Rahul Gandhi: రాహుల్ గాంధీ పాకిస్థాన్‌కు ప్రధాని కాగలడు..!!
ABN, Publish Date - May 19 , 2024 | 01:12 PM
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి కావాలనే ఆశ బలంగా ఉంది. ఆయన ఆశ తప్పకుండా నెరవేరుతుంది. కానీ మన దేశానికి కాదు.. పొరుగున గల పాకిస్థాన్ నుంచి పోటీ చేయాలి.. తప్పకుండా ప్రధాని అవుతారని హిమంత బిశ్వ శర్మ సెటైర్లు వేశారు.
శివన్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై (Rahul Gandhi) అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి కావాలనే ఆశ బలంగా ఉంది. ఆయన ఆశ తప్పకుండా నెరవేరుతుంది. కానీ మన దేశానికి కాదు.. పొరుగున గల పాకిస్థాన్ నుంచి పోటీ చేయాలి.. తప్పకుండా ప్రధాని అవుతారని హిమంత బిశ్వ శర్మ సెటైర్లు వేశారు. బీహార్‌లో గల శివన్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇక్కడ బీజేపీ బరిలోకి దిగిన చోట స్వతంత్ర అభ్యర్థులకు కాంగ్రెస్, ఆర్జేడీ మద్దతుగా నిలిచాయని మండిపడ్డారు.
దేశంలో మతాల పేరుతో రిజర్వేషన్లు ఉండవని హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు. పాకిస్థాన్‌లో ముస్లింలకు మతం పేరుతో రిజర్వేషన్లు ఉంటాయని వివరించారు. భారతదేశంలో అలా ఉండవని తేల్చి చెప్పారు. రిజర్వేషన్లు ఇవ్వాలని లాలు ప్రసాద్ యాదవ్ అనుకుంటే పాకిస్థాన్ వెళ్లాలని సూచించారు. అయోధ్యలో బాల రాముడి ప్రాణ:ప్రతిష్ఠ కార్యక్రమానికి రాహుల్ గాంధీ, లాలు ప్రసాద్ యాదవ్ ఎందుకు రాలేదని విరుచుకుపడ్డారు. గుడిలో ఉన్న రామ్ లల్లా తిరిగి టెంట్‌లోకి తీసుకెళ్లాలని అనుకుంటున్నారని మండిపడ్డారు. అలా జరగనీయం అని హిమంత శర్మ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని గెలిపించాలని కోరారు. ప్రధాని మోదీ నేతృత్వంలో పీవోకేను దేశంలో కలుపుతామని స్పష్టం చేశారు.
Read Latest National News and Telugu News
Updated Date - May 19 , 2024 | 01:12 PM