ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha Elections 2024: బడా భాయ్, చోటా భాయ్ కనుసన్నల్లో ఈసీ: కేటీఆర్

ABN, Publish Date - May 02 , 2024 | 07:46 PM

బడాబాయ్(మోదీ), చోటాబాయ్(రేవంత్‌రెడ్డి) కనుసన్నల్లో ఎన్నికల కమిషన్ పనిచేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) సంచలన ఆరాోపణలు ఆరోపించారు. ఎన్నికల కమిషన్ కూడా అచ్చంగా బీజేపీ కనుసన్నల్లో నడుస్తోందని విమర్శించారు. బీజేపీ నేతలు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

KTR

హైదరాబాద్: బడాబాయ్(మోదీ), చోటాబాయ్(రేవంత్‌రెడ్డి) కనుసన్నల్లో ఎన్నికల కమిషన్ పనిచేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) సంచలన ఆరాోపణలు ఆరోపించారు. ఎన్నికల కమిషన్ కూడా అచ్చంగా బీజేపీ కనుసన్నల్లో నడుస్తోందని విమర్శించారు. బీజేపీ నేతలు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గురువారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ...ప్రత్యర్థులను మోదీ, రేవంత్ అసభ్యంగా తిడుతున్నారని.. అయినా ఈ నేతలపై ఒక్క చర్య కూడా ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

మోదీ ఇటీవల ముస్లింలపై ఇష్టారీతిగా కామెంట్స్ చేశారని.. కానీ ఆయనకు కనీసం ఒక్క నోటీస్ కూడా ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. శ్రీ రాముడి ఫొటోలు పట్టుకుని అమిత్ షా ప్రచారం చేస్తున్నారని.. అయినా ఆయనపై ఇప్పటి వరకు చర్యలు లేవని అన్నారు. ప్రధాని మోదీ విద్వేష ప్రసంగాలు చేసినా, అమిత్ షా రాముని ఫొటో పట్టుకుని ప్రచారం చేసిన ఈసీ ఎందుకు చర్యలు తీసుకోట్లేదని కేటీఆర్ ప్రశ్నించారు.


కాంగ్రెస్, బీజేపీకి వణుకు

‘‘కేసీఆర్‌కు వస్తున్న జనస్పందనను చూసి కాంగ్రెస్, బీజేపీకి వణుకు పుట్టింది. ఇద్దరు కూడా బలుక్కుని కేసీఆర్ జనాల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీనికి ప్రజలు ఓటుతో జవాబు చెప్పాలి. రేవంత్ అన్న మాటలు చెప్పాలంటేనే మాకు విచక్షణ అడ్డు వస్తుంది.ఈసీ నిజంగా స్వతంత్ర సంస్థ అయితే మోదీపై చర్యలు ఎందుకు లేవు. ఇది ఏ రకంగా పారదర్శకం అవుతుంది. విద్యుత్ నీటి కొరత కారణంగా హాస్టళ్లను మూసి వేస్తున్నట్లు మార్చి 18న ఓయూ చీఫ్ వార్డెన్ సర్య్కూలర్ విడుదల చేశారు.దీనిపై విద్యార్థులు నిరసనకు దిగారు. నీళ్లను కూడా ఇవ్వలేకపోతున్నారని కేసీఆర్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ చేసిన వెంటనే చీఫ్ వార్డెన్‌కు షోకాజ్ ఇచ్చారు’’ అని కేటీఆర్ అన్నారు.

సీఎం రేవంత్‌ది ఫేక్ డాక్యుమెంట్

‘‘ఎస్పీడీసీఎల్ నుంచి నోటీస్ ఇచ్చారు. రేవంత్, కేసీఆర్‌కు కౌంటర్‌గా ఓ నోటీస్‌ను ట్వీట్ చేశారు. సీఎం పెట్టినది ఫేక్ డాక్యుమెంట్ అని ఓయూ విద్యార్థుల నుంచి మాకు మెసేజ్‌లు వచ్చాయి. 2023లో ఇచ్చిన ఒరిజినల్ నోటీస్‌లో నీటి, విద్యుత్ కొరత వల్ల హాస్టళ్లకు సెలవు ఇచ్చినట్లు ఎక్కడా లేదు. కానీ సీఎంగా ఉండి రేవంత్ ఫేక్ డాక్యుమెంట్ పోస్ట్ చేశారు. చీఫ్ వార్డెన్ స్టాంప్‌ను కూడా మార్చి రేవంత్ చిల్లర రాజకీయం చేస్తున్నారు. కానీ ఓ విద్యార్థి నాయకుడిని అరెస్ట్ చేశారు. జైల్లో ఉండాల్సింది ఎవరు? ఫేక్ డాక్యుమెంట్ పోస్ట్ పెట్టిన సీఎం వెళ్లాలా లేక నకిలీ అని చెప్పిన క్రిషాంక్ వెళ్లాలా? నేను చెప్పింది తప్పని రుజువు చేస్తే చంచల్‌గూడ జైలుకు వెళ్లడానికి నేను సిద్ధం. లేదంటే సీఎం రేవంత్ రెడ్డి చంచల్ గూడా జైల్‌కు వెళ్లాలి. మేము కూడా ఎన్నికల సంఘానికి రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేస్తాం. న్యాయమే ఎప్పటికైనా గెలుస్తుంది’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.

Updated Date - May 02 , 2024 | 08:27 PM

Advertising
Advertising