ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Cyber ​​criminals: వామ్మో.. మళ్లీ రూ.12 లక్షలు కొట్టేశారుగా...

ABN, Publish Date - Jul 06 , 2024 | 12:47 PM

మీ పేరున ఉన్న బ్యాంకు ఖాతాల ద్వారా విదేశాలకు అక్రమంగా డబ్బు తరలించారని బెదిరించిన సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​criminals) నగరానికి చెందిన వ్యక్తి నుంచి రూ.12 లక్షల కాజేశారు.

- రూ.12 లక్షలు కాజేసిన సైబర్‌ నేరగాళ్లు

హైదరాబాద్‌ సిటీ: మీ పేరున ఉన్న బ్యాంకు ఖాతాల ద్వారా విదేశాలకు అక్రమంగా డబ్బు తరలించారని బెదిరించిన సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​criminals) నగరానికి చెందిన వ్యక్తి నుంచి రూ.12 లక్షల కాజేశారు. నగరానికి చెందిన ప్రైవేట్‌ ఉద్యోగి(23)కి ఓ వ్యక్తి ఫోన్‌ చేశాడు. ముంబై కొరియర్‌ సంస్థ నుంచి ఫోన్‌ చేస్తున్నాన్నాని చెప్పిన వ్యక్తి మీ పేరుతో ముంబై నుంచి సౌదీకి పంపిన కొరియర్‌(Courier)లో 50 గ్రాముల ఎండీఎంఏ, 5 కిలోల డయాబెటిక్‌ టాబ్లెట్‌లు గుర్తించామని చెప్పాడు. దీనికి సంబంధించి ముంబై క్రైం బ్రాంచ్‌ అధికారులతో మాట్లాడాలంటూ కాల్‌ కలిపాడు. పోలీస్‌ డ్రస్‌లో ఉన్న సైబర్‌ నేరగాడు స్కైప్‌ కాల్‌(Skype call)లో బాదితుడితో మాట్లాడి ఆధార్‌, పాన్‌ ఇతర వివరాలు సేకరించాడు.

ఇదికూడా చదవండి: IAS officers: భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు..


మీపై ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌ కేసు నమోదైందని చెప్పాడు. అంతే కాకుండా ఆధార్‌(Aadhaar)కు లింక్‌ ఉన్న పలు బ్యాంకు ఖాతాల ద్వారా విదేశాలకు డబ్బు తరలిందని, దీనిపై మనీలాండరింగ్‌ కేసు నమోదయ్యాయని బెదిరించాడు. ఆదాయం గురించి తెలపాలని ఆర్‌బీఐ వెరిఫికేషన్‌ కోసం సూచించిన ఖాతాలో రూ.12 లక్షలు (రీఫండబుల్‌ ఎమోంట్‌) జమ చేయాలని, లేని పక్షంలో అరెస్ట్‌ తప్పదని భయపెట్టాడు. సైబర్‌ నేరగాడి మాటలను నమ్మిన బాఽధితుడు అతడు సూచించిన బ్యాంకు ఖాతాకు రూ.12 లక్షలు బదిలీ చేశాడు. తర్వాత డబ్బు రాకపోవడంతో మోసపోయానని గ్రహించి సైబర్‌ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేశాడు.


ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 06 , 2024 | 12:47 PM

Advertising
Advertising
<