Hard Work: డబ్బులు ఎవ్వరికీ ఊరికే రావు.. అది నిజమే కదా..
ABN, Publish Date - Sep 28 , 2024 | 06:05 PM
వెంకటాపురంలో శ్రీధర్ అనే యువకుడు ఉండేవాడు. అతను విద్యావంతుడే అయినా, ఏ పనీ చేయకుండా సోమరిగా తిరిగేవాడు. తన ఈడు స్నేహితులంతా పెళ్లి చేసుకుని స్థిరపడటం చూసిన శ్రీధర్.. తండ్రి వద్దకు వెళ్లి తనకూ పెళ్లి చేయమని అడిగాడు.
ఇంటర్నెట్ డెస్క్: వెంకటాపురంలో శ్రీధర్ అనే యువకుడు ఉండేవాడు. అతను విద్యావంతుడే అయినా, ఏ పనీ చేయకుండా సోమరిగా తిరిగేవాడు. తన ఈడు స్నేహితులంతా పెళ్లి చేసుకుని స్థిరపడటం చూసిన శ్రీధర్.. తండ్రి వద్దకు వెళ్లి తనకూ పెళ్లి చేయమని అడిగాడు. దానికి అతని తండ్రి నువ్వు రూ.10వేలు తీసుకువచ్చి, నాకు ఇస్తే, నీకు పెళ్లి చేస్తానని చెప్పాడు. ఓ.. అదెంత పని? అనుకున్న శ్రీధర్ ఆ రోజే ధనవంతుడైన తన మితత్రుని దగ్గరకు వెళ్లి పదివేల రూపాయలు తీసుకొచ్చి, తండ్రి చేతికి ఇచ్చాడు.
అయితే, ఆయన ఆ డబ్బును తీసుకుని, ఇది పనికిరాదంటూ నీళ్లలోకి విసిరేశాడు. తండ్రి చేసిన పనికి బాధ పడిన శ్రీధర్ ఆ మర్నాడు తన తల్లిని అడిగి,మరో పదివేల రూపాయలు తెచ్చి, తండ్రి చేతికి ఇచ్చాడు. ఆయన అంతకు ముందు లాగే ఈ డబ్బు కూడా పనికిరాదు అంటూ ఆ డబ్బును పీళ్లలోకి విసిరేసాడు. ఆ తరువాత మరో పదిహేను రోజులకు మరలా పదివేల రూపాయలు తెచ్చి, తండ్రి చేతిలో పెట్టాడు. యధా ప్రకారం తండ్రి ఆ డబ్బును పారవేయబోతుంటే, వెంటనే తండ్రి చేయి పట్టుకుని ఆపి ఇలా అన్నాడు.
‘ ఆగండి నాన్నా.. పారవేయకండి, ఇది నేను రెండు వారాలు కష్టపడి పనిచేస్తే వచ్చిన డబ్బు అన్నాడు. ఆ మాటలు విన్న ఆయన ‘చూసావా ఇంతకు ముందు నేను డబ్బు పారవేసిన రెండుసార్లు నీకు ఇంత బాధ అనిపించలేదు. కారణం ఆ డబ్బు నువ్వు కష్టపడి సంపాదించింది కాకపోవడమే. ఇపుడు డబ్బు పారవేయబోతుంటే నన్ను ఆపావు. ఎందుకంటే ఇది నీ కష్టార్జితం కాబట్టి. ఈ విషయం నీకు తెలియాలనే నిన్ను పరీక్షించాను. ఇపుడు నాకు నమ్మకం కుదిరింది. నువ్వు నీ కుటుటంబాన్ని పోషించుకోగలవు. ఇక నీకు పెళ్లి చేస్తాను’ అని చెప్పి, నెల తిరిగేలోగా శ్రీధర్‌కు ఘనంగా వివాహం జరిపించాడు.
ఈ వార్తలు కూడా చదవండి:
NIT AP: గుడ్ న్యూస్.. ఎన్ఐటీ ఆంధ్రప్రదేశ్‌లో టీచింగ్ జాబ్స్.. అస్సలు మిస్సవ్వకండి..
Repair of records: ఇంటర్ చదివిన వారికి శుభవార్త.. నేషనల్ ఆర్కైవ్స్‌లో స్పెషల్ ట్రెయినింగ్..
Education News: ఏసెట్ అక్టోబర్-2024 సెషన్ నోటిఫికేషన్ విడుదల..
CTTC Free Training: ఐటీఐ, డిప్లొమా చేసిన వారికి శుభవార్త.. ఉచిత ట్రైనింగ్ ఇచ్చి..
Updated Date - Sep 28 , 2024 | 06:08 PM