ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Roberry: తెలుగు రాష్ట్రాల్లో ఒక్కరోజే రూ.కోట్లు చోరీ చేసిన కేటుగాళ్లు..

ABN, Publish Date - Sep 22 , 2024 | 11:56 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా పులివెందులలోనూ భారీ దొంగతనం జరిగింది. హరినాథ్ రెడ్డి అనే హెచ్‌పీ గ్యాస్ డీలర్ పట్టణంలోని విజయ హోమ్స్ ప్లాట్ నంబర్ 149లో నివాసం ఉంటున్నాడు.

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం భారీ చోరీలు జరిగాయి. హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతం పోచారం ఐటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ ఉదయం భారీ దొంగతనం జరిగింది. కొర్రెముల మక్తాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నాగభూషణం ఇంట్లో గుర్తుతెలియని దుండగులు రూ.2కోట్లు, 28తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఇంట్లో ఎవరూ లేకపోవడం, ఉన్న ఒక్కరూ ఉదయం పాల కోసం బయటికి వెళ్లడంతో మెరుపువేగంతో దొంగతనం జరిగింది. అయితే తెలిసిన వారే చోరీ చేసి ఉంటారని బాధితుడు, పోలీసులు అనుమానిస్తున్నారు. తన కదలికలు ప్రతి క్షణం కనిపెడుతూ చోరీకి పాల్పడినట్లు వాపోతున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా పులివెందులలోనూ భారీ దొంగతనం జరిగింది. హరినాథ్ రెడ్డి అనే హెచ్‌పీ గ్యాస్ డీలర్ పట్టణంలోని విజయ హోమ్స్ ప్లాట్ నంబర్ 149లో నివాసం ఉంటున్నాడు. అయితే ఆయన కుటుంబసభ్యులతో కలిసి బెంగళూరు వెళ్లారు. ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో తాళాలు పగలకొట్టిన దుండగులు.. కేజీ బంగారం, రెండున్నర కిలోల వెండి, లక్ష రూపాయలు అపహరించారు. బెంగళూరు నుంచి ఇవాళ ఉదయం తిరిగి వచ్చిన బాధితుడు చోరీ జరిగినట్లు గుర్తించి వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు.

Updated Date - Sep 22 , 2024 | 11:56 AM