ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha Election 2024: కేసీఆర్‌కు నిరసన సెగ.. మిడ్ మానేరు నిర్వాసితుల ఆందోళన

ABN, Publish Date - May 10 , 2024 | 07:33 PM

పార్లమెంట్ ఎన్నికల పోలింగ్‌కు మూడు రోజుల సమయమే ఉండటంతో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) విసృత్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. బస్సు యాత్రలో భాగంగా కరీంనగర్ నుంచి సిరిసిల్లకి వెళ్తుండగా కేసీఆర్‌కి మిడ్ మానేరు నిర్వాసితుల నిరసన సెగ తగిలింది.

KCR

రాజన్న సిరిసిల్ల జిల్లా: పార్లమెంట్ ఎన్నికల పోలింగ్‌కు మూడు రోజుల సమయమే ఉండటంతో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) విసృత్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. బస్సు యాత్రలో భాగంగా కరీంనగర్ నుంచి సిరిసిల్లాకు వెళ్తుండగా కేసీఆర్‌కు మిడ్ మానేరు నిర్వాసితుల నిరసన సెగ తగిలింది. బోయినపల్లి మండలం కోదురుపాక వద్ద నిరసనకారులు ఒక్కసారిగా కేసీఆర్‌ వెళ్తున్న బస్సు మీదకు దూసుకొచ్చారు. బస్సు కాన్వాయ్ ఎదురుగా మిడ్ మానేరు నిర్వాసితులు ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.


వేములవాడ రాజన్న సాక్షిగా కేసీఆర్.. నిర్వాసితులను మోసం చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ముంపు గ్రామాలపై వివక్ష చూపించారని ఆందోళన వ్యక్తం చేశారు. మిడ్ మానేర్ ముంపు గ్రామాల సమస్యలను పట్టించుకోలేదని కాన్వాయ్‌కి నిర్వాసితులు ఎదురుగా వచ్చి ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించి కేసీఆర్ బస్సు యాత్రను దారి ఇచ్చారు. అనంతరం సిరిసిల్లలో కేసీఆర్ రోడ్ షో చేశారు.

Bandi Sanjay: కేసీఆర్ ఏమైనా సుద్ద పూసా? వేస్ట్ ఫెల్లో ఆఫ్ ఇండియా..

Read Latest Telangana News and Telugu News

Updated Date - May 10 , 2024 | 07:39 PM

Advertising
Advertising