Share News

Today Horoscope : ఈ రాశి వారు ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ప్రతిఫలాలు అందుకుంటారు.

ABN , Publish Date - Dec 11 , 2024 | 02:14 AM

నేడు (11-12-2024-బుధవారం) రాజకీయ, సినీరంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.

Today Horoscope : ఈ రాశి వారు ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ప్రతిఫలాలు అందుకుంటారు.

నేడు (11-12-2024-బధవారం) రాజకీయ, సినీరంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.

01 Mesham - Aries.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

రాజకీయ, సినీరంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విదేశీ పర్యటనలకు ఏర్పాట్లు చేసుకుంటారు. ప్రయాణాలు, చర్చలకు అనుకూలమైన రోజు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు మనసుకు ఆనందం కలిగిస్తాయి.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

02 Vrushabham - Taurus.jpg

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

బ్యాంకులు, ఆర్థిక సంస్థల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. పెన్షన్‌, బీమా, పన్నులు, మెడికల్‌ క్లెయిముల వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. ఆధ్మాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.


03 Mithunam - Gemini.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

సమావేశాల్లో ప్రముఖులను కలుసుకుంటారు. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. పదిమందిని కలుపుకుని మంచి కార్యక్రమాలు చేపడతారు. భాగస్వామి సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. సంకల్పం నెరవేరుతుంది.


04 Karkatakam - Cancer.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు అమలు చేసి విజయం సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వ రంగ సంస్థలతో పనులు పూర్తవుతాయి. విందు వినోదాల్లో పెద్దలను కలుసుకుంటారు.


05 Simha - Leo.jpg

సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

చిన్నారులు, ప్రియతములతో ప్రయాణాలు, చర్చలు ఆనందం కలిగిస్తాయి. ఉన్నత విద్య, విదే శీ ప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. వ్యూహాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. సమావేశాల్లో కొత్త పరిచయాలు ఏర్పడతాయి.


06 Kanya - Virgo.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

గృహరుణాలు మంజూరవుతాయి. వారసత్వ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. బీమా, పన్నులు, పెన్షన్‌ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. పెట్టుబడులు లాభిస్తాయి.


07 Tula - libra.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

భాగస్వామితో చర్చలు, ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. పెట్టుబడులకు సంబంధించిన లావాదేవీలకు అనుకూలం. తోబుట్టువుల విషయంలో శుభపరిణామాలు సంభవం. జనసంబంధాలు విస్తరిస్తాయి.


08 Vruschikam - Scorpio.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

వైద్య, పరిశ్రమాలు, వ్యవసాయం, ఫార్మా, హోటల్‌ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. విందు వినోదాల కోసం ఖ ర్చు చేస్తారు. శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు.


09 Dhanassu - Sagittarius.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

సినిమా, టెలివిజన్‌ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీలోని సృజనాత్మకతకు గుర్తింపు లభిస్తుంది. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. ప్రేమానుబంఽధాలు బలపడతాయి. చిన్నారుల విద్యా విషయాల్లో శుభపరిణాలు సంభవం.


10 Makaram - Capricorn.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

గృహారంభ, ప్రవేశాలకు అనుకూలం, ఇంట్లో వేడుకలకు ఏర్పాట్లు చేస్తారు. దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. బదిలీలు, మార్పులకు సంబంధించిన అంశాలను సమీక్షించుకుంటారు.


11 Kumbham - Aquarius.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

తోబుట్టువులతో ఆనందంగా గడుపుతారు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. ప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. బృందకార్యక్రమాల్లో పాల్గొంటారు.


12 Meenam - Pisces FINAL.jpg

మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. కొత్త వ్యూహాలను అమలు చేసి ఆర్థికంగా విజయం సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. ఇంక్రిమెట్లు, బోనస్‌లు లభిస్తాయి. సంకల్పం నెరవేరుతుంది.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Dec 11 , 2024 | 02:14 AM