Elections 2024: పోలింగ్ కేంద్రం, ఓటు ఎక్కడుందో తెలుసుకోండిలా..!!
ABN, Publish Date - May 11 , 2024 | 11:44 AM
పోలింగ్ స్టేషన్ కనుగొనేందుకు ఈ కింది సూచనలు పాటించండి. ఇప్పుడు దాదాపు అంతా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. ప్లే స్టోర్ నుంచి ఓటర్ హెల్ప్ లైన్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. యాప్‌లో నో యువర్ పోలింగ్ స్టేషన్ విభాగంలో ఓటరు వివరాలను నమోదు చేయాలి. ఓటరు ఐడీ, పోలింగ్ కేంద్రం వివరాలు నమోదు చేస్తే ప్రస్తుత పోలింగ్ స్టేషన్ వివరాలు మీ మొబైల్ స్ర్కీన్ మీద కనబడతాయి. దానిని సేవ్ చేసుకొని, లేదంటే స్ర్కీన్ షాట్ తీసుకుంటే బెటర్. దాని ఆధారంగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లొచ్చు.
హైదరాబాద్: మరికొన్ని గంటల్లో పోలింగ్ (Polling) జరగనుంది. కొందరికీ తమ ఓటు ఎక్కడ ఉందో తెలియదు. ఉద్యోగరీత్యా సిటీ లేదంటే పట్టణానికి రావడం.. మరో చోట ఉండాల్సి రావడంతో ఇబ్బందులు ఎదురవుతాయి. గ్రామాల్లో రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు ఓటర్ స్లిపులను అందజేస్తుంటారు. పట్టణాలు, నగరాల్లో సమస్య ఉంటుంది. ఆ సమయంలో మీ ఓటు ఎక్కడ ఉంది..? ఏ పోలింగ్ కేంద్రంలో ఉందో తెలుసుకోవడం కష్టం అవుతోంది. అలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని ఎన్నికల సంఘం పలు సూచనలు చేసింది.
పోలింగ్ స్టేషన్ కనుగొనడం ఎలా..?
పోలింగ్ స్టేషన్ కనుగొనేందుకు ఈ కింది సూచనలు పాటించండి. ఇప్పుడు దాదాపు అంతా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. ప్లే స్టోర్ నుంచి ఓటర్ హెల్ప్ లైన్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. యాప్‌లో నో యువర్ పోలింగ్ స్టేషన్ విభాగంలో ఓటరు వివరాలను నమోదు చేయాలి. ఓటరు ఐడీ, పోలింగ్ కేంద్రం వివరాలు నమోదు చేస్తే ప్రస్తుత పోలింగ్ స్టేషన్ వివరాలు మీ మొబైల్ స్ర్కీన్ మీద కనబడతాయి. దానిని సేవ్ చేసుకొని, లేదంటే స్ర్కీన్ షాట్ తీసుకుంటే బెటర్. దాని ఆధారంగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లొచ్చు. లేదంటే ఎన్నికల సంఘం వెబ్ సైట్ చూడాలి. ఓటరు గుర్తింపు కార్డు మీద ఉన్న ఎపిక్ నెంబర్, మొబైల్ నంబర్ ద్వారా పోలింగ్ కేంద్రాన్ని ఈజీగా కనుగొనచ్చు. అది కాదనుకుంటే ఓటర్ హెల్ప్ లైన్ నంబర్ 1950కి ఫోన్ చేయాలి. వారు అడిగిన సమాచారం అందజేస్తే చాలు మీ పోలింగ్ కేంద్రం వివరాలను తెలియజేస్తారు.
పోలింగ్ బూత్.. ఓటింగ్
మీరు పోలింగ్ స్టేషన్ కనుకున్నారంటే చాలు పోలింగ్ బూత్ ఈజీగా తెలిసిపోతుంది. మీ ఓటు ఏ బూత్‌లో ఉందో అక్కడ ఉన్న సిబ్బంది తెలియజేస్తారు. అక్కడ ఉన్న క్రమ సంఖ్య ఆధారంగా పోలింగ్ బూత్ చూపిస్తారు. బూత్ నిర్ధారించుకొని అక్కడ జనం ఉంటే క్యూ లైన్‌లో నిల్చొని ఓటు వేయాలి. ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం సూచించిన 12 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి విధిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. బూత్ లోపల విధుల్లో ఉన్న సిబ్బందికి గుర్తింపు కార్డు చూపించాలి. అక్కడున్న అధికారులు రాజకీయ పార్టీలకు చెందిన ఏజెంట్లను అడిగి ఓటరు గురించి నిర్ధారిస్తారు. తర్వాత ఈసీ అందజేసిన పత్రంలో సదరు ఓటరు పేరు నిర్ధారించుకొని, ఈవీఎంలో ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తారు.
Read Latest Telangana News And Telugu News
Updated Date - May 11 , 2024 | 02:09 PM