Viral News: రూ.10 వాటర్ బాటిల్ రూ.100.. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్
ABN , Publish Date - Dec 18 , 2024 | 04:45 PM
మీరు ఏదైనా ఈవెంట్ లేదా కచేరి కార్యక్రమానికి వెళ్తున్నారా. అయితే జాగ్రత్త. ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో ధరల దోపిడీ జరుగుతుందని తెలుస్తోంది. తాజాగా చోటుచేసుకున్న అలాంటి సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
10 రూపాయల వాటర్ బాటిల్ 100 రూపాయలకు సేల్ చేస్తున్నారని ఓ వినియోగదారుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాదు అందుకు సంబంధించిన బీల్లును సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అసహనం వ్యక్తం చేశాడు. ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ Zomato ఓ సంగీత కచేరీలో రూ.10 వాటర్ బాటిళ్లను రూ.100కి విక్రయిస్తోందని పల్లబ్ దే అనే వినియోగదారుడు ఈ మేరకు పేర్కొన్నాడు. కచేరీ వేదికలో రూ. 100కి విక్రయించడానికి జొమాటోకు ఎలా అనుమతి వచ్చిందని తెలంగాణ హైకోర్టు న్యాయవాదిని ట్యాగ్ చేస్తూ ఆయన చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో రియాక్షన్స్
ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు అనేక రకాలుగా స్పందిస్తున్నారు. MRP కంటే ఎక్కువ ధరకు విక్రయించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా అధిక MRPకి సేల్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇలా విక్రయించడం వినియోగదారుల రక్షణ చట్టాలను ఉల్లంఘించడమేనని అంటున్నారు. ఇలాంటి క్రమంలో వినియోగదారులు ఎవరికీ కూడా అదనంగా చెల్లించకూడదని చెబుతున్నారు. ఇది ప్రదర్శన కాదు, పూర్తిగా దోపిడీ చేయడమని మరికొంత మంది కామెంట్లు చేశారు.
ఇంకా ఏం అన్నారంటే..
ప్రతి ఒక్కరూ ఇలాంటి చర్యలపై స్వరం పెంచాలని మరొకరు అన్నారు. ఎంఆర్‌పీ రూ. 10 కంటే ఎక్కువ వసూలు చేస్తే వారిపై కేసులు పెట్టాలన్నారు. ఇలాంటి ఈవెంట్లలో వారు MRP నిర్వచనాన్ని పూర్తిగా మార్చేస్తారని ఇంకో వ్యక్తి అన్నారు. అలా అనేక మంది వినియోగదారులు ఆయా లోపాలను ఎత్తి చూపిస్తూ కామెంట్లు చేశారు. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే మీకు కూడా ఇలాంటి సంఘటన ఎప్పుడైనా ఎదురైందా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి మరి.
ఇవి కూడా చదవండి:
Top Mutual Funds: గత ఐదేళ్లలో టాప్ 7 మ్యూచువల్ ఫండ్స్.. ఎంత రిటర్న్స్ ఇచ్చాయంటే..
Narayana Murthy: 70 గంటల పని విధానాన్ని మళ్లీ ప్రస్తావించిన నారాయణమూర్తి.. ఈసారి ఏం చెప్పారంటే..
Bitcoin Investment: ఇది కదా లక్కంటే.. అప్పటి 100 రూపాయల పెట్టుబడి, ఇప్పుడు 1.7 కోట్లు
Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..
Bima Sakhi Yojana 2024: మహిళలకు మంచి ఛాన్స్.. బీమా సఖీ యోజనతో రూ. 48 వేలు సంపాదించే అవకాశం..
Bank Holidays: ఈ నెలలో 17 రోజులు బ్యాంకులు క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..
Read More Business News and Latest Telugu News