ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha Elections 2024: అందుకే మోదీ మూడోసారి ప్రధాని కావాలి: మంత్రి పొంగులేటి

ABN, Publish Date - Apr 28 , 2024 | 04:29 PM

మాయమాటలు చెప్పటం తప్పా ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM Modi) దేశానికి ఏం చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) ప్రశ్నించారు. సత్తుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో లోక్‌సభ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు.

ఖమ్మం జిల్లా: మాయమాటలు చెప్పటం తప్పా ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) దేశానికి ఏం చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) ప్రశ్నించారు. సత్తుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో లోక్‌సభ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ... పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఏనాడు ప్రజలను, ఎమ్మెల్యేలను, మంత్రులను కలవలేదని మండిపడ్డారు.


Congress: బండి సంజయ్‌కు మంత్రి పొన్నం సవాల్..

ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల మయంగా మార్చారని ధ్వజమెత్తారు. రూ.7 లక్షల కోట్లకుపైగా అప్పులు చేశారన్నారు. లక్ష ఎకరాలకు సాగునీరు ఇస్తానని చెప్పి ఇవ్వలేదని... దళితులకు భూమి ఇవ్వలేదు, ఇళ్లు ఇవ్వలేదని చెప్పారు. ఫాంహౌస్‌లో ఉంటూ ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రినేనని అపోహాలో ఉన్నారన్నారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజలకు ఏం చేశారో కేసీఆర్ ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు. ఏం చేశారని పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఓటు వేయాలని ప్రశ్నించారు. ఫోన్లు ట్యాప్ చేశారని ఓట్లు వేయాలా అని నిలదీశారు.


అందరి లక్ష్యం ఒక్కటేనని రాహుల్ గాంధీని దేశ ప్రధాని చేయటం ఖాయమని జోస్యం చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన 10 ఏళ్లలోనే దేశ పరువు, ప్రతిష్ఠలను ఇతర దేశాలకు తాకట్టు పెట్టిందని విరుచుకుపడ్డారు. రైతు సమస్యలను విస్మరించారని విరుచుకుపడ్డారు. సుమారు ఎనిమిది వందల మంది రైతులను మోదీ ప్రభుత్వం పొట్టన పెట్టుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనలో ఇచ్చిన హామీలను మోదీ విస్మరించారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పని మాటలను సైతం చెప్పినట్లుగా బీజేపీ దుష్ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు.


BJP: కేసీఆర్ అనే నాణానికి వారిద్దరూ బొమ్మ బొరుసులు: బండి సంజయ్

మాయమాటలు చెప్పటం, పూటకో దేశానికి తిరగటం, ఖరీదైన బట్టలు వేసుకోవటం తప్పా దేశానికి మోదీ ఏం చేశారని లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయాలని ప్రశ్నించారు. మతాలను, కులాలను రెచ్చగొడుతూ, ప్రాంతాల మధ్య చిచ్చులు పెడుతూ మూడోసారి ప్రధాని కావాలని మోదీ చూస్తున్నారని ఫైర్ అయ్యారు.. చివరకు రాములవారిని కూడా రాజకీయాల్లోకి తీసుకువచ్చిన బీజేపీకు ఎందుకు ఓటు వేయాలని నిలదీశారు.రెండు సార్లు అవకాశం వచ్చినా రాహుల్ గాంధీ ప్రధాని కాలేదన్నారు. తెలంగాణలో 15 పార్లమెంట్ స్థానాలను గెలిపించాలని కోరారు.


KTR: ఇచ్చిన మాట నిలబెట్టుకోని కాంగ్రెస్‌ ప్రభుత్వం: కేటీఆర్‌

ఇందిరమ్మ కుటుంబానికి అందరూ అండగా ఉండాలన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ కుటుంబానికి అండగా ఉండాల్సిన అవసరం ఉందని వివరించారు. చెప్పిన హామీలనే కాకుండా చెప్పని హామీలను సైతం ఇందిరమ్మ ప్రభుత్వం అమలు చేస్తుందని స్పష్టం చేశారు. ఆగస్టు 15వ తేదీ లోపు రైతులకు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. రేషన్ కార్డు, పెన్షన్ ఇతర హామీలన్నీ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తుందని మాటిచ్చారు.


ప్రతి ఒక్కరూ ఖమ్మం ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. 65 ఏళ్ల నుంచి రఘురాంరెడ్డి కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఉంటూ సేవ చేస్తుందని చెప్పుకొచ్చారు. దోచుకోవటం కోసమో, దాచుకోవటం కోసమో రఘురాం రెడ్డి పోటీ చేయటం లేదని అన్నారు. ప్రతిపక్ష నాయకులు మాట్లాడే ముందు ఆలోచనతో మాట్లాడాలని చెప్పారు. ఎంపీ ఎన్నికలకు కేవలం 13 రోజులు మాత్రమే సమయం ఉందని.. కొద్ది టైంలోనే మరింత కష్టపడాలని కేడర్‌కు పిలుపునిచ్చారు. సత్తుపల్లి నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ వచ్చేలా నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు.


Konda Visveshwar Reddy: మోదీ వేవ్‌ తెలంగాణలోనూ కనిపిస్తోంది: కొండా

Read Latest Election News or Telugu News

Updated Date - Apr 28 , 2024 | 04:54 PM

Advertising
Advertising