Betting Apps: బెట్టింగ్స్ యాప్స్ వ్యవహారంలో కీలక పరిణామం..ఈడీ ఎంట్రీ..
ABN , Publish Date - Mar 18 , 2025 | 09:25 PM
బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈడీ రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. బెట్టింగ్ యాప్స్ సమస్యపై ఈడీ ఆరా తీసింది.

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారికి తెలంగాణ పోలీసు శాఖ చుక్కలు చూపిస్తోంది. ఎక్కడికక్కడ కేసులు నమోదు చేస్తోంది. దీంతో బెట్టింగ్ యాప్స్ గతంలో ప్రమోట్ చేసిన వారు.. ప్రస్తుతం చేస్తున్న వారు కంటి మీద కునుకు లేకుండా అల్లాడుతున్నారు. ఇప్పటికే 11 మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ సమస్య ఈడీ వరకు చేరింది. బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసిన యూట్యూబర్ల వ్యవహారంపై ఈడీ ఆరా తీసింది. బెట్టింగ్ యాప్స్ చెల్లింపుల వ్యవహారంపై విచారణ చేసింది. పోలీసులు నమోదు చేసిన కేసు వివరాలను సైతం తెప్పించుకుంది. మనీ లాండరింగ్, హవాలా రూపంలో చెల్లింపులు జరిగినట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది.
ఈడీ అధికారులు 11 మంది యూట్యూబర్ల సంపాదనపై ఆరా తీస్తున్నారు. ఈడీ ఎంట్రీతో సదరు బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్ల జీవితాలు మరింత దారుణ స్థితికి వెళ్లే అవకాశం ఉంది. మనీ లాండరింగ్, హవాలా కోణం బయటపడితే.. ఇక చిప్పకూడు తప్పదు. కాగా, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారిలో కేవలం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు మాత్రమే కాదు.. ఓ పోలీస్ కానిస్టేబుల్ కూడా ఉన్నాడు. హబీబ్‌నగర్ పీఎస్‌లో పనిచేస్తున్న కిరణ్ గౌడ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు. యూనిఫామ్ వేసుకుని మరీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు. అంతేకాదు.. టెలిగ్రామ్ ఛానల్‌లో బెట్టింగ్ యాప్స్ గురించి టిప్స్ కూడా ఇచ్చాడు. ఈ నేపథ్యంలో కిరణ్ గౌడ్‌పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
ఈ వార్తలు కూడా చదవండి
BRS MLC Kavitha: ఆ నివేదికను తక్షణమే బయటపెట్టాలి.. రేవంత్‌పై కవిత ప్రశ్నల వర్షం
Dana Nagender serious statement: నేను సీనియర్‌ను.. మీరు చెప్తే నేను వినాలా.. దానం ఫైర్
DCP Vijay Kumar: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఎవ్వరినీ వదలం: డీసీపీ స్ట్రాంగ్ వార్నింగ్..