ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha Elections 2024: ఆణిముత్యం, స్వాతిముత్యాలకు బుద్ధి చెప్పాలి: సీఎం రేవంత్‌రెడ్డి

ABN, Publish Date - May 02 , 2024 | 10:11 PM

45 ఏళ్లుగా మామ(కేసీఆర్), అల్లుడు(హరీశ్‌రావు) శనిలాగా, పాపాల బైరవుల్లా ఉమ్మడి మెదక్ ప్రజలను పీక్కుతుంటున్నారని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఆరోపించారు.

CM Revanth Reddy

సిద్దిపేట: 45 ఏళ్లుగా మామ(కేసీఆర్), అల్లుడు(హరీశ్‌రావు) శనిలాగా, పాపాల బైరవుల్లా ఉమ్మడి మెదక్ ప్రజలను పీక్కుతుంటున్నారని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఆరోపించారు. ఈ బ్రహ్మరక్షసుల నుంచి విముక్తి కలిగించడానికి ఇక్కడకి వచ్చానని తెలిపారు. సిద్దిపేటకు పట్టిన చీడ, పిడ.. మామ అల్లుళ్లలని.. మామ ఆణిముత్యం, ఆల్లుడు స్వాతిముత్యం అని చెప్పుకుంటారని అన్నారు.ఈ భూములు మింగే అనకొండకు బుద్ధి చెప్పాలన్నారు. మొట్టమొదటి సారి గడిల బద్దలు కొట్టే అవకాశం వచ్చిందన్నారు. మీ అన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ దొరల గడీలను బద్దలు కొట్టాల్సిందేనని అన్నారు.

ఇక్కడ మూడు రంగుల జెండా ఎగురకుంటే శాశ్వతంగా బానిసలుగా మిగిలిపోతారని చెప్పారు. ఇక్కడ కౌన్సిలర్‌గా, సర్పంచులగా ఎమ్మెలుగా నిలబడాలంటే పోలీసులు వచ్చి బెదిరిస్తారని.. అక్రమ కేసులు పెడతారని అన్నారు. ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ నుంచి ఒక బలహీన వర్గాల అభ్యర్థిని నిలిపామని అన్నారు.ఆరునూరైనా, అక్కడి సూర్యుడు ఇక్కడ ఉద్యించినా మెదక్‌లో మాత్రం కాంగ్రెస్ జెండా ఎగురాలని పిలుపునిచ్చారు. 1980లో ఇందిరాగాంధీని ఇక్కడి నుంచి ప్రధానిని చేసిన చరిత్ర ఇక్కడి ప్రజలకు ఉందన్నారు.పఠాన్ చేరు పారిశ్రామిక వాడ మెదక్ జిల్లాలో ఉందని చెప్పుకొచ్చారు.


Lok Sabha Elections 2024: కేసీఆర్ కుటుంబ సభ్యులను ఆ మంత్రి కాపాడుతున్నారు: బండి సంజయ్

వెంకట్రామిరెడ్డి ఎవరూ.. వందల ఎకరాలు గుంజుకున్నోడు, పోలీసులతో కొట్టించినోడని చెప్పుకొచ్చారు. మామ, అల్లుళ్లు అతనికి ఏం చూసి టిక్కెట్ ఇచ్చారు.. డబ్బులు చూసే టికెట్ ఇచ్చారా ? అని ప్రశ్నించారు. కూతవేటు దూరంలో వందల ఎకరాలు దోచుకుని దాచుకున్న దొంగ వెంకట్రామిరెడ్డి అని విమర్శించారు. నిజాం వద్ద కాశీం రిజ్వి ఎలానో, మామ, అల్లుళ్ల వద్ద వెంకట్రామిరెడ్డి అలానే అని సెటైర్లు గుప్పించారు.ఎన్నో కష్టాలు, అక్రమ కేసులు ఎదుర్కొన్నారన్నారు. సిద్దిపేట బిడ్డల పౌరుషాన్ని చూసి తనకు సంపూర్ణ నమ్మకం కలిగిందని చెప్పారు.మెదక్‌లో నీలం మధు లక్ష మెజర్టీతో గెలుస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. సిద్దిపేటలో కాంగ్రెస్‌కు భారీ మెజార్టీ వస్తుందన్నారు.


Shashi Tharoor: బీజేపీ 300 కూడా దాటదు.. 400 ఒక జోక్

‘‘ఇక్కడికి వచ్చిన ఒక్కో కార్యకర్త వంద మందితో సమానం. సోనియా ఇచ్చిన అభివృద్ధి పనులు మోదీ కాలగర్భంలో కలిపి గాడిద గుడ్డు నిచ్చారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్, హరీశ్ రావు , కేటీఆర్, రఘునందన్ రావులకు బుద్ధి చెప్పాలి.పేర్లు రంగులు మాత్రమే వేరు రుచి మాత్రం ఒక్కటే. బీజేపీ, బీఆర్ఎస్ పొద్దటి పూట వేరు పార్టీ, రాత్రిపూట ఒక పార్టీ. నీలం మధును గెలిపించండి ముదిరాజ్ బిడ్డకు మంత్రి పదవి ఇచ్చే బాధ్యత నాది. కాంగ్రెస్ చేసిన సామాజిక న్యాయం ఇతర పార్టీల్లో ఉందా. అద్దంకి దయాకర్, రేవంత్ రెడ్డి వేర్వేరు కాదు మేమిద్దరం ఒక్కటే.. నేను 15 ఆగస్టు లోపల రుణమాఫీ చేస్తా అన్న.. హరీశ్ రావు రాసి పెట్టుకో.. కొమురెల్లి మల్లన్న సాక్షిగా చెబుతున్న.. రెండు లక్షల రుణమాఫీ చేసి సిద్దిపేటకు నీ పీడ వదిలిస్తా.. రాజీనామా సిద్ధం చేసుకో.15 ఆగస్టు నాడు దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది.. అదే రోజు ఈ శనీశ్వర రావు పీడ వదులుతుంది. నేను మళ్లీ సిద్దిపేటకు వస్తా, కొత్త ఎమ్మెల్యేను గెలిపిస్తా. 15 ఆగస్టు నాడు లక్ష మందితో ఇక్కడే బహిరంగ సభ పెడతా.. నీ సంగతి తెలుస్తా.. ఐదు హామీలు అమలు చేశాం.. 30 వేళ ఉద్యోగాలు ఇచ్చాం. ఇన్ని మంచి పనులు మోదీ, కేసీఆర్‌కు కనిపించట్లేదా..? బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తాడనుకున్న, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగాం మోదీ రాష్ట్రానికి ఏం ఇచ్చిండు.. గాడిద గుడ్డు’’ అని రేవంత్‌రెడ్డి సెటైర్లు గుప్పించారు.

Read Latest Election News or Telugu News

Updated Date - May 02 , 2024 | 10:18 PM

Advertising
Advertising