Share News

Stock Market: లాభాల నుంచి నష్టాల్లోకి స్టాక్ మార్కెట్లు.. 1537 పాయింట్లు కోల్పోయిన మిడ్ క్యాప్

ABN , Publish Date - Oct 07 , 2024 | 11:37 AM

మిడిల్ ఈస్ట్‌లో తీవ్ర ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు నిలకడగా ఉన్నాయి. కానీ దేశీయ స్టాక్ మార్కెట్లు మాత్రం ఈరోజు లాభాలతో మొదలై మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే సూచీలు ఏ మేరకు పడిపోయాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Stock Market: లాభాల నుంచి నష్టాల్లోకి స్టాక్ మార్కెట్లు.. 1537 పాయింట్లు కోల్పోయిన మిడ్ క్యాప్
Stock market updates today

దేశీయ స్టాక్ మార్కెట్(stock market) ఈక్విటీ సూచీలు సోమవారం(అక్టోబర్ 7న) లాభాలతో మొదలై, తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 69.50 పాయింట్లు పెరిగి 25,084.10 వద్ద, బీఎస్‌ఈ సెన్సెక్స్ 238.83 పాయింట్లు జంప్ చేసి 81,927.29 స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత మిశ్రమంగా మారి దిగువకు పయనిస్తున్నాయి. ఈ క్రమంలో ఉదయం 11.15 నిమిషాల నాటికి సెన్సెక్స్ 400 పాయింట్ల నష్టపోగా, నిఫ్టీ 150 పాయింట్లు తగ్గింది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీలు వరుసగా 320, 1537 పాయింట్లు నష్టపోయాయి. ఈ నేపథ్యంలో మదుపర్లు లక్షల కోట్ల మేర సంపదను నష్టపోయారు.


టాప్ 5 స్టాక్స్

గ్లోబల్ మార్కెట్ నుంచి వచ్చిన సంకేతాలతోపాటు పలు అంశాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు దిగువకు పయనిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం అదానీ పోర్ట్స్, ONGC, కోల్ ఇండియా, NTPC, అదానీ ఎంటర్‌ప్రైస్ కంపెనీల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉండగా.. ITC, సిప్లా, ICICI బ్యాంక్, HDFC లైఫ్, భారతి ఎయిర్‌టెల్ సంస్థల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉన్నాయి. ఇక నిఫ్టీలో 43 షేర్లు గ్రీన్‌లో ఉండగా, మిగిలిన షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ షేర్లు పతనం దిశగా కొనసాగుతున్నాయి. ఈ స్టాక్ 8.9% క్షీణించి ఇంట్రా డే కనిష్ట స్థాయి రూ.90.26కి చేరుకుంది. సర్వీస్ సమస్యల కారణంగా కంపెనీ ప్రస్తుతం ఫోకస్ అయ్యింది.


ఈ స్టాక్స్ కూడా

లాభాల్లో శ్రీరామ్ ఫైనాన్స్ (1.76 శాతం వృద్ధి), ఐటీసీ, ట్రెంట్, హెచ్‌సీఎల్‌టెక్, హీరో మోటోకార్ప్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు టైటాన్ (1.03 శాతం క్షీణత) నష్టాలను ఎదుర్కొంది. హిందుస్థాన్ యూనిలీవర్, ONGC, బ్రిటానియా ఇండస్ట్రీస్, పవర్ గ్రిడ్ కార్ప్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఎఫ్‌ఎంసీజీ, ఆటో, మీడియా, రియాల్టీ ఆయిల్ అండ్ గ్యాస్‌తో సహా సెక్టోరల్ ఇండెక్స్‌లు ఒక్కొక్కటి 1 శాతానికి పైగా పడిపోయాయి. నిఫ్టీ మీడియా ఇండెక్స్ 2.53 శాతం క్షీణించింది. IT, PSU బ్యాంక్ సూచీలు వరుసగా 0.45 శాతం, 0.61 శాతం అధిక ముగింపుతో కొంత లాభాలను ఆర్జించాయి.


ఇతర మార్కెట్లు

మరోవైపు జపాన్ Nikkei రెండు శాతం ర్యాలీతో ప్రాంతీయ ఈక్విటీ లాభాలకు దారితీసింది. ఆస్ట్రేలియా స్టాక్ బెంచ్‌మార్క్ 0.12 శాతం, దక్షిణ కొరియా కోస్పి 0.29 శాతం లాభపడ్డాయి. హాంగ్ కాంగ్ హాంగ్ సెంగ్ ఇంకా తెరవలేదు. గోల్డెన్ వీక్ సెలవుదినం కోసం ప్రధాన భూభాగంలోని చైనా స్టాక్‌లు మంగళవారం వరకు మూసివేయబడ్డాయి. MSCI ఆసియా పసిఫిక్ షేర్ల విస్తృత సూచిక 0.4 శాతం పెరిగింది. శుక్రవారం నాటి పేరోల్స్ డేటా తర్వాత నగదు సూచిక ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత US డౌ ఫ్యూచర్స్ 0.08 శాతం పెరిగింది. US డాలర్ ఆగస్ట్ 16 తర్వాత మొదటిసారిగా 149.10 యెన్‌లకు చేరుకుంది.


ఇవి కూడా చదవండి:

Viral Video: జోమాటో కంపెనీ ఓనర్‌కు మాల్‌లోకి నో ఎంట్రీ.. అసలేం జరిగిందంటే..


Bhavish Aggarwal: కమెడియన్‌పై ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ గరం గరం.. నెటిజన్ల కామెంట్స్



IRCTC: నవరాత్రుల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరల్లో సందర్శించండి


Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్‌ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు

IRCTC: పండుగల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరకే ప్రసిద్ధ ఆలయాల సందర్శన


Read More Business News and Latest Telugu News

Updated Date - Oct 07 , 2024 | 11:41 AM