ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Loksabha Elections 2024: రేవంత్ చేప్పేది పచ్చి అబద్ధం.. కిషన్‌రెడ్డి సవాల్

ABN, Publish Date - May 03 , 2024 | 06:28 PM

100 రోజుల్లో హామీల అమలు చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఇదని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) అన్నారు. తెలంగాణాకు కేంద్రం ఏమిచ్చిందో రేవంత్ రెడ్డితో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ఒక కుటుంబ పాలన పోయి.. మరో కుటుంబ పాలన వచ్చింది ఇదేనా మార్పు అంటే అని ప్రశ్నించారు.

Kishan Reddy

హైదరాబాద్: 100 రోజుల్లో హామీల అమలు చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఇదని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) అన్నారు. తెలంగాణాకు కేంద్రం ఏమిచ్చిందో రేవంత్ రెడ్డితో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ఒక కుటుంబ పాలన పోయి.. మరో కుటుంబ పాలన వచ్చింది ఇదేనా మార్పు అంటే అని ప్రశ్నించారు.కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలకు గాడిద గుడ్డు ఇస్తుందని సెటైర్లు గుప్పించారు. తెలంగాణా ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు అయ్యిందని ఆరోపించారు.


Hyderabad: బ్యాంకు ఖాతా నుంచి రూ.20 లక్షలు ఖాళీ.. స్కైప్‌ కాల్‌తో రిటైర్డ్‌ ఉద్యోగికి సైబర్‌ నేరగాళ్ల వల

శుక్రవారం బీజేపీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... నియామకాల పత్రాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరీక్షలు నిర్వహించి ఇచ్చారా చెప్పాలని ప్రశ్నించారు. ఒకటో తారీఖు జీతాలు ఇస్తున్నారని రేవంత్ చెబుతున్నారని ఆది పచ్చి అబద్ధమన్నారు. తెల్ల రేషన్ కార్డులు ఇస్తున్నామని కాంగ్రెస్ చెబుతుందని.. ఎక్కడిచ్చారో చెప్పాలని నిలదీశారు. రేవంత్ రెడ్డికి 5గ్యారంటీలు నిద్రలో అమలు అయ్యాయేమోనని ఎద్దేవా చేశారు. ప్రజలు కేసీఆర్‌పై పోరాడితే.. ధర్నా చౌక్‌నీ హైకోర్టు పునరుద్ధరించిందని తెలిపారు.


రీజినల్ రింగ్ రోడ్డు తామే వేశామని.. ఎలా బోర్డు పెడతారని... వారికి సిగ్గుండాలన్నారు. ఎలాంటి తిరకాసులు పెట్టకుండా రూ.500కు సిలిండర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రగతి భవన్ కంచను కూల్చారు గానీ వచ్చిన ఫిర్యాదులను ఎన్ని పరిష్కారం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రుణమాఫీపై సీఎం రేవంత్ మాట మార్చారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు.

IRCTC: 7 రోజులు, 6 రాత్రుల కేరళ టూర్ ప్యాకేజీ.. ఆఫర్ కొన్ని రోజులే

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 03 , 2024 | 06:42 PM

Advertising
Advertising