Nara Lokesh: అశోక్ లేలాండ్ ప్లాంట్‌ను ప్రారంభించనున్న మంత్రి నారా లోకేష్
ABN , Publish Date - Mar 18 , 2025 | 09:47 PM
Nara Lokesh: విజయవాడ సమీపంలో అశోక్ లేలాండ్ ప్లాంట్‌ను ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించనున్నారు. మల్లవల్లి వద్ద గల ఇండస్ట్రియల్ పార్క్‌లో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్‌ను బుధవారం సాయంత్రం 5.00 గంటలకు మంత్రి నారా లోకేష్ చేతుల మీదగా ప్రారంభించనున్నారు.

అమరావతి, మార్చి 18: భారత ఆటోమొబైల్ రంగంలో రెండో అతిపెద్ద వాహన తయారీ సంస్థ అశోక్ లేలాండ్.. విజయవాడ సమీపంలో ప్లాంటును ఏర్పాటు చేయనుంది. మల్లవల్లి మోడల్ ఇండస్ట్రియల్ పార్క్‌లో ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంట్‌ను ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ బుధవారం ప్రారంభించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. తొలి విడతలో 600 మందికి, మలి విడతలో 1,200 మందికి ఈ సంస్థ ఉద్యోగావకాశాలు కల్పించనుంది. హిందూజా గ్రూప్ అనుబంధ సంస్థ అశోక్ లేలాండ్.. బస్సుల ఉత్పత్తిలోనే ప్రపంచంలో 4వ స్థానంలో ఉంది. ఇక ట్రక్కుల ఉత్పత్తిలో 13వ స్థానాన్ని ఆక్రమించింది.
అయితే ఇటీవల భారతదేశంలో 34వ ఉత్తమ బ్రాండ్‌గా ఈ సంస్థ ర్యాంక్ పొందింది. 75 వసంతాల చరిత్ర కలిగిన అశోక్ లేలాండ్ 50 దేశాలకు తమ వాహనాలను ఎగుమతి చేస్తోంది. ఇక విజయవాడ బెల్ట్‌లో ప్రారంభమవుతోన్న మొట్ట మొదటి ఆటోమొబైల్ ప్లాంటు ఇదే కావడం గమనార్హం. మల్లవల్లి పారిశ్రామికవాడలోని 75 ఎకరాల్లో విస్తరించిన ఈ ప్లాంటులో అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో వాహనాలను తయారు చేయనుంది. ఈ ప్లాంట్ లో 7మీటర్ల నుంచి 13.5 మీటర్ల వరకు BS VI మోడళ్ల బస్సులను ఉత్పత్తి చేయనున్నారు. అలాగే ఎలక్ట్రిక్ వాహనాల కోసం బాడీ బిల్డింగ్ ప్లాంట్ సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్లాంటు ఫేజ్-1,2లలో ఏడాదికి 2,400 బస్సుల ఉత్పత్తి సామర్థంతో పని చేస్తుందని ప్లాంట్ యాజమాన్యం స్పష్టం చేసింది.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదు. గత ప్రభుత్వం సంక్షేమంపై పెట్టిన శ్రద్ద.. రాష్ట్రాభివృద్ధిపై పెట్టలేదు. ఈ విషయాన్ని గ్రహించిన ఓటరు.. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి తన ఓటుతో పట్టం కట్టాడు. దీంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. అనంతరం రాజధాని అమరావతితోపాటు పోలవరం ప్రాజెక్ట్ పనులు వేగం పుంజుకున్నాయి. అలాగే రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు సైతం అడుగులు పడుతోన్నాయి.
ఇప్పటికే ఏపీలో తమ సంస్థల ఏర్పాటుకు వివిధ ప్రముఖ కంపెనీలు.. ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అదే విధంగా గత ప్రభుత్వ హయాంలో పెట్టబడులు పెట్టేందుకు నిరాకరించిన లూలూ లాంటి సంస్థలు సైతం ఏపీలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించాయి. అలాగే విభజనతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని.. దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం వడి వడిగా అడుగులు వేస్తుంది. అందులోభాగంగా వివిధ సంస్థలు రాష్ట్రంలో తమ పరిశ్రమలు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి.
ఇవి కూడా చదవండి...
Maharashtra Politics: మహారాష్ట్రలో వేడెక్కిన రాజకీయం
Aadhar Link With Voter ID: ఓటర్ ఐడీతో ఆధార్ అనుసంధానానికి గ్రీన్ సిగ్నల్
Ponzi Scam: పోంజీ స్కాం పేరుతో రూ. 870 కోట్లు లూటీ..
Virat Kohli: ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా విరాట్ కోహ్లీ ముందు 5 రికార్డులు.. బ్రేక్ చేస్తాడా..
New FASTag Rules: ఫాస్టాగ్ యూజర్లకు అలర్ట్.. ఇవి పాటించకుంటే ఫైన్..
BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్
For Andhrapradesh News And Telugu news