Loksabha Polls: సాయంత్రం 6 నుంచి 144 సెక్షన్ అమలు: వికాస్ రాజ్
ABN, Publish Date - May 11 , 2024 | 04:06 PM
లోక్ సభ ఎన్నిక నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి తెలంగాణ రాష్ట్రంలో 144 సెక్షన్ అమలవుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. నలుగురు కన్నా ఎక్కువ మంది గుమిగూడొద్దని స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్ మీడియాలో ఆరు గంటల నుంచి ప్రచారం చేయొద్దని తేల్చి చెప్పారు.
హైదరాబాద్: లోక్ సభ ఎన్నిక నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి తెలంగాణ రాష్ట్రంలో 144 సెక్షన్ (144 Section) అమలవుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. నలుగురు కన్నా ఎక్కువ మంది గుమిగూడొద్దని స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్ మీడియాలో ఆరు గంటల నుంచి ప్రచారం చేయొద్దని తేల్చి చెప్పారు. జూన్ 1వ తేది సాయంత్రం 6.30 నిమిషాల వరకు 144 సెక్షన్ ఉంటుందని వివరించారు. లోక్ సభ ఎన్నిక జరిగే మే 13వ తేదీన కొన్ని సంస్థలు సెలవు ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఆ రోజు సెలవు ఇవ్వకుంటే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
వెళ్లిపోవాల్సిందే..?
కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాల్, హోటళ్లలో ఇతర జిల్లాలకు చెందిన వ్యక్తులు వెళ్లి పోవాలని వికాస్ రాజ్ (vikas raj) సూచించారు. రేపు, ఎల్లుండి పేపర్లలో ప్రకటనల కోసం ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. 160 కేంద్ర కంపెనీల బలగాలు రాష్ట్రంలో ఇప్పటికే మొహరించాయని వివరించారు. ఇతర రాష్ట్రాల నుంచి 20 వేల పోలీస్ బలగాలు వచ్చాయని పేర్కొన్నారు. ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్‌లో రెండు బ్యాలెట్ యూనిట్లు ఉంటాయని వివరించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలో 232 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని వికాస్ రాజ్ స్పష్టం చేశారు.
జీపీఎస్ ఏర్పాటు
ఈవీఎంలు తరలించే వాహనాలకు జీపీఎస్ ఉంటుందని, వాటిని సీఈఓ ఆఫీస్ (Ceo Office) ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుందని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. రూ.320 కోట్ల నగదు ఇప్పటి వరకు సీజ్ చేశామని వివరించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై 8600 కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. లక్ష 90 వేల మంది పోలింగ్ విధుల్లో పాల్గొంటున్నారని వివరించారు. వచ్చే 48 గంటల పాటు వచ్చే ఫిర్యాదులపై 100 నిమిషాల్లో చర్యలు తీసుకుంటామని వివరించారు. బల్క్ మెసేజ్‌లు సాయంత్రం 6 గంటల నుంచి ఆపాలని తేల్చి చెప్పారు. లక్ష 88 వేల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఇప్పటి వరకు పోల్ అయ్యాయని తేల్చి చెప్పారు.
మెసేజ్ చేసిన ఫర్లేదు
21 వేల 680 మంది ఓటర్లు హోం ఓటింగ్ వేసుకున్నారని వికాస్ రాజ్ (Vikar Raj) తెలిపారు. 1950 నంబర్‌కి ECI స్పెస్ EPIC నంబర్ పెడితే ఓటర్ వివరాలు వస్తాయని తెలిపారు. 328 పోలింగ్ కేంద్రాలను ఏజెన్సీ ఏరియాల్లో ఏర్పాటు చేశామని వెల్లడించారు. మూడు పోలింగ్ కేంద్రంలో అత్యల్ప ఓటర్లు ఉన్నారని తెలిపారు.
Read Latest Telangana News And Telugu News
Updated Date - May 11 , 2024 | 09:35 PM