్రవారం రాత్రి జరిగిన ప్రమాదంలో రక్షిత్ కారు నడిపి అనేక ద్విచక్ర వాహనాలను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కారు అదుపు తప్పడంతో రోడ్డు వెంట ఉన్న వ్యక్తులను తీవ్రంగా గాయపరిచింది. ప్రమాదం అనంతరం, స్థానికులు రక్షిత్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ప్రాన్షు కూడా అరెస్టయ్యాడు.


పోలీసులకు మాత్రం..

అయితే, రక్షిత్ తాను మద్యం సేవించలేదని, కారు వేగం గంటకు 50 కిలోమీటర్లే ఉందని పోలీసులకు తెలిపాడు. అంతేకాదు కారు గుంత నుంచి పోయిన తర్వాత ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయ్యాయని, ఆ కారణంగా కారు వ్యూ కనిపించక ప్రమాదం జరిగిందని రక్షిత్ పోలీసులకు చెప్పాడు. మరోవైపు ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, కారు అతి వేగంగా వెళ్లడం వల్లనే ప్రమాదం జరిగిందన్నారు.

ఫిబ్రవరిలోనూ రక్షిత్ గొడవ చేసినట్టు తెలుస్తోంది

పోలీసుల అన్వేషణలో మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరిలోనూ రక్షిత్, అతని స్నేహితులు మద్యం సేవించి గొడవ సృష్టించినప్పుడు, స్థానిక ప్రజలు అతనిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అంటే, అతనికి మద్యం మత్తులో చేసిన మొదటి తప్పు ఇది కాదని తెలుస్తోంది.


తదుపరి చర్యలు

ప్రస్తుతం పోలీసులు రక్షిత్, ప్రాన్షుపై కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. నిందితుల మద్యం సేవించారా లేదా అనే విషయంపై బ్లడ్ టెస్ట్ ద్వారా వెలుగులోకి రానుంది. సీసీటీవీ ఫుటేజ్, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:


PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..

Gold Silver Rates Today: గుడ్ న్యూస్..రెండో రోజు కూడా తగ్గిన బంగారం, వెండి ధరలు..


Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 17 , 2025 | 12:06 PM