Education News: ఐసర్ భోపాల్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్ ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల..
ABN, Publish Date - Sep 28 , 2024 | 02:48 PM
భోపాల్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐసర్)- పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. విదేశీ విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఇంటర్నెట్ డెస్క్: భోపాల్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐసర్)- పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. విదేశీ విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
విభాగాలు
నేచురల్ సైన్సెస్ స్ట్రీమ్- బయలాజికల్ సైన్సెస్, కెమిస్ట్రీ, ఎర్త్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్, ఫిజిక్స్
ఇంజినీరింగ్ సైన్సెస్ స్ట్రీమ్- కెమికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్ అండ్ ఇంజినీరింగ్
హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ స్ట్రీమ్- ఎకనామిక్ సైన్సెస్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్(కాగ్నిటివ్ సైన్స్, సోషల్ వర్క్ అండ్ సోషియాలజీ)
అర్హత: స్పెషలైజేషన్‌ను అనుసరించి సంబంధిత విభాగాల్లో ప్రథమ శ్రేణి మార్కులతో ఎంఈ/ఎంటెక్/ఎంఎస్/ఎమ్మెస్సీ/ఎంఏ ఉత్తీర్ణులు; ఎంసీఏ/బీఈ/బీటెక్/బీఎస్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. గేట్ వ్యాలిడ్ స్కోర్ లేదా సీఎస్ఐఆర్ జేఆర్‌ఎఫ్/యూజీసీ జేఆర్‌ఎఫ్/డీబీటీ జేఆర్‌ఎఫ్/ ఐసీఎంఆర్ జేఆర్‌ఎఫ్/ఇన్‌స్పయిర్ జేఆర్‌ఎఫ్/రాజీవ్‌గాంధీ నేషనల్ ఫెలోషిప్/సీఎస్ఐఆర్ ఎల్‌ఎస్/యూజీసీ ఎల్‌ఎస్ అర్హత తప్పనిసరి. కనీసం 8 సీజీపీఏ స్కోర్‌తో ఐఐటీల నుంచి బీఈ/బీటెక్ అలాగే ఐసర్ల నుంచి బీఎస్ - ఎంఎస్ పూర్తిచేసినవారికి గేట్/ఫెలోషిప్ అర్హత అవసరం లేదు. మెడికల్ సంబంధిత స్పెషలైజేషన్‌లకు ఎంబీబీఎస్ పూర్తిచేసినవారు కూడా అర్హులే. అభ్యర్థుల వయసు దరఖాస్తు నాటికి 28 ఏళ్లు మించకూడదు. విదేశీ విద్యార్థులకు ఇంటర్, డిగ్రీ, పీజీ స్థాయుల్లో 60 శాతం మార్కులు ఉండాలి. జీఆర్‌ఈ జనరల్ టెస్ట్‌లో 280 స్కోర్/గేట్ వ్యాలిడ్ స్కోర్, టోఫెల్‌లో 60 స్కోర్/ఐఈఎల్‌టీఎస్‌లో 6 స్కోర్ తప్పనిసరి.
ముఖ్య సమాచారం
దరఖాస్తు సబ్మిషన్‌కు చివరి తేదీ: అక్టోబరు 14
వెబ్‌సైట్: www.iiserb.ac.in/doaa/admission
ఈ వార్తలు కూడా చదవండి:
Education News: ఏసెట్ అక్టోబర్-2024 సెషన్ నోటిఫికేషన్ విడుదల..
CTTC Free Training: ఐటీఐ, డిప్లొమా చేసిన వారికి శుభవార్త.. ఉచిత ట్రైనింగ్ ఇచ్చి..
Updated Date - Sep 28 , 2024 | 03:58 PM