Share News

Kenya Cult: వీడు మనిషి కాదు మానవమృగం.. స్వర్గం చూపిస్తానని చెప్పి 191 మంది పిల్లలను..

ABN , Publish Date - Feb 07 , 2024 | 04:16 PM

ఒకవైపు ప్రపంచం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతుంటే.. మరోవైపు మూఢనమ్మకాలు కూడా అంతే ప్రబలుతున్నాయి. చాలామంది ప్రజలు ఇప్పటికీ ఈ నమ్మకాల్ని అనుసరిస్తూనే ఉన్నారు. అందుకే.. దొంగ బాబాల రాజ్యం ఇంకా నడుస్తూనే ఉంది. ఆకాశాన్ని చూపించి నేల నాకించేస్తున్నా.. జనాలు వాళ్లని ఇంకా గుడ్డిగానే నమ్ముతున్నారు.

Kenya Cult: వీడు మనిషి కాదు మానవమృగం.. స్వర్గం చూపిస్తానని చెప్పి 191 మంది పిల్లలను..

ఒకవైపు ప్రపంచం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతుంటే.. మరోవైపు మూఢనమ్మకాలు కూడా అంతే ప్రబలుతున్నాయి. చాలామంది ప్రజలు ఇప్పటికీ ఈ నమ్మకాల్ని అనుసరిస్తూనే ఉన్నారు. అందుకే.. దొంగ బాబాల రాజ్యం ఇంకా నడుస్తూనే ఉంది. ఆకాశాన్ని చూపించి నేల నాకించేస్తున్నా.. జనాలు వాళ్లని ఇంకా గుడ్డిగానే నమ్ముతున్నారు. ఇలా ఒక మత నాయకుడ్ని నమ్మి కొందరు తమతో పాటు పిల్లల ప్రాణాలు కోల్పోయారు. స్వర్గానికి వెళ్తారని అతడు చెప్పిన మాటలు నమ్మించి.. 191 పిల్లల్ని ఆకలితో చంపేశాడు. అంతేకాదు.. అతడు మరెన్నో నేరాలకు కూడా పాల్పడ్డాడు.

ఆ మత నాయకుడి పేరు పాల్ మెకెంజీ. కెన్యాలో కల్ట్ లీడర్‌గా ఎదిగిన అతడు.. తన 29 మంది సహచరులతో కలిసి 191 మంది పిల్లలను హతమార్చాడు. ఈ వ్యవహారం గతేడాదిలో వెలుగులోకి వచ్చింది. పిల్లలు చనిపోయేదాకా ఆకలితో అలమటించాలని తన అనుచరులకు పాల్ చెప్పాడని ప్రభుత్వ న్యాయవాదులు ఆరోపణలు చేశారు. అలా చనిపోతే.. ప్రపంచ వినాశనానికి ముందే స్వర్గానికి చేరుకుంటారని పాల్ వాదన. అతనికి ఉన్న ఈ మూఢనమ్మకాల పిచ్చి కారణంగా.. చాలామంది అనుచరులు బాధాకరమైన మరణాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఈ కేసులో పాల్‌తో పాటు 29 మంది అనుచరుల్ని మలిండి నగరంలోని కోర్టులో హాజరుపరిచారు. అయితే.. ఆ 30 మంది మాత్రం తాము ఏ తప్పూ చేయలేదని తమపై వచ్చిన ఆరోపణల్ని ఖండిస్తున్నారు.


చర్చి వద్ద 400 మృతదేహాలు

కెన్యాలోని షాకహోలా అడవుల్లో పాల్ మెకెంజీ ‘గుడ్ న్యూస్ ఇంటర్నేషనల్’ పేరుతో ఒక చర్చిని నడుపుతున్నాడు. పూర్తిగా ఒంటరిగా, ఎడారిగా ఉన్న ఈ ప్రాంతంలో ఆ చర్చి మొత్తం 800 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడే పాల్ అనుచరులు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. తమకంటూ ఒక ప్రత్యేకమైన కాలనీకి ఏర్పాటు చేసుకున్నారు. ఈ కాలనీలో క్రమంగా వ్యక్తుల సంఖ్య తగ్గుతూ వస్తుండటంతో.. అనుమానాలు వచ్చాయి. కొంతకాలం తర్వాత ఇక్కడ తవ్వకాలు నిర్వహిస్తే.. ఏకంగా 400 మృతదేహాలు బయటపడ్డాయి. వీటిల్లో 191 మృతదేహాలు చిన్నారువలని తేలింది. ఈ భయంకరమైన దృశ్యం బయటపడ్డాక పాల్‌తో పాటు అతని అనుచరుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆకలితో వాళ్లంతా మరణించారని విచారణలో వెల్లడైంది.

పాల్ మెకెంజీపై ఇతర కేసులు

కేవలం ఇదొక్క వ్యవహారమే కాదు.. తీవ్రవాదం, హత్య, హింసకు సంబంధించిన అనేక తీవ్రమైన ఆరోపణలను సైతం పాల్ మెకెంజీ ఎదుర్కుంటున్నాడు. గతేడాది డిసెంబర్‌లో లైసెన్స్ లేకుండా సినిమాలు తీసి, వాటిని పంపిణీ చేసిన కేసులోనూ అతడు 12 నెలల జైలు శిక్ష అనుభవించాడు. మెకెంజీ అనుచరులు అతని మాటల్ని గుడ్డిగా నమ్మకం వల్లే.. ఎందరో బాధాకరమైన పరిస్థితుల్ని చవిచూడాల్సి వచ్చింది. ఆసుపత్రులు, పాఠశాలలను దెయ్యాల అస్థిత్వాలని నమ్మేవాడు. అందుకే.. తమ పిల్లలు అనారోగ్యం పాలైనప్పుడు ఆస్పత్రికి తీసుకెళ్లేవారు కాదు. పాల్ మెకెంజీ నయం చేస్తాడని, అతని వద్దకే వెళ్లేవారు. అలా.. పిల్లలు ఆకలితో చస్తే.. స్వర్గానికి వెళ్తారని నమ్మించి వారిని హతమర్చాడు.

Updated Date - Feb 07 , 2024 | 04:54 PM