Share News

Arunachalam Temple : అరుణాచలంలో ఇలా చేస్తే.. వీఐపీ దర్శనం మీ సొంతం

ABN , Publish Date - Mar 20 , 2025 | 09:13 PM

Arunachalam Temple : తమిళనాడులోని అరుణాచలేశ్వరుడిని దర్శించుకొనేందుకు ప్రపంచవ్యాప్తంగా భక్తులు తిరువణమలై తరలి వస్తారు. ఇక పౌర్ణమి రోజు వచ్చిందంటే చాలు.. అరుణాచలేశ్వరుని సన్నిథి భక్తులతో కిటకిటలాడిపోతుంది.

Arunachalam Temple : అరుణాచలంలో ఇలా చేస్తే.. వీఐపీ దర్శనం మీ సొంతం

పంచభూతాల్లో అగ్నికి ప్రత్యేక స్థానం ఉంది. అగ్నికి ప్రతి రూపమైన అగ్నిలింగేశ్వరుడుని దర్శించుకొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది భక్తులు తమిళనాడులోని అరుణాచలంకు తరలి వస్తారు. మాములుగానే భక్తులు గిరి ప్రదక్షణ చేస్తారు. ఇక పౌర్ణమి రోజు అయితే గిరి ప్రదక్షణ..భక్తులతో కటకిటలాడుపోతుంది. స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తులతో పెద్ద పెద్ద క్యూ లైన్లు దర్శనమిస్తాయి. అయితే స్వామి వారిని దర్శించుకొనేందుకు వివిధ దర్శనాలను దేవస్థానం వారు రూపొందించారు. వాటిలో వీఐపీ దర్శనం రూ. 200, సిల్వర్ దర్శనం రూ. 500, గోల్డెన్ దర్శనం రూ. 1000, ప్లాటినం దర్శనం రూ. 2000గా నిర్ణయించారు.

అయితే వీఐపీ ప్రోటోకాల్ దర్శనం టికెట్లు అందులోబాటులో ఉన్నాయి. వాటిని అన్ లైన్‌లో ప్రస్తుతం పొందే సౌకర్యాన్ని నిలిపివేశారు. ఈ నేపథ్యంలో స్వామి వారి దర్శనం కోసం నేరుగా దేవాలయంకు వచ్చి.. ఈ టికెట్లను పొందే అవకాశాన్ని దేవాలయం అధికారులు కల్పించారు. అంతేకాదు.. స్పెషల్ దర్శనం లేకుంటే అభిషేకం, పూజ తదితర కార్యక్రమాలు కోసం ఆన్ లైన్‌లో టికెట్లు అందుబాటులో కల్పించలేదు.


అయితే స్వామి వారి దర్శనం, అభిషేకం పూజాదికాల కోసం దేవాలయంలోని పరిపాలన భవనం వద్ద టికెట్లు పొంది.. స్వామి వారి దర్శనం కోసం వెళ్లవలసి ఉంటుంది. ఇక స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తులు తప్పని సరిగా సంప్రదాయ దుస్తులను దర్శించవలసి ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 20 , 2025 | 09:13 PM