Dasara 2024: దసరా రోజు.. పాలపిట్టను ఎందుకు చూడాలంటే.. కారణాలు ఇవే?
ABN , Publish Date - Oct 10 , 2024 | 06:10 PM
శరన్నవరాత్రులు ప్రారంభమైనాయి. అమ్మవారు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. నేడు దుర్గాష్టమి. ఈ నేపథ్యంలో శ్రీదుర్గాదేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఈ నవరాత్రి వేడుకలు మరో రెండు రోజుల్లో ముగియనున్నాయి. అయితే దసరా పండగ వేళ.. జమ్మి చెట్టును భక్తులు పూజిస్తారు. అలాగే ఈ పండగ రోజు.. పాలపిట్టను సైతం చూడాలంటారు.
శరన్నవరాత్రులు ప్రారంభమైనాయి. అమ్మవారు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. నేడు దుర్గాష్టమి. ఈ నేపథ్యంలో శ్రీదుర్గాదేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఈ నవరాత్రి వేడుకలు మరో రెండు రోజుల్లో ముగియనున్నాయి. అయితే దసరా పండగ వేళ.. జమ్మి చెట్టును భక్తులు పూజిస్తారు. అలాగే ఈ పండగ రోజు.. పాలపిట్టను సైతం చూడాలంటారు. అయితే పండగ వేళ.. జమ్మి చెట్టును పూజించాలని గతంలో జరిగిన సంఘటనలు సోదాహరణగా వివరిస్తారు. అలాగే పాలపిట్టను దర్శించేందుకు సైతం ఏమైనా సంఘటనలున్నాయా అంటే.. ఉన్నాయని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు.
Also Read: సాహిత్యంలో హాన్ కాంగ్‌కు నోబెల్ పురస్కారం
దసరా రోజు పాలపిట్ట కనిపిస్తే..శుభసూచికంగా భక్తులు భావిస్తారు. ఆ క్రమంలోనే శమీ పూజ అనంతరం పాలపిట్టను చూసేందుకు భక్తులు ఆరాట పడతారు. ఈ పాలపిట్ట మనశ్శాంతికి, ప్రశాంతతకు, కార్యసిద్దికి సంకేతంగా సూచిస్తారు. ఈ పక్షి పరమేశ్వరుడిని ప్రతి రూపంగా భావిస్తారు. అందుకే దసరా పండుగ రోజు పాలపిట్టను చూస్తే అన్ని శుభాలే జరుగుతాయని భక్తులు గాఢంగా నమ్ముతారు.
Also Read: రతన్ టాటాకి ఘోర అవమానం జరిగినా..?
అయితే ఈ భక్తుల నమ్మకం వెనుక పురాణగాథలు సైతం ప్రాచుర్యంలో ఉన్నాయి. త్రేతాయుగంలో రావణాసురుడితో శ్రీరాముడు యుద్ధానికి బయలుదేరిన సమయంలో విజయ దశమి రోజు పాలపిట్ట ఎదురుగా కనిపిస్తుంది. ఈ యుద్ధంలో రాముడు విజయం సాధిస్తాడు. దీంతో పాలపిట్టను శభ సూచికంగా శ్రీరాముడు భావించారని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక మహాభారతంలో అజ్ఞాత వాసానికి వెళ్లే ముందు జమ్మి చెట్టు మీద పాండవులు తమ ఆయుధాలను దాచి ఉంచుతారు.
Also Read: ప్రపంచ కుబేరుల జాబితాలో రతన్ టాటా ఎందుకు లేరంటే..?
ఈ ఆయుధాలను ఇంద్రుడు పాలపిట్ట రూపంలో కాపాలా కాశాడని పురాణలు పేర్కొంటున్నాయి. అలాగే అజ్జాత వాసాన్ని సైతం ముగించుకుని పాండవులు హస్తినాపురానికి వెళ్తున్న సమయంలో వారికి పాలపిట్ట దర్శనమిచ్చిందని వివరిస్తున్నారు. నాటి నుంచి పాండవుల కష్టాలు తీరిపోయాయని వారు చెబుతున్నారు. అంటే కురుక్షేత్రంలో విజయం సాధించడమే కాదు.. మళ్లీ తిరిగి పాండవులు రాజ్యాన్ని సైతం చేజిక్కించుకున్నారు. అందుకే దసరా పర్వదినం రోజు పాలపిట్టను చూస్తే.. మంచి జరుగుతుందని అమ్మవారి భక్తులు గాఢంగా విశ్వసిస్తారు. పురాణాల్లో ఎంతో ప్రాశస్త్యం కలిగిన ఈ పాలపిట్టనే.. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం అధికార పక్షిగా నిర్ణయించాయి. ఈ పక్షిని.. నీలకంఠం పక్షి అని కూడా అంటారు.
Also Read: విలువ కట్టలేని రత్నాన్ని కోల్పోయిన భారత్
Read More Devotional News and Latest Telugu News