PM Modi: 8న మోదీ ప్రమాణ స్వీకారం.. ఆ రోజే ఎందుకు..?
ABN , Publish Date - Jun 06 , 2024 | 08:45 AM
వరసగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని పదవి చేపట్టబోతున్నారు. ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యింది. జూన్ 8వ తేదీన మోదీ 3.o మంత్రివర్గం కొలువుదీరనుంది. 8వ తేదీనే ఎందుకు అనే చర్చ వచ్చింది. గతంలో కూడా 8వ తేదీన ముఖ్య పనులను మోదీ ప్రారంభించారు.
ఢిల్లీ: వరసగా మూడోసారి నరేంద్ర మోదీ (PM Modi) ప్రధాని పదవి చేపట్టబోతున్నారు. ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యింది. జూన్ 8వ తేదీన మోదీ 3.o మంత్రివర్గం కొలువుదీరనుంది. 8వ తేదీనే ఎందుకు అనే చర్చ వచ్చింది. గతంలో కూడా 8వ తేదీన ముఖ్య పనులను మోదీ ప్రారంభించారు. 8వ తేదీకి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, సంఖ్యశాస్త్ర ప్రకారం ఎలాంటి ప్రాధాన్యం ఉందో తెలుసుకుందాం పదండి..?
న్యాయానికి చిహ్నాం
సంఖ్యాశాస్త్రంలో 8 శని గ్రహాన్ని చూపుతుంది. ఎనిమిది న్యాయానికి చిహ్నాంగా ఉంటుంది. ఎనిమిది సంఖ్య రాజయోగానికి చిహ్నంగా నిలుస్తోంది. నిజానికి శని ఉన్నవారికి విజయం ఆలస్య అవుతుందని నోయిడాకు చెందిన న్యూమరాలజిస్ట్ రాహుల్ సింగ్ వెల్లడించారు.
8వ తేదీన మోదీ తీసుకున్న కీలక నిర్ణయాలివే
మోదీ 1.o ప్రభుత్వంలో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం నవంబర్ 8వ తేదీన రాత్రి 8 గంటలకు ప్రకటించారు.
డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని 2015 సెప్టెంబర్ 26వ తేదీన మోదీ ప్రారంభించారు. తేదీ సంఖ్య 2+6 కలిపితే 8 అవుతుంది. సంవత్సరం 2+0+1+5ని కలిపితే 8 వస్తుంది.
ప్రధాని మోదీ సెప్టెంబర్ 17వ తేదీన జన్మించారు. 17వ తేదీని 1+7 కలిపితే 8 అవుతుంది.
8వ తేదీన జన్మించిన వారే కాక ఇతరులు కూడా ఆ రోజున కొత్త పనులు ప్రారంభించొచ్చు అని జ్యోతిష్య పండితులు రాహుల్ సింగ్ వివరించారు.
రిపబ్లిక్ డేను జనవరి 26వ తేదీన జరుపుకుంటాం. ఆ రోజును 2+8 కూడితే 8 వస్తుంది.
2024 ఏడాదిని 2+0+2+4 కలిపితే కూడా 8 వస్తోంది.
జూన్ 8వ తేదీన తిథి విదియ ఉంది. ఆ రోజున కొత్త పనులు చేపడితే మంచి జరుగుతుందని పండితులు, జ్యోతిష్యులు చెబుతున్నారు.