Lok Sabha Elections 2024: అరచేతిలో వైకుంఠం చూపి కాంగ్రెస్ గద్దెనెక్కింది: హరీశ్‌రావు
ABN, Publish Date - Apr 28 , 2024 | 08:39 PM
అరచేతిలో వైకుంఠం చూపి కాంగ్రెస్ (Congress) గద్దెనెక్కిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. 10 ఏళ్లు కేంద్రంలో బీజేపీ ఉందని.. దేశానికి ఏం చేసిందని ప్రశ్నించారు. పెట్రోల్ ధర, నిత్యావసర సరుకుల ధరలు అమాంతంగా పెంచిందని మండిపడ్డారు.
మెదక్: అరచేతిలో వైకుంఠం చూపి కాంగ్రెస్ (Congress) గద్దెనెక్కిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. 10 ఏళ్లు కేంద్రంలో బీజేపీ ఉందని.. దేశానికి ఏం చేసిందని ప్రశ్నించారు. పెట్రోల్ ధర, నిత్యావసర సరుకుల ధరలు అమాంతంగా పెంచిందని మండిపడ్డారు. చిన్న శంకరం పేట్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ భారీ ర్యాలీ తీశారు. మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు.
Konda Visveshwar Reddy: మోదీ వేవ్ తెలంగాణలోనూ కనిపిస్తోంది: కొండా
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై హరీశ్‌రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. నాలుగు వేల పెన్షన్ ఇస్తే కాంగ్రెస్‌కు ఓటు వేయాలని.. ఇవ్వకపోతే బీఆర్ఎస్‌కు ఓటు వేయాలని కోరారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారని.. 100 రోజులు దాటిన ఇంకా ఎందుకు అన్ని హామీలను అమలు చేయడం లేదని ప్రశ్నించారు. అమరవీరుల స్థూపం వద్దకు రమ్మంటే సీఎం రేవంత్‌కు కోపం వచ్చిందన్నారు.
KTR: ఇచ్చిన మాట నిలబెట్టుకోని కాంగ్రెస్ ప్రభుత్వం: కేటీఆర్
మోసాన్ని ఓటుతో గెలవాలన్నారు. అయితే తిట్టు లేదంటే.. దేవుడి మీద ఒట్టు.. ఇదే సీఎం తీరని మండిపడ్డారు.కేసీఆర్ బస్సు యాత్రకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు భయపడు తున్నాయన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తే హామీలపై ప్రశ్నించే అస్కారం ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థులను చిత్తుగా ఓడించాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగున్నర నెలల్లో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు.
హామీలను అమలు చేయాలని అడిగితే తమపై విమర్శలు చేస్తున్నారని చెప్పారు. రుణమాఫీ చేస్తానని రైతులను రేవంత్‌రెడ్డి మోసం చేశారని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని అడిగితే పట్టిచుకోవడం లేదన్నారు. తెలంగాణ కోసం రైలు పట్టాల పైన రాస్తారోకోలు, ధర్నాలు చేశామని... జైలుకు కూడా పోయామని చెప్పారు.
మోదీ ప్రభుత్వం ఆదానీ, అంబానీలను ప్రపంచ కుబేరులను చేసింది తప్పితే దేశానికి ఎలాంటి మేలు చేయలేదని ధ్వజమెత్తారు. మోదీ రైతుల పొట్ట కొట్టారని మండిపడ్డారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచిన రఘునందన్ రావు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. అందుకే దుబ్బాక ప్రజలు ఆయనను ఓడించారని హరీశ్‌రావు అన్నారు..
ఇవి కూడా చదవండి
Congress: బండి సంజయ్‌కు మంత్రి పొన్నం సవాల్..
BJP: కేసీఆర్ అనే నాణానికి వారిద్దరూ బొమ్మ బొరుసులు: బండి సంజయ్
Read Latest Election News or Telugu News
Updated Date - Apr 28 , 2024 | 10:03 PM