Share News

Tata Curve ICE: రూ.9 లక్షలకే కొత్త మోడల్ కార్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Sep 02 , 2024 | 04:08 PM

సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు టాటా మోటార్స్ కర్వ్ ఐస్ మోడల్‌ కారును మార్కెట్లోకి విడుదల చేశారు. అయితే దీని ఫీచర్లు ఎలా ఉన్నాయి, ప్రారంభ ధర ఎలా ఉందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Tata Curve ICE: రూ.9 లక్షలకే కొత్త మోడల్ కార్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..
Tata Curve ICE model

భారతదేశంలో టాటా మోటార్స్(tata motors) కర్వ్ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను ప్రారంభించిన తర్వాత, ఇప్పుడు కొత్తగా ఐస్(Tata Curve ICE) వెర్షన్‌ను భారతీయ మార్కెట్లోకి విడుదల చేశారు. అయితే దీని ఫీచర్లు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కార్ ఆకర్షణీయమైన డాష్‌బోర్డ్‌తో వస్తుంది. ఇది పెద్ద సెంట్రల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇది డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇల్యూమినేటెడ్ టాటా లోగోతో మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్‌తో లభిస్తుంది. ఇతర ఫీచర్లలో పనోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ టెయిల్‌గేట్, ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు, వైర్‌లెస్ ఛార్జర్, సరికొత్త iRA అప్లికేషన్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, ఇంజిన్ స్టార్ట్, స్టాప్ బటన్స్ కూడా ఉన్నాయి.


ఎనిమిది రకాలు

ఇది చూడటానికి అందంగా ఉండటమే కాకుండా పెద్ద స్క్రీన్, విలాసవంతమైన ఇంటీరియర్, 360 డిగ్రీల కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో కూడిన పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంది. అధునాతన డ్రైవర్ సహాయ వ్యవస్థ వంటి అనేక ఫీచర్లు కూడా దీనిలో ఉన్నాయి. భద్రత కోసం దీనిలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ESP, ఆటో హోల్డ్, అన్ని డిస్క్ బ్రేక్‌లు, లెవల్ 2 ADA వంటి లక్షణాలతో వస్తుగేవ. ఈ SUVలో కస్టమర్‌లు ఎనిమిది వేరియంట్‌లను పొందుతారు. ఇందులో స్మార్ట్, ప్యూర్+, ప్యూర్+ఎస్, క్రియేటివ్, క్రియేటివ్ ఎస్, క్రియేటివ్+ఎస్, అకాంప్లిష్డ్, అకాంప్లిష్డ్+ఎ ఉన్నాయి. ఇది కాకుండా కస్టమర్లు గోల్డ్ ఎసెన్స్, ఫ్లేమ్ రెడ్, ప్రిస్టైన్ వైట్, ప్యూర్ గ్రే, డేటోనా గ్రే, ఒపెరా బ్లూ వంటి ఆరు రంగు ఎంపికలను పొందవచ్చు.


ధర ఎంత

1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, మాన్యువల్ గేర్‌బాక్స్ ఎంపికతో టాటా కర్వ్ బేస్ మోడల్ స్మార్ట్ వేరియంట్ ధర రూ.9.99 లక్షలు. కాగా ప్యూర్ ప్లస్ వేరియంట్ ధర రూ. 10.99 లక్షలు, క్రియేటివ్ వేరియంట్ ధర రూ. 12.19 లక్షలు, క్రియేటివ్ ఎస్ వేరియంట్ ధర రూ. 12.69 లక్షలు, క్రియేటివ్ ప్లస్ ఎస్ వేరియంట్ ధర రూ. 13.69 లక్షలు, అదే సమయంలో 1.2 లీటర్ టర్బో GDi పెట్రోల్ ఇంజన్, టాటా కర్వ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన క్రియేటివ్ S వేరియంట్ ధర రూ. 13.99 లక్షలు.

SUV సెగ్మెంట్‌లో

క్రియేటివ్ S వేరియంట్ ధర రూ. 14.99 లక్షలు, అన్‌కంప్లీటెడ్ ఎస్ ధర రూ. 15.99 లక్షలుగా ఉంది. అక్టోబరు 31 నాటికి టాటా కర్వ్‌ను కొనుగోలు చేసిన కస్టమర్‌లు ప్రారంభ ధర ప్రయోజనాన్ని పొందుతారు. డెలివరీలు ప్రారంభమైన వెంటనే మధ్యతరహా SUV సెగ్మెంట్‌లోని హ్యుందాయ్ క్రెటా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా వంటి వాహనాలకు టాటా కర్వ్ గట్టి పోటీ ఇవ్వనుంది.


ఇవి కూడా చదవండి:

Madhabi Puri Buch: సెబీ చీఫ్ మాధవిపై కాంగ్రెస్ సంచలన వ్యాఖ్యలు.. 3 చోట్ల జీతం తీసుకుంటున్నారని ఆరోపణ

Next Week IPOs: ఈ వారం రానున్న ఐపీఓలివే.. షేర్ మార్కెట్‌లో మనీ సంపాదించే ఛాన్స్

ITR Refund: ఐటీఆర్ రీఫండ్ ఇంకా వాపసు రాలేదా.. అయితే ఇలా చేయండి


Read More Business News and Latest Telugu News

Updated Date - Sep 02 , 2024 | 04:10 PM