Hair Oil: ఉల్లిపాయ నూనె లేదా వెల్లుల్లి నూనె.. జుట్టు మందంగా, ఒత్తుగా పెరగాలంటే ఏ నూనె మంచిదంటే..!
ABN , Publish Date - Sep 11 , 2024 | 11:24 AM
. జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా, అందంగా పెరగాలంటే ఉల్లిపాయ నూనె, వెల్లుల్లి నూనె రెండూ వాడుతుంటారు. రెండింటిలో ఏది బెస్ట్ అంటే..
జుట్టు మందంగా ఒత్తుగా పెరగాలని ప్రతి మహిళ కోరుకుంటుంది. అందుకోసం చాలా రకాల షాంపూలు, నూనెలు వాడుతుంటారు. జుట్టు పెరుగుదల కోసం ఈ మధ్య ఉల్లిపాయ వాడకం అధికం అయ్యింది. అదే విధంగా ఉల్లిపాయ నూనె, ఉల్లిపాయ షాంపూ, ఉల్లిపాయ జ్యూస్ తలకు పెడుతుంటారు. మరొకవైపు జుట్టు పెరుగుదల కోసం వెల్లుల్లి కూడా ఉపయోగిస్తుంటారు. జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా, అందంగా పెరగాలంటే ఉల్లిపాయ నూనె, వెల్లుల్లి నూనె రెండూ వాడుతుంటారు. రెండింటిలో ఏది బెస్ట్ అంటే..
హార్మోన్లను బ్యాలెన్స్ గా ఉంచే సూపర్ ఫుడ్స్ ఇవి..!
ఉల్లిపాయ నూనె..
ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ ఆరోగ్యకరమైన జుట్టు కణాల పెరుగుదలకు తోడ్పడే కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణ పెంచి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
వెల్లుల్లి నూనె..
వెల్లుల్లి నూనెలో కూడా సల్ఫర్ ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు అవసరమైన కొల్లాజెన్ ను ప్రోత్సహిస్తుంది. వెల్లుల్లిలో సెలీనియం, జింక్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి జుట్టును బలంగా ఆరోగ్యంగా ఉంచుతాయి. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే సమ్మేళనం రక్త ప్రసరణను మెరుగ్గా ఉంచి జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
ఖాళీ కడుపుతో అంజీర్ నీరు తాగితే ఏం జరుగుతుందంటే..!
రెండూ వాడితే..
జుట్టు పెరుగుదలకు ఉల్లిపాయ, వెల్లుల్లితో నూనె తయారుచేసి వాడవచ్చు. లేదంటే ఈ రెండింటిని కలిపి కూడా నూనె తయారుచేసుకుని వాడవచ్చు.
ఉల్లిపాయ, వెల్లుల్లి నుండి రసాన్ని తీయాలి. ఈ రసానికి కొబ్బరినూనె, ఆముదం వంటి క్యారియర్ నూనెలు మిక్స్ చేయాలి. దీన్ని అప్పటికప్పుడు తలకు పట్టించుకోవచ్చు. లేదంటే ఉల్లి వెల్లుల్లి రసాన్ని కొబ్బరినూనెలో కలిపి దాన్ని సన్నని మంట మీద రసం ఇగిరిపోయే వరకు వేడి చేయాలి. ఈ నూనెను గాజు సీసాలో నిల్వ చేసుకుని వారానికి ఒకటి లేదా రెండు సార్లు తలకు పెట్టుకుని అరగంట నుండి గంట సేపు ఆగి తలస్నానం చెయ్యాలి.
ఏడాదికి ఒకసారి ఈ 6 రకాల రక్త పరీక్షలు చేయించుకుంటే ఆరోగ్యం సేఫ్..!
సైడ్ ఎఫెక్ట్స్..
ఉల్లిపాయ, వెల్లుల్లి నూనె రెండూ జుట్టుకు అప్లై చేయడం సురక్షితమే.. అయితే సున్నితమైన తల చర్మం ఉన్నవారు ఈ నూనెను ఎక్కువ సేపు ఉంచకూడదు.
జుట్టుకు ఏది మంచిది?
ఉల్లిపాయ, వెల్లుల్లి నూనెలలో రెండూ వాటిలో ఉండే సల్ఫర్ కంటెంట్ కారణంగా జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడతాయి. అయితే వెల్లుల్లిలో సెలీనియం, జింక్ ఉంటాయి. ఇవి జుట్టు నాణ్యతను పెంచుతాయి. ఉల్లిపాయతో పోలిస్తే వెల్లుల్లిలో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఇవి కూాడా చదవండి..
Rose Water: రోజ్ వాటర్ ను ఇలా వాడి చూడండి.. డబుల్ బెనిఫిట్స్ పక్కా..!
Banana: రోజూ ఒక అరటిపండును నెల రోజులు వరుసగా తినండి.. ఈ వ్యాధులన్నీ మాయం..!
Health Tips: కాళ్లు చేతులలో జలదరింపు వస్తుందా? అసలు కారణం ఇదే..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.