Hyderabad: సీబీఐ అధికారులమంటూ రూ. 91.64 లక్షలు దోచేశారు
ABN , Publish Date - May 08 , 2024 | 01:08 PM
సీబీఐ అధికారులుగా పరిచయం చేసుకున్న సైబర్ నేరగాళ్లు(Cyber criminals) ‘మీ బ్యాంకు ఖాతాల నుంచి విదేశాలకు హవాలా డబ్బు వెళ్లింది’ అని బెదిరించి నగరవాసి నుంచి రూ. 91.64 లక్షలు కాజేశారు.
హైదరాబాద్ సిటీ: సీబీఐ అధికారులుగా పరిచయం చేసుకున్న సైబర్ నేరగాళ్లు(Cyber criminals) ‘మీ బ్యాంకు ఖాతాల నుంచి విదేశాలకు హవాలా డబ్బు వెళ్లింది’ అని బెదిరించి నగరవాసి నుంచి రూ. 91.64 లక్షలు కాజేశారు. నగరానికి చెందిన 74ఏళ్ల వ్యక్తికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి, ఫెడెక్స్ కొరియర్ సర్వీ్‌సులో మీ పేరున బ్యాంకాక్ నుంచి థాయ్‌లాండ్(Thailand)కు పంపిన పార్సిల్ అడ్రస్ సరిగాలేని కారణంగా తిరిగి వచ్చిందని చెప్పారు. అందులో పాస్‌పోర్టులు, బ్యాంకు పాస్‌పుస్తకాలు, 140 గ్రాముల ఎండీఎంఏతో పాటు, 4 కిలోల దుస్తులు ఉన్నాయని చెప్పారు. దీనిపై కేసు నమోదైందని చెప్పారు. కొద్దిసేపటి తర్వాత వీడియో కాల్ చేసిన సైబర్ నేరగాడు సీబీఐ అధికారి(CBI officer)గా పరిచయం చేసుకున్నాడు.
ఇదికూడా చదవండి: Hyderabad: వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా ఎస్సైనే బెదిరించి దోచుకున్నారు..
‘మీ ఆధార్‌కు అనుసంధానమైన ఖాతాల నుంచి విదేశాలకు 66..88 మిలియన్ల డాలర్ల హవాలా డబ్బు వెళ్లిందని, ఇందులో కొంత మొత్తం బ్యాంకాక్ పోలీసులు సీజ్ చేశారు. మీపై కేసు నమోదైందని, ఏక్షణంలోనైనా అరెస్టయ్యే అవకాశముంది’ అని బెదిరించాడు. ‘మీ ఖాతాల్లో ఉన్న డబ్బు ఏ మార్గాల్లో వచ్చిందో పరిశీలించి దానికి సంబంధించి సీబీఐ అధికారులు సర్టిఫికెట్ ఇస్తారు’ అని చెప్పాడు. అందుకోసం ‘మీ దగ్గర ఉన్న డబ్బును సీబీఐ ఖాతాకు బదిలీ చేయాలి’ అని సూచించాడు. నమ్మకం కలిగించేందుకు సీబీఐ లెటర్‌హెడ్‌ను చూపించాడు. దాంతో తన ఖాతాలో ఉన్న రూ. 91.64 లక్షలు సైబర్ నేరగాడు సూచించిన ఖాతాలోకి పంపాడు. తర్వాత ఫోన్‌లు స్విచ్చాఫ్ రావడంతో మోసపోయానని గ్రహించి సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇదికూడా చదవండి: Scam Alert: మెసేజుల పేరుతో మరో కొత్త స్కాం.. తెలుసా మీకు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News