ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bonda Uma: జగన్‌కు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు...

ABN, Publish Date - Apr 29 , 2024 | 11:00 AM

Andhrparadesh: ముఖ్యమంత్రి జగన్‌కు ఉన్న డబ్బు పిచ్చి వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని టీడీపీ నేత బోండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నీటి ప్రాజెక్టులు పూర్తి చేయకుండా.. కమీషన్లకు కక్కుర్తి పడి పనులు ఆపేశారన్నారు. జగన్ దెబ్బకు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడి దారులు ఏపీ వైపు చూసేందుకు భయపడిపోతున్నారన్నారు.

TDP Leader Bonda Uma

విజయవాడ, ఏప్రిల్ 29: ముఖ్యమంత్రి జగన్‌కు (CM Jagan) ఉన్న డబ్బు పిచ్చి వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని టీడీపీ నేత బోండా ఉమా (TDP Leader Bonda Uma) ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నీటి ప్రాజెక్టులు పూర్తి చేయకుండా.. కమీషన్లకు కక్కుర్తి పడి పనులు ఆపేశారన్నారు. జగన్ దెబ్బకు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడి దారులు ఏపీ (Andhrapradesh) వైపు చూసేందుకు భయపడిపోతున్నారన్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో జరిగిన అవినీతిని అంశాల వారీగా పుస్తక రూపంలో ప్రచురించామని చెప్పారు. ల్యాండ్, శాండ్, మైనింగ్, లిక్కర్, భూ మాఫియా ఇలా అన్నింటినీ వదలకుండా దోచుకున్నారని మండిపడ్డారు. అన్ని వ్యవస్థలను జగన్ చేతిలో పెట్టుకుని.. అందిన కాడికి అడ్డగోలుగా అవినీతికి పాల్పడ్డారని విరుచుకుపడ్డారు.

AP Election 2024: వైసీపీలో నైరాశ్యం!.. అక్కడ పరిస్థితి చూసి అంతర్మథనం


మళ్లీ జైలుకు వెళ్లేందుకు జగన్ సిద్ధం

18 నెలలు జైలులో ఉన్న జగన్.. మళ్లీ జైలుకు వెళ్లడానికి సిద్దం అంటున్నారని.. అంతే కానీ తప్పు చేశామనే కనీసం పశ్చాత్తాపం కూడా లేదన్నారు. మళ్లీ అవినీతికి పాల్పడుతూ డబ్బు మీద వ్యామోహంతో వ్యవస్థలను కూడా నాశనం చేశారన్నారు. నేడు ఏపీలో వ్యాపారాలు లేవని.. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేకుండాపోయాయన్నారు. 2.50 లక్షల కోట్లు బటన్ నొక్కానని చెబుతున్న జగన్ మిగతా తొమ్మిది లక్షల కోట్లు ఎక్కడకి వెళ్లాయని ప్రశ్నించారు. 12 లక్షల కోట్లు అప్పు తెచ్చానని చెబుతున్న జగన్.. వాటిపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక్క ఛాన్స్ ఇస్తేనే రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను జగన్ దుర్వినియోగం చేశారన్నారు. వైసీపీ నాయకులు, సలహాదారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం ఎవరి స్థాయిలో వారు అందినకాడికి దోచేశారని ఆరోపించారు.

Hyderabad Metro news: 200లోపు ఖర్చుతో.. ఎట్నుంచైనా ఎయిర్‌పోర్టుకు!


అలాంటి చరిత్ర నీది...

మోదీ (PM Modi) ఉచితంగా ఇచ్చిన బియ్యాన్ని కూడా ప్రజలకు ఇవ్వకుండా విదేశాలకు అమ్ముకున్న నీచ చరిత్ర వైసీపీది అని మండిపడ్డారు. ‘‘ఏ సెక్టార్‌ను వదిలావు.. ఏ వ్యవస్థను వదిలావు’’.. జగన్ దోపిడీని ప్రజలు తెలుసుకోవాలన్నారు. 90 శాతం హామీలు అమలు చేశామని నిస్సిగ్గుగా చెబుతున్నారన్నారు. సిగ్గు లేకుండా మద్యం ఆదాయం కూడా కుదవ పెట్టి అప్పు తెచ్చుకున్న చరిత్ర జగన్‌ది అని అన్నారు. 2019 ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఏమిటి.. వాటిని అమలు చేయకుండా మోసం చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. 11సార్లు విద్యుత్ బిల్లులు పెంచి మూడు రెట్లు వసూళ్లు చేస్తున్నారన్నారు. ఉచిత ఇసుక పాలసీని మార్చి.. మధ్యతరగతి వారికి ఇసుక ప్రియం చేశారన్నారు. మద్యనిషేధం అన్న జగన్.. జె బ్రాండ్‌లు అమ్ముకుని కోట్లు కూడేసుకున్నారన్నారు. నాసిరకం మద్యం వల్ల లక్షలమంది రాష్ట్రంలో పేదలు చనిపోయారని తెలిపారు. డిస్లరీస్ అన్నీ కూడా వైసీపీ నేతల చేతుల్లోనే ఉందనేది వాస్తవం కాదా అని నిలదీశారు.

జగన్‌ సార్‌.. మానవత్వం ఏమైంది?


డిపాజిట్ రాకుండా వైసీపీని ఓడించాలి...

హైదరాబాద్‌లో పేమెంట్.. తాడేపల్లిలో లిక్కర్ ఇండెంట్ ఇదీ జగన్ నైజమంటూ విరుచుకుపడ్డారు. ఇటువంటి అవినీతి పరుడు, రక్తం రుచి మరిగిన పులి లాగా డబ్బు రుచి మరిగారన్నారు. తండ్రి హయాంలోనే అధికారం అండతో లక్ష కోట్లుదోచుకున్న వ్యక్తి జగన్ అని అన్నారు. ఒక్క ఛాన్స్ ఇస్తేనే ప్రజల జీవితాలు తలకిందులు అయిపోయాయన్నారు. డిపాజిట్ కూడా రాకుండా వైసీపీని ఓడించాల్సిన బాధ్యత ఏపీ ప్రజలపై ఉందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల సంక్షేమం కోసమే బీజేపీ, టీడీపీ జనసేనలు కలిశాయని వివరించారు. రాష్ట్రం హితం కోసం మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు కూటమిగా ఏర్పడ్డారని తెలిపారు.


ఓటమి భయంతోనే జగన్ నోటికొచ్చినట్లు వాగుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో సింగిల్ డిజిట్‌కే వైసీపీ పరిమితం కావడం ఖాయమని స్పష్టం చేశారు. జగన్ నీచత్వం గురించి చెల్లెళ్లే రోడ్డుమీదకు వచ్చి ఆవేదన చెందుతున్నారన్నారు. రౌడీయిజం, ఫ్యాక్షనిజంతో ఎల్లకాలం మోసం చేయలేవు జగన్ అంటూ వ్యాఖ్యలు చేశారు. రేపు ఎన్నికలలో ఎన్డీఏ కూటమి తప్పకుండా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్ అవినీతిపై విచారణ చేసి తప్పకుండా చర్యలు తీసుకుంటామని బోండా ఉమా స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

Rain Alert: రోళ్లు పగిలే ఎండలో చల్లటి కబురు.. హైదరాబాద్‌ వాసులు ఊపిరి పీల్చుకోండి

Puzzle: ఈ ఫొటోలోనే తప్పేంటో 10 సెకెన్లలో పట్టుకోండి.. మీ పరిశీలనా శక్తి ఏ రేంజ్‌లో ఉందో తెలుసుకోండి!

Read Latest AP News AND Telugu News

Updated Date - Apr 29 , 2024 | 11:28 AM

Advertising
Advertising