ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha Elections 2024: మిగతా రాష్ట్రాల్లోగా సీఎంలను మార్చం.. సీఎం రేవంత్‌కు రఘునందన్ రావు స్ట్రాంగ్ కౌంటర్

ABN, Publish Date - Apr 23 , 2024 | 05:15 PM

లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ రెండు పార్టీల్లోని నేతలు ఒకరిపై ఒకరు ప్రతివిమర్శలు గుప్పించుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం మెదక్‌లో సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఎన్నికల ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ప్రచారంలో బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు‌ (Raghunandan Rao)పై రేవంత్ తీవ్ర ఆరోపణలు చేశారు.

Raghunandan Rao

మెదక్: లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ రెండు పార్టీల్లోని నేతలు ఒకరిపై ఒకరు ప్రతివిమర్శలు గుప్పించుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం మెదక్‌లో సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఎన్నికల ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ప్రచారంలో బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు‌ (Raghunandan Rao)పై రేవంత్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయనకు ఘాటైన సమాధానం ఇచ్చారు రఘునందన్ రావు. మంగళవారం నాడు మెదక్‌లో రఘునందన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో సీఎం రేవంత్‌‌కు రఘునందన్ రావు సవాల్ విసిరారు.


Lok Sabha Election 2024: ఎట్టకేలకు ఖమ్మం ఎంపీ అభ్యర్థులు వీళ్లే! కరీంనగర్, హైదరాబాద్ నుంచి ఎవరెవరంటే?

ఆ బుక్ పంపిస్తా.. చదువుకో రేవంత్..

‘‘మా ఊరికి మీరోస్తే .. మా అమ్మా, నాన్నల గడీలను నీ పేరు (రేవంత్ రెడ్డి) మీదా రిజిస్ట్రేషన్ చేయిస్తా. నీకు రాసిచ్చే స్క్రిప్ట్ తప్పులు రాసిస్తారు... అందుకే ఒక బుక్ రాసుకొచ్చా.. ఓపికగా చదువుకోవాలి. మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి మోదీ ప్రభుత్వం ఇచ్చిన నిధుల పుస్తకం ఇస్తా. ఏ గుడికి, ఏ బడికి ఎన్ని పైసలు ఇచ్చామో ఈ బుక్‌లో ఉన్నాయి. దుబ్బాక నియోజకవర్గంలో రైతు ఉపాధి పథకం కింద రూ.230 కోట్లు ఇచ్చాం. ఎన్ని నిధులు ఇచ్చారో తెలిపే బుక్‌నీ కోరియర్‌లో పంపుతున్నా. దుబ్బాకలో ఉన్న మా గాడీలకు మీరు రావాలి.. మా అమ్మా, నాన్నా భోజనం పెట్టి పంపిస్తారు. మోదీ మెదక్‌కు ఏమిచ్చిండో.. హరీష్, రేవంత్ తెలుసుకోవాలి. నిజాం షుగర్ ఫ్యాక్టరీ కోసం కేసీఆర్ ప్రభుత్వం హౌస్ కమిటీ వేసింది..100 రోజుల్లో నివేదిక ఇచ్చింది.. దానిని అమలు చేయాలి రేవంత్ గారు... ఎన్నికల కోడ్ అడ్డం వస్తే స్పెషల్ పర్మిషన్ తీసుకొస్తాం’’ అని రఘునందన్ రావు అన్నారు.


Breaking: కవితకు మరో బిగ్ షాక్.. ఇప్పట్లో కష్టమే!

కేటీఆర్ మెడలు విరగ్గొడతారు...

మిగతా రాష్ట్రాల్లో లాగా హైదరాబాద్‌లో సీఎంనీ మార్చడం బీజేపీకి తెలియదని రఘునందన్ రావు ఉద్ఘాటించారు. రూ.30 కోట్ల జన్ ధన్ ఖాతాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓపెన్ చేశారని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యేగా వద్దనుకున్న జీవన్ రెడ్డి కేంద్రమంత్రి అవుతారని రేవంత్ రెడ్డి కలలు కంటున్నారని విమర్శించారు. మొదటి ఫలాలు, మైనార్టీలకు అందుతాయని గతంలో కాంగ్రెస్ చెప్పలేదా అని ప్రశ్నించారు. మాజీ మంత్రి కేటీఆర్ మెడలు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలే వచ్చారని.. త్వరలో పార్లమెంట్ ఎన్నికల్లో విరగ్గొడతారని రఘునందన్ రావు హెచ్చరించారు.

ఫస్టు కేటీఆర్ కరీంనగర్‌లో బండి సంజయ్ మీద పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 3 అంకెల స్థానాలు కూడా గెలవలేదని అన్నారు. అహంకారంతో మోదీలు.. బోడీలు అని రేవంత్ రెడ్డి మాట్లాడొద్దని మందలించారు. ఒక నాణానికి బొమ్మా, బొరుసు లాగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయని ఆరోపించారు. హామీలు ఇచ్చినప్పుడే రాష్ట్రంలో లంకె బిందెలు ఉన్నాయా, ఖాళీ బిందేలున్నాయా చూసుకొని ఇవ్వాలని రేవంత్‌పై రఘునందన్ రావు మండిపడ్డారు.


Komatireddy: నీకు సుఖేందర్ చాలు... జగదీష్‌రెడ్డిపై కోమటిరెడ్డి సెటైర్

Read Latest Election News or Telugu News

Updated Date - Apr 23 , 2024 | 05:28 PM

Advertising
Advertising