ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Education News: ఏసెట్‌ అక్టోబర్-2024 సెషన్‌ నోటిఫికేషన్‌ విడుదల..

ABN, Publish Date - Sep 28 , 2024 | 03:09 PM

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యాక్చూరీస్‌ ఆఫ్‌ ఇండియా- స్టూడెంట్‌ నమోదు సహా తదుపరి యాక్చూరియల్‌ ఎగ్జామ్స్‌ రాసేందుకు ఉద్దేశించిన ‘యాక్చూరియల్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఏసెట్‌) 2024 అక్టోబర్ సెషన్‌కు దరఖాస్తులు కోరుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యాక్చూరీస్‌ ఆఫ్‌ ఇండియా- స్టూడెంట్‌ నమోదు సహా తదుపరి యాక్చూరియల్‌ ఎగ్జామ్స్‌ రాసేందుకు ఉద్దేశించిన ‘యాక్చూరియల్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఏసెట్‌) 2024 అక్టోబర్ సెషన్‌కు దరఖాస్తులు కోరుతోంది. ఎగ్జామ్‌కు సంబంధించిన వివరాలను అభ్యర్థుల ఈ మెయిల్స్‌కు పంపుతారు. అభ్యర్థుల సౌలభ్యం కోసం సంస్థ మాక్‌ టెస్టులు కూడా నిర్వహిస్తుంది. గత ఆరేళ్ల ప్రశ్నాపత్రాలు, వాటి సమాధానాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఏసెట్‌ స్కోర్‌ వ్యాలిడిటీ మూడేళ్లు.


అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఏదేని గ్రూపుతో ఇంటర్‌ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. డిప్లొమా, డిగ్రీ కోర్సులు పూర్తిచేసినవారు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. మేథ్స్‌, స్టాటిస్టిక్స్‌, ఎకనామెట్రిక్స్‌ ప్రధాన సబ్జెక్టులుగా చదివిన వారికి; ఇంజనీరింగ్‌, మేనేజ్‌మెంట్‌, చార్టర్డ్‌ అకౌంటెంట్‌, కాస్ట్‌ అకౌంటెంట్‌, కంపెనీ సెక్రటరీ కోర్సులు చేసినవారికి ప్రాధాన్యం ఉంటుంది.


ఏసెట్‌ వివరాలు: పరీక్ష సమయం మూడు గంటలు. ఇందులో మేథమెటిక్స్‌, స్టాటిస్టిక్స్‌, ఇంగ్లీష్‌, డేటా ఇంట్రప్రిటేషన్‌, లాజికల్‌ రీజనింగ్‌ అంశాలనుంచి 70 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. మొత్తం మార్కులు 100. ఒక మార్కు ప్రశ్నలు 45, రెండు మార్కుల ప్రశ్నలు 20, మూడు మార్కుల ప్రశ్నలు 5 అడుగుతారు. మేథమెటిక్స్‌, స్టాటిస్టిక్స్‌లకు సంబంధించి ఒక్కోదానిలో 30 మార్కులకు; డేటా ఇంట్రప్రిటేషన్‌, ఇంగ్లీ్‌షలకు సంబంధించి ఒక్కోదానిలో 15 మార్కులకు; లాజికల్‌ రీజనింగ్‌ నుంచి 10 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. రుణాత్మక మార్కులు లేవు. ఈ పరీక్షలో అర్హత సాధించాలంటే కనీసం 50 శాతం మార్కులు రావాలి.


ఏసెట్‌ నిర్వహణ

  • ఇది హోమ్‌ బేస్డ్‌ ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌. ఈ పరీక్ష రాయదలచుకొన్న అభ్యర్థులు సంస్థ నిర్దేశించిన మేరకు హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ సాంకేతికతను అందుబాటులో ఉంచుకోవాలి.

  • హార్డ్‌వేర్‌కు సంబంధించి పర్సనల్‌ ల్యాప్‌ట్యాప్/డెస్క్‌టాప్, 640X480 @ 15fps రిజల్యూషన్‌ ఉన్న వెబ్‌ కెమెరా, 1 ఎంబీపీఎస్‌ బ్యాండ్‌విడ్త్‌తో వైర్డ్‌/వైర్‌లెస్‌ ఇంటర్నెట్‌, 2 జీబీ ర్యామ్‌, 2 కోర్స్‌-4 థ్రెడ్స్‌-2.2 గిగా హెర్ట్జ్‌ ప్రాసెసర్‌, 64 ఎంబీ గ్రాఫిక్స్‌ మెమరీ, 1024X768 కంటే తక్కువ కాకుండా స్ర్కీన్‌ రిజల్యూషన్‌, మల్టీ మీడియా సపోర్ట్‌ ఉన్న సౌండ్‌ కార్డ్‌ ఏర్పాటు చేసుకోవాలి.

  • సాఫ్ట్‌వేర్‌కు సంబంధించి విండోస్‌ 10/8/7 ఆపరేటింగ్‌ సిస్టమ్‌, లేటెస్ట్‌ వెబ్‌ బ్రౌజర్‌, 4.5.2 నెట్‌ ఫ్రేమ్‌ వర్క్‌ సిద్ధం చేసుకోవాలి.

  • పరీక్ష రాసే సమయంలో ఒరిజినల్‌ ఆధార్‌ కార్డ్‌/డ్రైవింగ్‌ లైసెన్స్‌/పాస్‌పోర్ట్‌/ఓటర్‌ ఐడీ కార్డ్‌/పాన్‌ కార్డ్‌లను దగ్గర ఉంచుకోవాలి.


ముఖ్య సమాచారం

  • దరఖాస్తు ఫీజు: రూ.500

  • ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 5

  • ఏసెట్‌ 2024 అక్టోబరు సెషన్‌ తేదీ:

  • అక్టోబరు 13

  • ఫలితాలు విడుదల: అక్టోబరు 18

  • వెబ్‌సైట్‌: www.actuariesindia.org


ఈ వార్తలు కూడా చదవండి:

CTTC Free Training: ఐటీఐ, డిప్లొమా చేసిన వారికి శుభవార్త.. ఉచిత ట్రైనింగ్ ఇచ్చి..

Education News: ఐసర్‌ భోపాల్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల..

Updated Date - Sep 28 , 2024 | 03:57 PM