ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections 2024: మహిళలపై వైసీపీ నేతల అసభ్య ప్రచారం.. వివరణ ఇవ్వాలంటూ డీజీపీకి ఈసీ ఆదేశాలు

ABN, Publish Date - May 04 , 2024 | 11:35 AM

మహిళలపై అసభ్యకరమైన ప్రచారం చేస్తున్న వైసీపీ కార్యకర్తలపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో నివేదికను ఇవ్వాలంటూ ఏపీ డీజీపీకి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. వివరణ ఇవ్వాల్సిందిగా డీజీపీని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా ఆదేశించారు. టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణా రెడ్డి ఫిర్యాదుపై ఈసీ స్పందించింది.

అమరావతి: మహిళలపై అసభ్యకరమైన ప్రచారం చేస్తున్న వైసీపీ కార్యకర్తలపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో నివేదికను ఇవ్వాలంటూ ఏపీ డీజీపీకి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. వివరణ ఇవ్వాల్సిందిగా డీజీపీని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా ఆదేశించారు. టీడీపీ (TDP) అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణా రెడ్డి ఫిర్యాదుపై ఈసీ స్పందించింది. ఈ నెల 1వ తేదీన టీడీపీ మహిళా నేతలు పరుచూరి రమ్య , ఉండవల్లి అనుష, సందిరెడ్డి గాయత్రిలు.. ముకేష్ కుమార్ మీనాను కలిసి వైసీపీ సామాజిక మాధ్యమాల్లో తమపై జరుగుతున్న వికృత దాడిపై ఫిర్యాదు చేశారు.

AP Elections: సీఎం జగన్‌కు వైఎస్ షర్మిల మరో లేఖ


పోలీసులకు 18 సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఒక్క కేసులో కూడా చర్యలు చేపట్టలేదని మహిళ నేతలు పేర్కొన్నారు. ఫిర్యాదు రసీదులతో సహా మీనాకు మహిళా నేతలు అందించారు. తాజాగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చాక కూడా వైసీపీ ఆగడాలు తగ్గకపోగా పెరిగాయని.. ఫేక్ పేపర్ క్లిప్పింగ్స్‌లో అర్ధనగ్నంగా ఉండే ఫోటోలకు వారి ఫోటలను జత చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. సీఈఓను కలిసిన విషయాన్ని మహిళా నేతలు ట్విటర్ వేదికగా పెట్టిన ఫోటోను సైతం దర్శకుడు రాం గోపాల్ వర్మ ప్రతిపక్ష నాయకుల ఫోటోలతో మార్ఫింగ్ చేసి తన అధికారిక ట్విటర్ ఖాతాలో పెట్టడాన్ని టీడీపీ సీరియస్‌గా తీసుకుంది.

AP Pension: పెన్షన్‌ కోసం వెళ్లి వడదెబ్బ తగిలి పిట్టల్లారాలుతున్న వృద్ధులు


ఈ అంశంపై మరోసారి సీఈఓ మీనాకు టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణా రెడ్డి ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న సమయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ముందు దిగిన ఫోటోను సైతం మార్ఫింగ్ చేయడంపై ముకేష్ కుమార్ మీనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని నిన్న ఆనం చెప్పారు. ఈ మేరకు ఇవాళ ఉదయం డీజీపీని వివరణ ఇవ్వాలని సీఈఓ ముకేష్ కుమార్ మీనా ఆదేశించినట్లుగా సీఈఓ కార్యాలయం నుంచి లేఖ అందింది. ఈ విషయంపై సీఈఓ కార్యాలయం వేగంగా స్పందించడంపై ఆనం వెంకటరమణా రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి...

AP Elections: వారి ప్రాణాలు పోయినా జగన్‌‌కు రాజకీయ లబ్దే ముఖ్యం: గద్దె రామ్మోహన్

AP Election 2024: అయ్యో.. వివేకా!.. ‘మంచి పిల్లోడు’ అంటూ కితాబు

Read Latest AP News And Telugu News

Updated Date - May 04 , 2024 | 11:35 AM

Advertising
Advertising