Lok Sabha Election Results 2024: దేశంలో ఏ పార్టీ ఎన్ని గెలిచింది..?
ABN , First Publish Date - Jun 04 , 2024 | 06:58 AM
దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపులో ఎన్డీయే కూటమి లీడ్‌లో దూసుకుపోతోంది. ఇండియా కూటమికి, ఎన్డీయేకు మధ్య వ్యత్యాసం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన లైవ్ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి.కామ్ అందిస్తోంది.
Live News & Update
-
2024-08-24T20:12:07+05:30
మోదీకి బిగ్ షాక్ ఇచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి..
వారణాసిలో ప్రధాని మోదీకే ఝలక్ ఇచ్చారు కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్. ఒకానొక దశలో మోదీ వెనుకంజలో ఉన్నారు. ఆ తరువాత రౌండ్‌లో స్వల్ప ఆధిక్యం సాధించారు మోదీ. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థిపై 619 ఓట్లపై మాత్రమే ఆధిక్యంలో ఉన్నారు.
-
2024-08-24T20:12:06+05:30
లీడ్‌లో ఎన్డీయే..
-
2024-06-05T05:30:26+05:30
మూడోసారి ప్రధానిగా మోదీ..
లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ 292 సీట్లు సాధించి మెజారిటీ మార్క్ దాటింది. 543 సీట్లున్న లోక్ సభలో అధికారం చేపట్టడానికి 272 సీట్లు సాధించాలి. ఎన్డీఏ కూటమి పార్టీలన్నీ కలిపి మెజారిటీని దాటడంతో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఈసారి మోదీ మూడో సారి ప్రధానిగా బాధ్యతలు తీసుకోనున్నారు. -
2024-06-04T20:53:20+05:30
Lok Sabha Election Results: ఏ పార్టీ ఎన్ని గెలిచింది.. ఈసీఐ అధికారిక లెక్కలివే..
కేంద్ర ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం ఏ పార్టీ స్థానాలు గెలిచింది. ఎన్ని చోట్ల లీడింగ్‌లో ఉందో చూద్దాం.
బీజేపీ 156 చోట్ల గెలుపొందగా.. 83 స్థానాల్లో లీడ్‌లో ఉంది.
కాంగ్రెస్ పార్టీ 62 స్థానాల్లో గెలుపొందగా.. 42 చోట్ల లీడింగ్‌లో ఉంది.
సమాజ్‌వాద్ పార్టీ 24 సీట్లు గెలుపొందింది. 13 చోట్ల ముందంజలో ఉంది.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 15 చోట్ల గెలిచింది. 14 చోట్ల ముందంజలో ఉంది.
జనతాదళ్ పార్టీ(యునైటెడ్) (జేడీయూ) 6 గెలిచింది. 6 చోట్ల ముందంజలో ఉంది.
డీఎంకే 5 గెలిచింది. 17 చోట్ల ముందంజలో ఉంది.
టీడీపీ 4 చోట్ల గెలిచింది. 12 చోట్ల ముందంజలో ఉంది.
శివసేన(ఉద్దవ్ ఠాక్రే) 4 గెలిచింది. 6 చోట్ల లీడ్‌లో ఉంది.
సీపీఐ(ఎం) 4 చోట్ల గెలిచింది.
ఆమ్ ఆద్మీ పార్టీ 3 గెలిచింది.
శివసేన(షిండే) 2 గెలిచింది. 4 చోట్ల లీడ్‌లో ఉంది.
ఎల్‌జేపీఆర్‌వీ 2 చోట్ల గెలిచింది. 3 చోట్ల లీడ్‌లో ఉంది.
వైఎస్ఆర్‌సీపీ 2 గెలిచింది. 2 చోట్ల లీడ్‌లో ఉంది.
జనతాదళ్(సెక్యూలర్)జేడీఎస్ 2 గెలిచింది.
జమ్మూ అండ్ కశ్మీర్ నేషన్ కాన్ఫరెన్స్(జేకేఎన్) 2 గెలిచింది.
నేషనల్ కాంగ్రెస్ పార్టీ(షరద్ పవార్) 1 గెలిచింది. 6 చోట్ల లీడ్‌లో ఉంది.
రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) 1 గెలిచింది. 3 చోట్ల ముందంజలో ఉంది.
-
2024-06-04T18:21:49+05:30
కీలక నేతలు విజయం..
ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నుంచి మూడోసారి విజయం సాధించారు.
గుజరాత్‌లో గాంధీ నగర్ లోక్ సభ నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజయం సాధించారు.
రాజస్థాన్ కోట లోక్ సభ నుంచి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా విజయం సాధించారు.
హిమాచల్ ప్రదేశ్ మండి లోక్ సభ అభ్యర్థిగా నటి కంగనా రనౌత్ గెలుపొందారు.
రాజస్థాన్‌లోని బికనీర్ లోక్‌సభ స్థానం నుంచి కేంద్ర మంత్రి, బీజేపీ నేత అర్జున్ రామ్ మేఘ్వాల్ విజయం సాధించారు.
-
2024-06-04T18:19:08+05:30
లోక్ సభ ఫలితాల్లో బిఆర్ఎస్‌కు ఊహించని షాక్
పోటీ చేసిన అన్ని స్థానాల్లో దాదాపుగా డిపాజిట్ ఘల్లంతు
ఖమ్మం, మహబూబాబాద్ స్థానాల్లో మాత్రమే రెండో స్థానంలో బిఆర్ఎస్
అసెంబ్లి ఎన్నికలతో పోలిస్తే 23 శాతం తగ్గిన బిఆర్ఎస్ ఓట్ షేర్
0.71 శాతం ఓట్ షేర్ పెంచుకున్న కాంగ్రెస్
21.11 శాతం భారీ ఓట్ షేర్ ను దక్కించుకున్న బిజేపి
30 శాతం ఓట్ షేర్ టార్గెట్ పెట్టుకుని 35.01శాతం పొందిన బిజేపి
కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే సీటును కూడా కోల్పోయిన బిఆర్ఎస్
-
2024-06-04T18:15:00+05:30
సంబురాల సమయం..
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కార్యకర్తల సంబురాలు
సంబురాల్లో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారీ
బీజేపీ ఆఫీస్ కు పెద్ద సంఖ్యలో చేరుకున్న కార్యకర్తలు
తెలంగాణలో ఎనిమిది స్థానాలను గెలుచుకున్న బీజేపీ
2019ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు గెలిచిన బీజేపీ
గతం కంటే రెట్టింపు స్థానాలను దక్కించుకున్న కమలం పార్టీ
అయితే జాతీయ స్థాయిలో సీట్లు తగ్గిన నేపథ్యంలో నిరాశలో క్యాడర్
-
2024-06-04T18:14:28+05:30
ఖమ్మంలో ఎవరు గెలిచారంటే..
ఖమ్మం పార్లమెంట్ కౌంటింగ్ పూర్తి
కాంగ్రెస్ అభ్యర్ది రామసాయం రఘురామిరెడ్డి
4,67,847 ఓట్ల ఆధిక్యంతో ఘనవిజయం
కాంగ్రెస్: 759603
బిఆర్ఎస్: 297592
బిజెపి: 117075
-
2024-06-04T18:13:33+05:30
సురేష్ షెట్కార్ విజయం
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పార్లమెంట్ లో 46 వేల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ గెలుపు
(కాంగ్రెస్) సురేష్ షెట్కార్- 5,28,418
(బీజేపీ) బీబీ పాటిల్- 4,82,230
(బీఆర్ఎస్) గాలి అనిల్ - 17,278
-
2024-06-04T18:10:28+05:30
వారిద్దరూ వద్దని దేశం చెప్పింది: రాహుల్ గాంధీ
మా బ్యాంకు ఖాతాలు సీజ్ చేసి ఇబ్బందులకు గురి చేశారు.
అదానికి మోడీకి అవినీతి సంబంధాలు ఉన్నాయి.
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాము.
ఈ ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలతో పోరాడాము.
మీడియా పాత్ర కూడా చాలా అవసరం.
రాజ్యాంగాన్ని చూపెట్టి.. కాపాడుకోవాలని చెప్పిన రాహుల్.
భారత ప్రజలకు, ఇండియా కూటమి నేతలకు.. పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.
రాజ్యాంగం,రిజర్వేషన్ల పై బిజెపి ఆక్రమణ చేసింది.
దేశం స్పష్టంగా చెప్పింది.. మోడీ అమిత్ షా వద్దని.
దేశంలోని పేదలు, రైతులు, వెనుకబడిన వాళ్ళే రాజ్యాంగాన్ని కాపాడటం కోసం ముందుకు వచ్చారు.
కాంగ్రెస్ మీతో ఉంటుంది.. మీకు ఇచ్చిన హామిలు నెరవేర్చడం కోసం ప్రయత్నం చేస్తాం.
రాయబరేలి, వాయనాడు ప్రజలకు ధన్యవాదాలు.
-
2024-06-04T17:14:28+05:30
ఎంపీగా గెలిచిన మరో క్రికెటర్..
పశ్చిమబెంగాల్‌లోని బహరంపూర్ లోక్‌సభ టీఎంసీ అభ్యర్థిగా పోటీ చేసిన క్రికెటర్ యూసుఫ్ పఠాన్ గెలుపొందారు.
-
2024-06-04T17:12:33+05:30
లోక్ సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఘోర ఓటమి
ఒక్క స్థానాన్ని కూడా గెలువలేక పోయిన గులాబీ పార్టీ
ఖమ్మం, మహబూబ్ బాద్ మినహా మిగిలిన అన్ని చోట్ల మూడో స్థానానికే పరిమితమైన బిఆర్ఎస్
లోక్ సభ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ కు భారీగా తగ్గిన ఓట్ల శాతం
16శాతానికి తగ్గిన ఓటు షేరింగ్
-
2024-06-04T17:10:02+05:30
ఆదిలాబాద్ : బీజేపీ ఎంపీ అభ్యర్థి నగేష్ విజయం
నా గెలుపు కార్యకర్తలకు అంకితం
నమ్మకం తో గెలిపించిన ప్రజలకు రుణ పడి ఉంటాం
రాష్ట్రంలో ఇప్పుడు 8 ఎంపీ స్థానాలను గెలిచాం
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 88 ఎమ్మెల్యే స్థానాలను గెలుస్తాం
తెలంగాణ లో బీజేపీ అధికారం లోకి రావడం ఖాయం
-
2024-06-04T17:07:16+05:30
కేటీఆర్ కామెంట్స్..
టీఆర్‌ఎస్ స్థాపించిన 24 ఏళ్లలో విజయాలు, అపజయాలు, ఎదురు దెబ్బలు అనేకం చూశాం
తెలంగాణ రాష్ట్ర సాధన మేము సాధించిన అతిపెద్ద విజయం
రెండు సార్లు అధికారంలోకి వచ్చాం
నేటి ఎన్నికల ఎదురుదెబ్బ చాలా నిరాశపరిచింది.
కానీ మేము శ్రమిస్తూనే ఉంటాము
ఫీనిక్స్ పక్షిలా మళ్ళీ బూడిద నుండి లేస్తాము
-
2024-06-04T16:49:00+05:30
ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నాం: మహేష్ కుమార్ గౌడ్
మా పాలనకు పట్టం కట్టారు.
మూడు పార్లమెంట్ సీట్ల నుండి 8 సీట్లకు చేరాం.
కంటోన్మెంట్ ప్రజలు కాంగ్రెస్ కి పట్టం కట్టారు.
దేవుడ్ని రాజకీయం కోసం వాడుకున్నా బీజేపీ టార్గెట్ రీచ్ అవ్వలేదు.
మోదీ పాలన చాలు అని ప్రజలు తీర్పు ఇచ్చారు.
రేవంత్ రెడ్డిపై అక్కసుతో బీఆర్ఎస్ తన వేలితో తన కంటిని పొడుచుకుంది.
కాంగ్రెస్ పార్టీని ఒడగొట్టాలని బీజేపీ బీఆర్ఎస్ ఏకమైంది.
తన పార్టీ నాశనం అయిపోయినా సరే కాంగ్రెస్ గెలవద్దని కేసీఆర్ అనుకున్నాడు.
శ్రీరాముడు, హనుమంతుడు, అక్షింతలు అంటూ నానా యాగీ చేసినా ప్రజలు మావైపు నిలబడ్డారు.
మతాన్ని ఎంత వాడుకున్నా ప్రజలు బీజేపీని ఛీ కొట్టారు.
ఎన్నికల్లో కష్టపడ్డ నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు.
నాలుగు సీట్లకు పరిమితం కావాల్సిన బీజేపీని ఎనిమిది సీట్లకు తీసుకువచ్చింది కేసీఆర్.
కవిత జైలు నుండి బయటకి రావడానికి తన పార్టీని బీజేపీకి అప్పజెప్పాడు.
-
2024-06-04T16:17:11+05:30
మహబూబ్ నగర్‌లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ విజయం
మహబూబ్‌నగర్ ఎంపీగా బీజేపీ అభ్యర్థి డీకే అరుణ విజయం సాధించారు.
4,350 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ కాంగ్రెస్ అభ్యర్థిపై గెలుపొందారు.
-
2024-06-04T16:14:32+05:30
వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య విజయం.
2.17 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచిన కడియం కావ్య.
-
2024-06-04T16:13:45+05:30
ఆదిలాబాద్: బీజేపీ అభ్యర్థి గొడం నగేష్ ఘన విజయం
-
2024-06-04T16:13:07+05:30
తెలంగాణలోనే అత్యధిక మెజార్టీ సాధించిన రఘువీర్ రెడ్డి..
నల్గొండ : రాష్ట్రంలోనే అత్యధికంగా నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి 5 లక్షల 65 వేల భారీ మెజార్టీతో గెలుపు.
-
2024-06-04T16:11:41+05:30
అసలైన ఆట ఇప్పుడుంది: సంజయ్ రౌత్
-
2024-06-04T16:05:54+05:30
కరీంనగర్ రికార్డు బద్దలు కొట్టిన బండి సంజయ్
కరీంనగర్ పార్లమెంట్ చరిత్రలో అత్యధిక మెజారిటీ సాధించిన బండి సంజయ్
2006 ఉప ఎన్నికల్లో కేసీఆర్ కు 2 లక్షల 1 వేయ్యి 581 ఓట్లు
2014లో వినోద్ కుమార్ కు 2 లక్షల 5 వేల 7 ఓట్ల మెజారిటీ
మరో 4 రౌండ్లు ఉండగానే కేసీఆర్, వినోద్ రావు రికార్డులను బద్దలు కొట్టిన బండి సంజయ్
-
2024-06-04T16:02:51+05:30
దుబ్బాకలో బీజేపీ సంబరాలు..
సిద్దిపేట : దుబ్బాక పట్టణ కేంద్రంలో బిజెపి సంబరాలు.. రఘునందన్ రావు గెలుపును హర్షిస్తూ స్వీట్లు పంచుకొని టపాసులు కాల్చిన పార్టీ శ్రేణులు -
2024-06-04T15:55:37+05:30
ఆదిలాబాద్: మీడియా తో బీజేపీ అభ్యర్థి గొడం నగేష్
నా విజయం ప్రజలు, పార్టీ కార్యకర్తల సమిష్టి కృషి
మోదీ నాయకత్వాన్ని బలపర్చిన ప్రజలందరికీ రుణ పడి ఉంటాం
అందరి సహకారం తో జిల్లా అభివృద్ధి కి కృషి చేస్తాం
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తాం
కేంద్రం నుంచి రావాల్సిన అన్ని పథకాలను తీసుకోస్తాం
ఎయిర్ పోర్టు, రైల్వే లైన్, సిసీఐ పునరుద్దరణ జరిపి తీరుతాం
-
2024-06-04T15:42:38+05:30
రామ సహాయం రఘురాం రెడ్డి ఘన విజయం..
ఖమ్మం పార్లమెంటు నియోజక వర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి ఘన విజయం
ఖమ్మం చరిత్రలో భారీ మెజారిటీతో రికార్డు సృష్టించిన రఘురాం రెడ్డి
కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డికి 7,59,603 ఓట్లు పోలయ్యాయి
రెండవ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకి 2,97,592 ఓట్లు పోలయ్యాయి.
బిజెపి అభ్యర్థి తాండ్ర వినోద్ రావుకి 1,17, 075. ఓట్లు పోలయ్యాయి.
4వ స్థానంలో నోటాకు 6657 ఓట్లు వచ్చాయి.
స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన అభ్యర్థులకు వచ్చిన
ఓట్లు మొత్తం 58,926.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘురాం రెడ్డికి 4,62,011 ఓట్ల మెజారిటీ లభించింది.
-
2024-06-04T15:27:37+05:30
2 లక్షలకు పైచిలుకు మెజార్టీతో ఈటల రాజేందర్
మల్కాజిగిరి పార్లమెంట్ 11వ రౌండ్ ఓట్ల లెక్కింపులో 2,04,776 ఓట్లతో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ముందంజలో ఉన్నారు.
ప్రస్తుత లెక్కల ప్రకారం
బీజేపీ: 5,31,856
కాంగ్రెస్: 3,27,080
బీఆర్ఎస్: 1,65,337
-
2024-06-04T15:15:21+05:30
ఢిల్లీలో ముఖ్యనేతలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే భేటీ..
ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశం.
సమావేశానికి హాజరైన జైరాం రమేష్,మరికొంతమంది నేతలు.
-
2024-06-04T15:00:35+05:30
నిజామాబాద్‌లో ధర్మపురి అరవింద్ ఘన విజయం
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి పూర్తి అయిన కౌంటింగ్
1,25,369 వేల ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ఘన విజయం
బిఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డికి దక్కిన డిపాజిట్
-
2024-06-04T14:58:47+05:30
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తా: కడియం కావ్య
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో గెలుపొందిన కడియం కావ్య మీడియాతో మాట్లాడారు. ‘ఇది సమిష్టి విజయం. నాన్నగారి స్ఫూర్తితో వరంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుతా. భారీ మెజార్టీ ఇచ్చిన వరంగల్ ప్రజలకు కృతజ్ఞతలు.’ అని తెలిపారు.
-
2024-06-04T14:56:43+05:30
బుధవారం ఎన్డీయే కీలక భేటీ..
మంగళవారం నాడు ఢిల్లీలో ఎన్డీయే కీలక సమావేశం జరగనుంది.
ఈ మీటింగ్‌కు హాజరయ్యేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు.
ఎన్డీయే సమావేశానికి హాజరు కావాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మిత్రపక్షాలకు కాల్ చేశారు.
-
2024-06-04T14:49:52+05:30
పెద్దపల్లి పార్లమెంట్ 7 నియోజక వర్గాల ఎన్నికల ఫలితాలు.
15th రౌండ్
కొప్పుల ఈశ్వర్ (BRS)-1,48,644
గడ్డం వంశీకృష్ణ (CONG)-3,75,465
గోమాసె శ్రీనివాస్ (BJP)-2,71,505
మెజారిటీ :1,03,960 వేలతో కాంగ్రెస్ లీడ్.
-
2024-06-04T14:48:04+05:30
హైదరాబాద్ పార్లమెంట్ అప్‌డేట్
గత ఎన్నికల మెజారిటీ (2.82 లక్షలు) మార్కును దాటిన అసదుద్దీన్
ఇప్పటి వరకు 2.98 లక్షల మెజారిటీ
-
2024-06-04T14:23:55+05:30
స్వతంత్ర అభ్యర్థికి శుభాకాంక్షలు తెలిపిన ఒమర్ అబ్దుల్లా..
జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా తన ఓటమిని అంగీకరించారు. గెలిచిన స్వతంత్ర అభ్యర్థి అబ్దుల్ రషీద్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. -
2024-06-04T13:40:46+05:30
తెలంగాణలో ఎలక్షన్ కౌంటింగ్ ట్రెండింగ్స్ ఇవీ..
-
2024-06-04T13:37:32+05:30
బ్యాగులు సర్దుకుని వెళ్లండమ్మ: ప్రత్యర్థులపై కంగనా సెటైర్..
పొలిటికల్ డెబ్యూట్‌లో కంగనా రనౌత్ సూపర్ సక్సెస్ అయ్యింది. బాలీవుడ్ నటి బీజేపీ తరఫున హిమాచల్ ప్రదేశ్‌లోని ‘మండి’ నుంచి పోటీ చేసిన కంగనా రనౌత్.. ప్రత్యర్థిపై 75 వేల మెజార్టీతో ముందంజలో ఉన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడి కంగనా.. బ్యాగులు సర్దుకుని వెళ్లండమ్మ అంటూ ప్రత్యర్థి విక్రమాదిత్య సింగ్‌పై సెటైర్లు వేశారు.
-
2024-06-04T13:19:19+05:30
బీజేపీ బిగ్ షాక్.. భారీగా తగ్గిన సీట్లు..
దేశ వ్యాప్తంగా 237 స్థానాల్లోనే బీజేపీ ముందంజలో ఉంది.
గతంలో కన్నా 66 స్థానాల్లో వెనుకంజలో ఉన్న బిజెపి.
2019లో 303 స్థానాల్లో బిజెపి గెలుపొందింది.
యుపిలో అత్యధికంగా గతంలో కన్నా 26 స్థానాల్లో వెనుకంజ.
యుపిలో 2019లో 68 స్థానాలను గెలుచుకున్న బిజెపి.
ప్రస్తుతం యుపిలో 42 స్థానాల్లోనే బిజెపి ముందంజ.
హర్యాణాలో బిజెపి 5 స్థానాల్లో, కాంగ్రెస్ 5 స్థానాల్లో ముందంజ.
2019లో హర్యాణాలోని 10 స్థానాలను గెలుపొందిన బిజెపి.
రాజస్థాన్ లోనూ గతంలో కన్నా గణనీయంగా బిజెపికి తగ్గిన స్థానాలు.
రాజస్థాన్ లో కూడా గతంలో కన్నా అధిక స్థానాలను గెలుచుకుంటున్న ఇండియా కూటమి
రాజస్థాన్ లో 10 స్థానాల్లో ఇండియా కూటమి ముందంజ, బిజెపి 14, ఇతరులు 1
మహారాష్ట్రలోనూ పుంజుకున్న ఇండియా కూటమి
మహారాష్ట్రలో ఇండియా కూటమి-30, ఎన్‌డిఏ కూటమికి 17 స్థానాలు, ఇతరులు 1
కర్నాటకలో ఎన్‌డిఏ కూటమికి 20 స్థానాలు, కాంగ్రెస్ 8 స్థానాలు
బిహార్ లో ఎన్‌డిఏకి 33 స్థానాలు, ఇండియా కూటమికి 7 స్థానాలు
పంజాబ్ లో కాంగ్రెస్ కి 6 స్థానాలు, ఆప్ కి మూడు స్థానాలు, శిరోమణి అకాలీదల్ కి 1, ఇతరులు 2.
తమిళనాడులో ఇండియా కూటమికి 38, అన్నాడిఎంకెకి 1.
హర్యాణాలో ఇండియా కూటమికి 7, బిజెపికి 3 స్థానాలు ఆధిక్యం.
బెంగాల్ లో టి ఎంసి 32, బిజెపి 9 స్థానాలు, కాంగ్రెస్ 1 స్థానంలో ముందంజ.
ఓడిస్సాలో బిజెపి 19, బిజెడి1 స్థానంలో ముందంజ.
ఒడిస్సాలో గతంలో కన్నా 11 స్థానాల్లో ముందంజలో ఉన్న బిజెపి.
-
2024-06-04T13:15:54+05:30
తెలంగాణలో పత్తా లేని బీఆర్ఎస్
తెలంగాణలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పత్తా లేకుండా పోయింది.
17 నియోజకవర్గాల్లో ఏ ఒక్క నియోజకవర్గంలోనూ ప్రభావం చూపలేకపోయింది.
తొలుత మెదక్‌లో ముందంజలో ఉన్నప్పటికీ.. ఆ తరువాత సీన్ మారిపోయింది.
అన్ని నియోజకవర్గాల్లోనూ 3వ స్థానంతో సరిపెట్టుకుంది.
-
2024-06-04T13:09:27+05:30
బండి సంజయ్ 1,25,575 ఓట్ల ఆధిక్యత
కరీంనగర్ లో 11 రౌండ్ పూర్తయ్యే సరికి బిజెపి అభ్యర్థి బండి సంజయ్ 1,25,575 ఓట్ల ఆధిక్యత
బిజెపి అభ్యర్థి బండి సంజయ్ కి 3,02,109
కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ రావు 1,76,623
బిఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్1,44,541
-
2024-06-04T13:01:19+05:30
యాదాద్రి : భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి
కామెంట్స్..
భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ఆరుగురు ఎమ్మెల్యేలను గెలిపించిన ప్రజలు నన్ను ఆశీర్వదించి గెలిపించారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భువనగిరి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తీసుకొని బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారు.
నన్ను గెలిపిన ప్రజలకు కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా సేవ చేస్తా
-
2024-06-04T12:58:24+05:30
పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం..
10th రౌండ్ ముగిసే సరికి
కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ - 251127
బిజెపి అభ్యర్థి గొమాసే శ్రీనివాస్ - 187620
టిఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్- 95959
మెజారిటీ : 63507 కాంగ్రెస్
-
2024-06-04T12:51:52+05:30
మహబూబ్ నగర్
రౌండ్ - 10
కాంగ్రెస్: 243361
బీజేపీ: 258932
బీఆర్ఎస్: 86868
రౌండ్ మెజారిటీ: 2636 ( బీజేపీ )
టోటల్ మెజారిటీ: 15571 ( బీజేపీ)
-
2024-06-04T12:46:38+05:30
భువనగిరి పార్లమెంట్ 20వ రౌండ్ ఫలితాలు
1,12,594 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అధిక్యం.
కాంగ్రెస్ - 3,23,813
బీజేపీ - 2,11,219
బీఆర్ఎస్ - 1,40,217
సీపీఎం - 19,50
-
2024-06-04T12:44:00+05:30
నిజామాబాద్:
6వ రౌండ్ ముగిసే సరికి బీజేపీ అభ్యర్థి అర్వింద్ లీడ్ - 33,287
మొత్తం ఓట్లు
బీజేపీ 2,47,524
కాంగ్రెస్. 2,14,237
బి.అర్.ఎస్. 41,804
-
2024-06-04T12:43:12+05:30
మహబూబాబాద్:
మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి పోరిక బలరాం నాయక్ 9 వ రౌండ్‌లో 1,60,408 ఓట్ల ఆధిక్యం.
-
2024-06-04T12:41:36+05:30
భారీ మెజార్టీలో రఘువీర్ రెడ్డి..
నల్గొండ : 4లక్షల భారీ మెజార్టీ విజయం దిశగా నల్గొండ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి
-
2024-06-04T12:40:07+05:30
భారీ ఆధిక్యం దిశగా రాహుల్ గాంధీ..
ఉత్తరప్రదేశ్: రాయ్‌బరేలి లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీ ముందంజ
1,64,249 ఓట్ల ఆధిక్యంలో రాహుల్ గాంధీ.
-
2024-06-04T12:39:05+05:30
చేవెళ్ల లోక్ సభ నియోజక వర్గం
7వ రౌండ్ ముగిసే సరికి..
బీఆర్ఎస్ : 47,296
బీజేపీ : 2,34,031
కాంగ్రెస్ : 1,63,932
బీజేపీ అభ్యర్థి
కొండా విశ్వేశ్వర్ రెడ్డికి 70,099 ఓట్ల ఆధిక్యత
-
2024-06-04T12:36:54+05:30
ఎన్డీయేకి వాళ్లు హ్యాండిస్తే జరిగేదిదే..!
ఈసారి సార్వత్రిక ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. వార్ వన్ సైడే అనుకుంటే.. పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పైకి కూటములు ఉన్నా.. అందులోని పార్టీలు హ్యాండిస్తే మాత్రం లెక్కలన్నీ తారుమారయ్యే అవకాశం ఉంది. అందుకే.. ఈసారి కేంద్రంలో అధికారం చేపట్టేది ఎవరు అనే ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత లెక్కల ప్రకారం.. బీజేపీ పూర్తిస్థాయి మెజిక్‌ఫిగర్ సీట్లను సాధించలేదు. కేంద్రంలో అధికారం చేపట్టాలంటే ఆ పార్టీకి మిత్రపక్షాల మద్దతు తప్పనిసరి. ప్రస్తుతం ఆ పార్టీ 239 స్థానాల్లో ముందంజలో ఉంది. మేజిక్ ఫిగర్ 272 కాగా.. ఇంకా 33 సీట్లు కావాల్సి ఉంటుంది. ఎన్డీయే మిత్రపక్షాలన్నీ కలిసి 297 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. వీరిలో ఎక్కువ సీట్లు ఉన్న నితీష్ కుమార్ గానీ, మహారాష్ట్రలో షిండే వర్గం గానీ.. జేడీఎస్ లాంటి కొన్ని ప్రధాన పార్టీలు హ్యాండిస్తే మాత్రం సీన్ మారిపోయే అవకాశం ఉంది.
-
2024-06-04T12:20:09+05:30
Lok Sabha Election Counting: జమ్మూకశ్మీర్‌లో ఇండియా కూటమి హవా..
జమ్మూ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించిన తరువాత ఆ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికల్లో ఇండియా కూటమి హవా నడుస్తోంది. జమ్మూ కాశ్మీర్‌లోని 5 స్థానాలకు గాను 4 స్థానాల్లో భారత కూటమి ఆధిక్యంలో ఉంది. ఎన్డీయే కూటమి ఒక చోట లీడ్‌లో ఉంది.
-
2024-06-04T12:10:58+05:30
నల్గొండ : నల్గొండ పార్లమెంట్ 22వ రౌండ్ ఫలితాలు.
3,28,534 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి అధిక్యం.
కాంగ్రెస్ - 4,82,305
బీజేపీ - 1,53,771
బీఆర్ఎస్ - 1,36,268
-
2024-06-04T12:09:53+05:30
ఖమ్మం:
ఖమ్మం పార్లమెంటు స్థానంలో కొనసాగుతున్న కాంగ్రెస్ ఆధిక్యత
కాంగ్రెస్ అభ్యర్థి రామ సాయం రఘురాం రెడ్డి 286237 ఓట్ల ఆధిక్యత
-
2024-06-04T12:08:37+05:30
నాగర్ కర్నూల్
నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజవర్గం 7వ, రౌండ్ పూర్తి అయ్యే వరకు
1)బి.ఆర్.ఎస్: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 1,22,122 ఓట్లు
2)బిజెపి: భరత్ ప్రసాద్:1,37,707 ఓట్లు
3)కాంగ్రెస్: మల్లు రవి:1,57,882 ఓట్లు
7వ, రౌండ్ పూర్తి అయ్యే వరకు కాగ్రెస్ 18,796 ఆధిక్యం
-
2024-06-04T12:02:36+05:30
కేంద్ర మంత్రికి బిగ్ ఝలక్...
అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టిన స్మృతి ఇరానీ.. ఈ ఎన్నికల్లో మాత్రం పరాజయం బాటలో పయనిస్తున్నారు. గాంధీ కుటుంబ విధేయుడు అయిన కేఎల్ శర్మ.. స్మృతి ఇరానీ కంటే 28,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కాగా, అమేథీకి మూడు పర్యాయాలు ప్రాతినిధ్యం వహించిన తర్వాత ఎంపీ రాహుల్ గాంధీ.. 2019లో స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. ఈసారి ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి రాహుల్ పోటీ చేస్తున్నారు.
-
2024-06-04T11:56:15+05:30
యాదాద్రి : భువనగిరి పార్లమెంట్ 15వ రౌండ్ ఫలితాలు
94,484 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అధిక్యం.
కాంగ్రెస్ - 2,70,686
బీజేపీ - 1,76,202
బీఆర్ ఎస్ - 1,14,952
సీపీఎం - 17,955
-
2024-06-04T11:54:28+05:30
వెస్ట్‌బెంగాల్‌లో టీఎంసీ హవా...
పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ హవా నడుస్తోంది.
ఈ రాష్ట్రంలో టీఎంసీ 31 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది.
బీజేపీ 10 చోట్ల, కాంగ్రెస్ 1 చోట ముందంజలో ఉన్నాయి.
-
2024-06-04T11:50:03+05:30
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి ముందంజ..
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి ముందంజలో ఉంది.
టీడీపీ 16 స్థానాల్లో లీడ్‌లో ఉంది.
వైసీపీ 4 చోట్ల లీడ్.
బీజేపీ 3 చోట్ల లీడ్.
జనసేన పార్టీ 2 చోట్ల లీడ్‌లో ఉంది.
-
2024-06-04T11:45:50+05:30
ఖమ్మం చరిత్రలో రికార్డుల బ్రేక్
గత ఎన్నికలలో బిఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కి 1, 68,848 మెజారిటీ
రికార్డ్ ను పదకొండు వ రౌండ్ లో బ్రేక్ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి రామ సహాయం రఘు రాం రెడ్డి...
236370 ఓట్లు ఆధిక్యత లో రఘు రాం రెడ్డి
-
2024-06-04T11:44:04+05:30
యాదాద్రి : భువనగిరి పార్లమెంట్ 13వ రౌండ్ ఫలితాలు
87,270 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అధిక్యం.
కాంగ్రెస్...2,50,711
బీజేపీ....1,63,441
బీఆర్ ఎస్... 1,08,253
సీపీఎం 16921
-
2024-06-04T11:43:30+05:30
మహారాష్ట్రలో మారిన సీన్..
మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి అధిక్యంలో కొనసాగుతోంది.
ఇక్కడ కాంగ్రెస్ 11 స్థానాల్లో లీడ్‌లో ఉంది.
బీజేపీలో 11 స్థానాల్లో..
శివసేన(ఉద్దవ్ ఠాకరే) 10 స్థానాల్లో..
ఎన్‌సీపీ(శరత్ పవార్) 8 స్థానాల్లో..
శివసేన(షిండే) 6 స్థానాల్లో..
ఎన్‌సీపీ 1 చోట
స్వతంత్ర అభ్యర్థి ఒక చోట లీడ్‌లో కొనసాగుతున్నారు.
-
2024-06-04T11:36:32+05:30
చేవెళ్ల లోక్ సభ నియోజక వర్గం
4వ రౌండ్ ముగిసే సరికి..
బీఆర్ఎస్ : 33,624
బీజేపీ : 1,61,309
కాంగ్రెస్ : 1,08,110
బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి 53,199 ఆధిక్యత
-
2024-06-04T11:34:41+05:30
తెలంగాణ ఎంపీ స్థానాల్లు
ఎనిమిది స్థానాల్లో బీజేపీ ముందంజ.
ఏడు స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యం.
చెరో స్థానంలో బీఆర్‌ఎస్, ఎంఐఎం.
-
2024-06-04T11:33:32+05:30
Lok Sabha Election Counting: దేశ వ్యాప్తంగా అగ్రనేతల పరిస్థితి ఇదీ..
దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. దేశంలో ప్రధాన పార్టీలకు చెందిన అగ్రనేతల ఫలితాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.
వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ లీడింగ్‌లో ఉన్నారు.
గాంధీనగర్‌లో అమిత్ షా లీడ్‌లో కొనసాగుతున్నారు.
రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ ముందంజలో ఉన్నారు.
ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కనౌజ్ నుంచి ముందంజలో ఉన్నారు.
ఎన్‌సీపీ ఎస్పీ అభ్యర్థి సుప్రియా సూలే బారామతి నుంచి ముందంజలో ఉన్నారు.
ప్రణితి సుశీల్ కుమార్ షిండే సోలాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు.
బీడ్ బీజేపీ అభ్యర్థి పంకజా గోపీనాథ్ ముండే లీడ్‌లో ఉన్నారు.
సంబాల్‌పూర్ నుంచి బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ముందంజలో ఉన్నారు.
ఎస్‌ఏడీ భటిండా అభ్యర్థి హర్‌సిమ్రత్ కౌర్ ముందంజలో ఉన్నారు.
ఆప్ అభ్యర్థి బల్బీర్ సింగ్ వెనుకంజలో ఉన్నారు.
మెయిన్‌పూర్ అభ్యర్థి డింపుల్ యాదవ్ ముందంజలో ఉన్నారు.
లక్నో నుంచి రాజ్‌నాథ్ సింగ్ ముందంజలో కొనసాగుతున్నారు.
జోధ్‌పూర్ బీజేపీ అభ్యర్థి గజేంద్ర సింగ్ షెకావత్ ముందంజలో కొనసాగుతున్నారు.
తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ అభ్యర్థి తమిళిసై సౌందరరాజన్ వెనుకంజలో ఉన్నారు.
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు, కోయంబత్తూర్ అభ్యర్థి అన్నామలై వెనుకంజలో ఉన్నారు.
కాంగ్రెస్ ముఖ్యనేత మాణికం ఠాగూర్ విరుధు నగర్ నుంచి వెనుకంజలో ఉన్నారు.
రామనాథపురం నుంచి పన్నీర్ సెల్వం వెనుకంజలో ఉన్నారు.
కురుక్షేత్ర బీజేపీ అభ్యర్థి నవీన్ జిందాల్ వెనుకంజలో ఉన్నారు.
హమిర్‌పూర్ బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి అనురాగ్ శర్మ ముందంజలో కొనసాగుతున్నారు.
-
2024-06-04T10:49:04+05:30
Lok Sabha Election Results: స్మతీ ఇరానీకి షాక్..
అమేథీలో ముందంజలో కాంగ్రెస్ నేత కిషోరీ లాల్ శర్మ.
19,177 ఓట్ల ఆధిక్యంలో కిషోరీ లాల్ శర్మ.
అమేథీ లో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ వెనుకంజ.
-
2024-06-04T10:48:42+05:30
మల్కాజ్‌గిరి పార్లమెంటు నియోజకవర్గం
బిఆర్ఎస్ 17,697
బిజెపి 51,438
కాంగ్రెస్ 32,892
బిజెపి 18546 లీడ్
-
2024-06-04T10:47:45+05:30
సిద్దిపేట : మెదక్ పార్లమెంటు మూడో రౌండ్..
కాంగ్రెస్. - 22174
బిజెపి. - 23365
బిఅర్ఎస్ - 20914
మూడో రౌండ్లో కాంగ్రెస్ పై బిజెపి లీడ్ - 1191
మూడో రౌండ్ పూర్తయ్యే సరికి పార్టీల వారీగా వచ్చిన ఓట్లు.
కాంగ్రెస్. - 63273
బిజెపి. - 65286
బిఅర్ఎస్ - 63655
మూడో రౌండ్ పూర్తయ్యే సరికి బిజెపి లీడ్ - 1631
-
2024-06-04T10:46:10+05:30
మహబూబాబాద్ పార్లమెంటు :
3వ రౌండ్ పూర్తి...
1) బీజేపీ సీతారాం నాయక్-16413.
2) కవితా మలోత-41123.
3) బలరాం నాయక్ పోరిక 92918.
కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ 51793 ఓట్ల ఆధిక్యంతో ముందంజ.
-
2024-06-04T10:44:13+05:30
Lok Sabha Election Counting: కంగనా ముందంజ..
హిమాచల్ ప్రదేశ్ మండిలో నటి కంగనా రనౌత్ ముందంజలో ఉన్నారు.
30,254 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
ఎన్నికల్లో గెలుపొందాలని ఆకాంక్షిస్తూ కంగనా తన ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
-
2024-06-04T10:37:24+05:30
రాయ్ బరేలిలో రాహుల్ గాంధీ ముందంజ
28,326 ఆధిక్యంలో రాహుల్ గాంధీ.
అలప్పుజ ఏఐసిసి జనరల్ సెక్రెటరీ కేసి వేణుగోపాల్ ముందంజ.
14507 ఓట్ల ఆధిక్యంలో కేసి వేణుగోపాల్.
-
2024-06-04T10:35:51+05:30
ముందంజలో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్
జహీరాబాద్ లోక్ సభ స్థానం నాలుగో రౌండ్ ముగిసే సరికి
బీజేపీ- 113085
కాంగ్రెస్- 126159
బీఆర్ ఎస్ - 42859
13,074 ఓట్ల తేడాతో ముందంజలో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్
-
2024-06-04T10:33:57+05:30
నాగర్కర్నూలులో మల్లు రవి ఆధిక్యం
మొదటి రౌండ్..
మల్లు రవి - 24,976
RS ప్రవీణ్ (BRS) - 20269
భరత్ (BJP)- 18890
కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి ఆధిక్యం - 4707
-
2024-06-04T10:32:34+05:30
ఆదిలాబాద్‌లో బీజేపీ ఆధిక్యం..
ఆదిలాబాద్ 4 వ రౌండ్ ఓవరాల్‌గా 31965ఓట్ల అధిక్యంలో బీజేపీ అభ్యర్థి నగేష్
బీఆర్ఎస్ - 25198
కాంగ్రెస్ - 77801
బీజేపీ - 109766
-
2024-06-04T10:30:03+05:30
కరీంనగర్: లీడ్‌లో బండి సంజయ్..
కరీంనగర్ పార్లమెంట్ ఓట్ల లెక్కింపులో 3వ రౌండ్ పూర్తి.
బండి సంజయ్ బీజేపి: 86447
వెలిచాలా రాజేందర్ కాంగ్రెస్: 47134
వినోద్ కుమార్ బీఆర్ఎస్: 39228
లీడ్: 39313 ఓట్లతో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఆధిక్యం
-
2024-06-04T10:29:53+05:30
నిజామాబాద్: బీఆర్ఎస్ అభ్యర్థి డిపాజిట్ గల్లంతయ్యే ఛాన్స్ !
5వ రౌండ్ ముగిసే సరికి 38,500 ఓట్ల ఆధిక్యంలో బిజెపి అభ్యర్థి ధర్మపురి అర్వింద్..
ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్, కోరుట్ల లో బీజేపీ అధిక్యం,
జగిత్యాల, బోధన్ లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి స్వల్ప ఆధిక్యం.
బీఆర్ఎస్ అభ్యర్థి బాజీరెడ్డి గోవర్ధన్ డిపాజిట్ గల్లంతు అయ్యే అవకాశం
-
2024-06-04T10:28:27+05:30
యాదాద్రి : భువనగిరి పార్లమెంట్ రెండో రౌండ్ ఫలితాలు
18,295 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అధిక్యం.
కాంగ్రెస్ - 60,986
బీజేపీ- 43,691
బీఆర్ఎస్ - 28,980
-
2024-06-04T10:24:10+05:30
Karnataka: జేడీఎస్ ఎంపీ అభ్యర్థి రేవణ్ణ లీడ్‌లో కొనసాగుతున్నారు
-
2024-06-04T10:23:06+05:30
ఎంఐఎం పార్టీ ఆఫీసులో అసదుద్దీన్..
-
2024-06-04T10:15:56+05:30
మళ్లీ అధికారం మాదే: హేమామాలిని
కేంద్రంలో మరోసారి బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వమే ఏర్పడుతుందని యుపీలోని మధుర బీజేపీ అభ్యర్థి హేమ మాలిని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘ప్రస్తుతం చాలా ఉత్సాహభరితమైన క్షణం. మా పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. నేను కూడా మంచి ఆధిక్యాన్ని పొందుతున్నాను.’ అని హేమామాలిని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె 48,110 ఓట్ల తేడాతో ఆధిక్యంలో ఉన్నారు.
-
2024-06-04T10:00:51+05:30
మోదీ మాజీ ప్రధాని అవడం ఖాయం..: జైరామ్ రమేష్
-
2024-06-04T09:58:05+05:30
మహబూబ్ నగర్: ఆధిక్యంలో బిజేపీ అభ్యర్థి డి. కె. అరుణ..
దేవరకద్ర, మక్తల్‌లలో బిజేపీ..
షాద్ నగర్‌లో కాంగ్రెస్ ముందంజ
-
2024-06-04T09:53:49+05:30
బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ దక్కేనా?
బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దక్కే అవకాశాలు కనిపించడంలేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
బిజెపికి 272 కన్నా తక్కువ స్థానాలు దక్కే అవకాశం
పెరుగుతున్న ఇండియా కూటమి స్థానాలు
యుపిలో 42 స్థానాల్లో ఇండియా కూటమి లీడింగ్
అమేథీ లో స్మృతి ఇరానీ వెనుకంజ
సెంట్రల్ ఢిల్లీలో సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరీ స్వరాజ్ వెనుకంజ
-
2024-06-04T09:51:22+05:30
నల్లగొండలో కాంగ్రెస్ మెజార్టీ..
నల్లగొండలో మూడో రౌండ్ ముగిసే సరికి 70వేల అధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి.
-
2024-06-04T09:49:24+05:30
యూపీలో మారిన సీన్..
ఉత్తరప్రదేశ్ అమేథీ లోక్‌సభ బరిలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వెనుకంజ.
అమేథీ లోక్‌సభ బరిలో ముందంజలో కాంగ్రెస్ నేత కిషోరీ లాల్ శర్మ.
-
2024-06-04T09:48:20+05:30
జహీరాబాద్ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి లీడ్..
జహీరాబాద్ లోక్ సభ స్తానంలో రెండో రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ 5 వేలకుపైగా మెజార్టీలో ఉన్నారు.
-
2024-06-04T09:47:18+05:30
కరీంనగర్‌లో బీజేపీ ముందంజ..
కరీంనగర్‌లో మొదటి రౌండ్లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఆధిక్యం
-
2024-06-04T09:46:32+05:30
వరంగల్‌లో కాంగ్రెస్ ముందంజ
వరంగల్ లొలి రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య 8,404 ఓట్ల ఆధిక్యం
-
2024-06-04T09:44:53+05:30
Lok Sabha Election Counting: యూపీలో ముందంజలో ఇండియా కూటమి
38 స్థానాల్లో ఇండియా కూటమి ముందంజలో ఉంది.
34 స్థానాల్లో ఎన్డీయే కూటమి లీడ్‌లో కొనసాగుతోంది.
ఉత్తర ప్రదేశ్ సుల్తాన్ పూర్‌లో మేనక గాంధీ వెనుకంజ.
ఇప్పటి వరకు ఎన్డీయే కూటమి 291 స్థానాల్లో ముందంజలో ఉండగా.. ఇండియా కూటమి 210 స్థానాల్లో ముందంజలో ఉంది.
-
2024-06-04T09:36:04+05:30
Lok Sabha Election Counting: కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజ..
వరంగల్, మహబూబాబాద్‌లో దూసుకుపోతున్న కాంగ్రెస్
రెండు రౌండ్లలోనూ ముందంజలో కాంగ్రెస్ అభ్యర్థులు
-
2024-06-04T09:31:12+05:30
Lok Sabha Election Counting: యూపీ ఫలితాలు ఇలా..
ఉత్తర ప్రదేశ్ గోరఖ్పూర్‌లో నటుడు రవి కిషన్ ముందంజ.
ఉత్తర్ ప్రదేశ్ కన్నౌజ్ లోక్‌సభలో ముందంజలో అఖిలేష్ యాదవ్.
గౌతమ్ బుద్ధ నగర్ కేంద్ర మాజీ మంత్రి మహేష్ శర్మ ముందంజలో.
-
2024-06-04T09:13:32+05:30
Lok Sabha Election Counting: 283 స్థానాల్లో ఎన్డీయే.. 192 స్థానాల్లో ఇండియా కూటమి..
లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. దేశ వ్యాప్తంగా 283 స్థానల్లో ఎన్డీయే కూటమి ముందంజలో ఉంది. అదే సమయంలో ఇండియా కూటమి కూడా గట్టి పోటీ ఇస్తోంది. 198 స్థానల్లో లీడ్‌లో కొనసాగుతోంది.
-
2024-06-04T09:10:33+05:30
హైదరాబాద్ పార్లమెంట్‌లో బిజెపి అభ్యర్థి మాధవిలత ముందంజ
యాకుత్ పుర తొలి రౌండ్
ఎంఐఎం -2521
బీజేపీ -3785
కాంగ్రెస్ -231
బీఆర్ఎస్ -120
-
2024-06-04T09:08:18+05:30
లోక్ సభ ఫలితాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్న ఎన్డీఏ
వారణాసిలో ముందంజలో ప్రధాని మోడీ
గాంధీ నగర్ లో ముందంజలో అమిత్ షా
న్యూ ఢిల్లీలో ముందంజలో బాన్సురి స్వరాజ్
అమేథీలో ముందజలో స్మృతి ఇరానీ
రాయబరేలి,వయనాడ్ లో ముందంజలో రాహుల్ గాంధీ
లక్నో లో ముందంజలో రాజ్ నాథ్ సింగ్
కనౌజ్ లో ముందంజలో అఖిలేష్ యాదవ్
మెయిన్ పురిలో ముందంజ లో డింపుల్ యాదవ్
మధురలో ముందంజలో హేమామలిని
-
2024-06-04T09:03:38+05:30
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మొదటి రౌండ్ ఫలితాలు..
బీజేపీ-3571
కాంగ్రెస్- 3788
బీఆర్ఎస్- 1337
లీడ్ కాంగ్రెస్- 238
-
2024-06-04T09:02:46+05:30
మహబూబాబాద్ జిల్లా లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్..
రెండవ రౌండ్ పూర్తి
బీజేపీ: 1686
బీ ఆర్ ఎస్: 5150
కాంగ్రెస్: 9711
ఆధిక్యంలో కాంగ్రెస్: 4561
-
2024-06-04T08:57:16+05:30
ఈటెల ఆధిక్యం
మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధి ఎల్బి నగర్ అసెంబ్లీ సెగ్మెట్ లో మొదటి రౌండ్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 6330 ఓట్ల తో ఆధిక్యం
బీజేపీ :-8811
కాంగ్రెస్ :2581
బిఆర్ఎస్ :1418
-
2024-06-04T08:56:38+05:30
వరంగల్ పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్.
వరంగల్ వెస్ట్ తొలి రౌండు
రౌండ్ నెంబర్ : 1 2
బీజేపీ 5203 3657
కాంగ్రెస్ 2932 3522
బీ ఆర్ ఎస్ 691 708
బీజేపీ 2271 135 ఓట్ల ఆదిత్యంలో బిజెపి.
పరకాల 104 తొలి రౌండు
బిజెపి 1761
కాంగ్రెస్ 3538
టీఆర్ఎస్ 2764
కాంగ్రెస్ 774 పరకాలలో కాంగ్రెస్ ముందంజు
-
2024-06-04T08:54:51+05:30
ముందంజలో అగ్రనేతలు..
వారణాసిలో మోదీ.
గాంధీనగర్‌లో అమిత్ షా.
కేరళ వాయినాడ్‌లో రాహుల్ ముందంజ.
నాగ్‌పూర్‌లో గడ్కరీ.
మండిలో కంగనా రనౌత్.
మైన్‌పురిలో డింపుల్ ఆధిక్యంలో ఉన్నారు.
-
2024-06-04T08:52:42+05:30
హైదరాబాద్ పార్లమెంట్‌లోని చాంద్రాయణగుట్ట అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటి రౌండ్ కౌంటింగ్‌లో ఎవరికెన్ని ఓట్లు వచ్చాయంటే..
ఎంఐఎం -6784
బీజేపీ 235
కాంగ్రెస్ 291
బిఆర్ఎస్ 19
-
2024-06-04T08:51:19+05:30
తమిళనాడులో 39 కేంద్రాల్లో కొనసాగుతున్న కౌంటింగ్..
తమిళనాడులో తమిళిసై సౌందరరాజన్, ఓ పన్నీర్ సెల్వం, టిఆర్ బాలు, దయానిధి మారన్, ఎల్ మురుగన్, కనిమొళి, టిటివి దినకరన్, కె అన్నామలై సహా కీలక పోటీదారులతో సహా 950 మంది అభ్యర్థుల భవితవ్యం ఈ రోజు తేలనుంది.
-
2024-06-04T08:47:42+05:30
Lok Sabha Elections Counting: 211 స్థానాల్లో ఎన్డీయే.. 136 స్థానాల్లో ఇండియా కూటమి..
లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌లో ఎన్డీయే కూటమి దూసుకుపోతోంది. 211 స్థానాల్లో ఎన్డీయే ముందంజలో ఉంది. అదే సమయంలో 136 స్థానాల్లో ఇండియా కూటమి లీడ్‌లో ఉంది.
-
2024-06-04T08:45:28+05:30
Lok Sabha Election Counting: రాజ్‌నాథ్ సింగ్ ముందంజ
లక్నోలో కేంద్ర రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ ముందంజ.
మధ్యప్రదేశ్ లో శివరాజ్ సింగ్ చౌహాన్ ముందజ.
అమేథీలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ముందంజ.
-
2024-06-04T08:44:13+05:30
Lok Sabha Election Counting: తెలంగాణలో ఏ పార్టీ ముందంజ అంటే..
ఆదిలాబాద్ :పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ అభ్యర్థి నగేష్ ముందంజ
మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో కాంగ్రెస్ లీడ్
ఖమ్మం: కొనసాగుతున్న మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి రామసాయం రఘురాంరెడ్డి
పెద్దపల్లి: మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపులో 816 కాంగ్రెస్ వంశీ కృష్ణ లీడ్
-
2024-06-04T08:42:28+05:30
Lok Sabha Election Counting: లీడ్‌లో కిషన్ రెడ్డి
ముషీరాబాద్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు దోమలగూడ ఏవి కళాశాలలో ప్రారంభమైంది.
బిజెపి అభ్యర్థి కిషన్ రెడ్డి కి వచ్చిన ఓట్లు...4733
కాంగ్రెస్ అభ్యర్థి దానంకు వచ్చిన ఓట్లు 1318
టిఆర్ఎస్ అభ్యర్థి పద్మారావుకు వచ్చిన ఓట్లు 1029
-
2024-06-04T08:40:14+05:30
Lok Sabha Election Counting: వరంగల్ పార్లమెంట్‌లో బీజేపీ లీడ్..
వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్ పోస్టల్ బ్యాలెట్ లలో బీజేపీ లీడ్
-
2024-06-04T08:38:23+05:30
Lok Sabha Election Counting: 156 సీట్లలో ఎన్డీయే, 119 చోట్ల ఇండియా కూటమి ముందంజ..
లోక్‌సభ ఎన్నికల కౌలింగ్‌లో ఎన్డీయే కూటమి దూసుకుపోతోంది. 156 సీట్లలో ఎన్డీయే కూటమి ముందంజలో ఉంది. 119 స్థానాల్లో ఇండియా కూటమి లీడ్‌లో ఉంది.
-
2024-06-04T08:36:35+05:30
Lok Sabha Election Counting: ఢిల్లీలో సుష్మా స్వరాజ్ కూతురు ముందంజ..
సెంట్రల్ ఢిల్లీలో బీజేపీ అభ్యర్థి బాన్సూరి స్వరాజ్ ముందంజ.
పూర్ణియ లోక్ సభలో పప్పు యాదవ్ ముందంజ
-
2024-06-04T08:34:36+05:30
నిజామాబాద్: పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ లీడ్
పోస్టల్ బ్యాలెట్ల లో బీజేపీ లీడ్
మొత్తం 7414 పోస్టల్ ఓట్లు
-
2024-06-04T08:29:10+05:30
వరంగల్: తొలుత పోస్టల్ బ్యాలెట్, హోం ఓటింగ్ లెక్కింపు ప్రారంభం
పోస్టల్ బ్యాలెట్,హోం ఓటింగ్,సర్వీసు ఓట్లను తొలుత ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లోని గోదాం సంఖ్య 18సీలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన 14 టేబుళ్లపై రెండు రౌండ్లలో లెక్కించనున్నారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా 12,521 ఓట్లు, హోం ఓటింగ్ ద్వారా 1,718 ఓట్లు పోలైనట్లు అధికారులు వెల్లడించారు. 540-- సర్వీసు ఓట్లు
-
2024-06-04T08:27:57+05:30
కరీంనగర్: బండి సంజయ్ లీడ్..
కరీంనగర్ లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు
మొత్తం పోలైన 10847 ఓట్లు
పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ బండి సంజయ్ లీడ్
-
2024-06-04T08:26:23+05:30
Lok Sabha Election Counting: లీడ్‌లో ఎన్డీయే ముందంజ..
కౌంటింగ్‌లో ఎన్డీయే కూటమి ముందంజలో దూసుకుపోతోంది. 110 స్థానాల్లో ఎన్డీయే ముందంజలో ఉండగా.. ఇండియా కూటమి 90కి పైగా స్థానాల్లో లీడ్‌లో ఉంది.
-
2024-06-04T08:21:54+05:30
Lok Sabha Election Counting: ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన హెచ్‌డీ కుమారస్వామి
Lok Sabha Election Counting: జేడీఎస్ నాయకుడు హెచ్‌డీ కుమారస్వామి బెంగళూరులోని గంగాధరేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
-
2024-06-04T08:15:02+05:30
LokSabhaElections Counting2024: బీజేపీ ఖాతాలో సూరత్ ఎంపీ సీటు..
LokSabhaElections Counting2024: దేశ వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 543 లోక్‌సభ స్థానాలకు గానూ 542 స్థానాల్లో అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. అయితే, సూరత్ స్థానాన్ని బీజేపీ అనూహ్యంగా గెలుచుకుంది.
-
2024-06-04T08:09:57+05:30
Lok Sabha Election Counting: బెంగాల్‌లో ప్రారంభమైన కౌంటింగ్..
Lok Sabha Election Counting: బెంగాల్‌లోని బసిరత్ పార్లమెంట్ నియోజకవర్గం కౌంటింగ్ కేంద్రం వద్ద భారీగా గుమిగూడిన ఆయా పార్టీల శ్రేణులు.
-
2024-06-04T08:01:57+05:30
542 లోక్‌సభ స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభం
-
2024-06-04T08:00:26+05:30
దేశ వ్యాప్తంగా 542 లోక్‌సభ స్థానాల్లో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు
-
2024-06-04T07:56:08+05:30
పశ్చిమబెంగాల్‌లోని హుగ్లీ లోక్‌సభ స్థానం కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కౌంటింగ్ సెంటర్‌లోకి ప్రవేశించేముందు బీజేపీ, టీఎంసీ కౌంటింగ్ ఏజెంట్లు పోటాపోటీ నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
-
2024-06-04T07:46:06+05:30
కౌంటింగ్ కేంద్రాలకు చేరుకున్న ఈవీఎం బ్యాలెట్ బాక్సులు.. కాసేపట్లో ప్రారంభంకానున్న కౌంటింగ్
-
2024-06-04T07:45:25+05:30
లోక్‌సభ ఎన్నికల్లో ఖాతా తెరిచిన బీజేపీ.. సూరత్ స్థానాన్ని ఏకగ్రీవంగా గెలుచుకున్న ముఖేశ్ దలాల్
-
2024-06-04T07:34:28+05:30
మరికాసేపట్లో దేశవ్యాప్తంగా మొత్తం 542 లోక్‌సభ స్థానాల్లో మొదలు కానున్న కౌంటింగ్
-
2024-06-04T07:01:04+05:30
లోక్‌సభ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇలా..
నిబంధనల ప్రకారం తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు.
పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు మొదలైన అరగంట తర్వాతే ఈవీఎంల్లోని ఓట్ల లెక్కింపును మొదలెట్టాల్సి ఉంటుంది.
ఒకవేళ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్లు లేకుంటే నిర్దేశించిన సమయానికే ఈవీఎంల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభించాలి.
కంట్రోల్ యూనిట్ల నుంచి ఫలితాన్ని నిర్ధారించే ముందు.. పేపర్ సీల్ చెదిరిపోకుండా చూసుకోవాలి.
అనంతరం మొత్తం పోలైన ఓట్లను, ఫారం 17సీలో పేర్కొన్న సంఖ్యతో సరిపోల్చుకోవాలి.
-
2024-06-04T06:40:08+05:30
కేంద్రంలో అధికార పీఠం ఎవరిదో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. ప్రజలు, రాజకీయ పార్టీల ఉత్కంఠకు తెరపడనుంది. వరసగా మూడోసారి, రికార్డు విజయంపై ప్రధాని మోదీ కన్నేయగా.. ప్రతిపక్ష ఇండీ కూటమి అనూహ్యంగా తామే అధికారంలోకి వస్తామని ధీమాగా ఉంది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఏకపక్షంగా కేంద్రంలో మళ్లీ మోదీ సర్కారే వస్తుందని, బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ సారి 400 సీట్లు సాధించాలన్న మోదీ లక్ష్యానికి దగ్గరగా ఎన్డీయే కూటమి సీట్లు సాధిస్తుందని అంచనా వేశాయి. ఇక ఎగ్జిట్ పోల్స్‌ను నమ్మొద్దని ఇండియా కూటమి చెబుతోంది. అంచనాకు మించిన ఫలితాలతో అధికారాన్ని దక్కించుకోబోతున్నట్టు కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు చెబుతున్నాయి. మరి ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా? లేక జనాల తీర్పు మరోలా ఉంటుందా?.. అనే ప్రశ్నలకు మరికొన్ని గంటల్లోనే సమాధానం దొరకనుంది. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన లైవ్ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి.కామ్ అందిస్తోంది.