ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha Elections 2024: మోదీ కొత్తకుట్రకు తెరదీశారు.. కేసీఆర్ విసుర్లు

ABN, Publish Date - Apr 30 , 2024 | 09:43 PM

బడేభాయ్.. చోటే భాయ్ కలిసి మోటార్లకు మీటర్లు పెడతారని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (KCR) అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఆయన చేపట్టిన బస్సు యాత్ర 7వ రోజుకు చేరుకుంది. జిల్లాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో కాంగ్రెస్, బీజేపీలపై కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.

భద్రాద్రి కొత్తగూడెం: బడేభాయ్.. చోటే భాయ్ కలిసి మోటార్లకు మీటర్లు పెడతారని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (KCR) అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఆయన చేపట్టిన బస్సు యాత్ర 7వ రోజుకు చేరుకుంది. జిల్లాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో కాంగ్రెస్, బీజేపీలపై కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నేతలపై ప్రధాని మోదీ ఆర్ టాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపించారని.. మరీ ఈడీ, ఐటీలను రంగంలోకి దించి విచారణ చేయించాలని.. కానీ అలా ఎందుకు చేయరని ప్రశ్నించారు.


Loksabha polls 2024: కరెంట్ పోయిందంటూ అబద్దాలు చెబుతున్నారు.. కేసీఆర్‌పై తుమ్మల ఆగ్రహం

మోదీ ఈ ముఖ్యమంత్రి ఒక్కటేనని.. ఆ పార్టీలకు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేస్తే గోదావరిలో వేసినట్లేనని చెప్పారు. మోదీ బడే భాయ్, ఈ ముఖ్యమంత్రి చోటే భాయ్ అని ఎద్దేవా చేశారు. ఆస్ట్రేలియా బొగ్గును కొనాలని మోదీ తనను బెదిరించినా వెనక్కి తగ్గలేదని చెప్పారు. సింగరేణి కార్మికులకు తమ పాలనలో ఎంతో న్యాయం చేశామని గుర్తుచేశారు. మోదీ చెప్పిన అమృత్ కాల్ వచ్చిందా అని నిలదీశారు. తెలంగాణలో గోదావరి నదిలో ఉన్న వాటాని ఎత్తుకుపోయి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు ఇస్తామని మోదీ అంటున్నారని చెప్పారు. మీ గోదావరిని మీ కళ్లెదుటే ఎత్తుకుపోతామని అంటున్న మోదీకి ఈ ఎన్నికల్లో ఓటు వేయాలా అని ప్రశ్నించారు.రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని మోదీ కండిషన్ పెట్టారని.. తాను పెట్టానని తేల్చిచెప్పానని కేసీఆర్ అన్నారు.

Madhukar Reddy: కాంగ్రెస్‌ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 30 , 2024 | 10:32 PM

Advertising
Advertising