టాటా మోటార్స్, కియ కార్ల ధరలు పెంపు
ABN , Publish Date - Dec 10 , 2024 | 01:56 AM
టాటా మోటార్స్, కియ ఇండియా కార్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. టాటా మోటార్స్.. ఎలక్ట్రిక్ వాహనాలు సహా అన్ని ప్యాసింజర్ కార్ల ధరలను 3 శాతం వరకు పెంచుతున్నట్లు...
న్యూఢిల్లీ: టాటా మోటార్స్, కియ ఇండియా కార్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. టాటా మోటార్స్.. ఎలక్ట్రిక్ వాహనాలు సహా అన్ని ప్యాసింజర్ కార్ల ధరలను 3 శాతం వరకు పెంచుతున్నట్లు వెల్లడించగా కియ ఇండియా తన ఉత్పత్తుల ధరలను 2 శాతం మేర పెంచుతున్నట్లు తెలిపింది. పెంచిన ధరలు జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని ఇరు సంస్థలు తెలిపాయి. ముడి సరుకుల ధరలు పెరిగిపోవటంతో కార్ల ధరలు పెంచకతప్పటం లేదని పేర్కొన్నాయి. ఇప్పటికే మారుతి సుజుకీ, హ్యుండ య్, జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, ఆడి ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి.