Share News

Canada: నేను చేసిన తప్పు మీరు చేయొద్దు.. కెనడాలో భారతీయ విద్యార్థి విచారం

ABN , Publish Date - Mar 19 , 2025 | 02:53 PM

తనలా కెనడాకు వచ్చి మోసపోవద్దంటూ ఓ అజ్ఞాత భారతీయ విద్యార్థి రెడిట్‌లో పంచుకున్న వార్త ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారింది. దీనిపై భారత్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Canada: నేను చేసిన తప్పు మీరు చేయొద్దు.. కెనడాలో భారతీయ విద్యార్థి విచారం
Indian Student Regrets Moving to Canada

ఇంటర్నెట్ డెస్క్: కలల ప్రపంచం ఊహించుకొని కెనడా రావడం తన చేసిన అతి పెద్ద పొరపాటు అంటూ ఓ భారతీయ విద్యార్థి రెడిట్‌లో పెట్టిన పోస్టు తెగ వైరల్ అవుతోంది. తన పేరు బహిర్గతం చేయకుండా అతడు పెట్టిన పోస్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కెనడా ప్రభుత్వం, కాలేజీలు తమ లాభాపేక్ష కోసం భారతీయ విద్యార్థులను వాడుకుంటున్నాయని సదరు విద్యా్ర్థి వాపోయారు. చాలా మంది తక్కువ నాణ్యత విద్యనందించే చోటామాటో కెనడా కాలేజీల్లో భారీ ఫీజులకు చేరి మోసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అలాంటి చోట్ల ప్రొఫెసర్లకు చదువు చెప్పాలన్న ధ్యాసే ఉండదని, కాలం చెల్లిన సిలబస్ ఉంటుందని అన్నారు. ఆ డిగ్రీలు జాబ్ తెచ్చుకునేందుకు అస్సలు పనికి రావని అన్నాడు. మీ చదువులను కంపెనీలు సీరియస్‌గా తీసుకోవని హెచ్చరించారు. తన పోస్టులో బో వ్యాలీ కాలేజీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇది అత్యంత నాసిరకం కళాశాల అని వాపోయారు. ఇక్కడ చదివేవారు రోజువారీ ఖర్చుల కోసం ఊబెర్‌లు, గోదాముల్లో పనిచేస్తున్నారని తెలిపారు.


Also Read: భారత సంతతి విద్యార్థిని అదృశ్యమైన ఘటనలో కీలక మలుపు.. తల్లిదండ్రుల అభ్యర్థన ఏంటంటే..

ఇక్కడకొచ్చే అంతర్జాతీయ విద్యార్థులకు భారీ జీవన వ్యవయాలు ఊహించని షాకిస్తాయని హెచ్చరించారు. ఇళ్ల అద్దెలు మొదలు పచారీ సమాన్ల వరకూ అన్నీ ఊహించిన దానికంటే ఎక్కువగానే ఉంటాయని అన్నారు. చివరకు చాలా మంది అంతర్జాతీయ విద్యార్థులు అత్యల్ప జీతాలతో సుదీర్ఘసమయం పాటు పని చేస్తుంటారని అన్నారు. జీతం పెంచాలన్న వారిని సంస్థలు తొలగిస్తుంటాయని చెప్పారు.

ఉన్నత చదువుల కోసం భారత్‌ను వీడాలనుకుంటున్న వారు ఒక్కసారి పునరాలోచించుకోవాలని సూచించారు. భారత్‌లో అభివృద్ధి చెందుతోందనే అక్కడ అనేక అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు.


Also Read: భారత సంతతి అమెరికా విద్యార్థిని అదృశ్యం.. రంగంలోకి ఇంటర్‌పోల్

కెనడ వాసులు విదేశీయులతో మర్యాదగానే వ్యవహరించినా అంతగా కలుపుగోలుగా ఉండరని అన్నాడు. ఒంటిరి తనం, డిప్రెషన్ వేధిస్తాయని చెప్పాడు. అనేక మంది విద్యార్థులు మౌనంగానే ఇలాంటి మానసిక వేదనను అనుభవిస్తారని అన్నారు. పాశ్చాత్య దేశాలు ఓ ఊహాప్రపంచాన్ని చూపించి విద్యార్థులను ఆకర్షిస్తున్నాయని, వాటిని చూసి మోసపోవద్దని అన్నారు.

ఈ అభిప్రాయంతో కొందరు విభేదించారు. మంచిచెడులు వాకబు చేయకుండా చిన్నా చితకా కాలేజీల్లో చేరితే చివరకు అప్పులు తప్ప ఏమీ మిగలవని అన్నారు. కెనడాలో చదువుకున్నాక స్థిరపడి హ్యాపీ లైఫ్ గడుపుతున్న వారు ఎందరో ఉన్నారని తెలిపారు.

Also Read: గ్రీన్‌కార్డుదారులపైనా పెరుగుతున్న తనిఖీలు.. ఎన్నారైల్లో మొదలైన గుబులు

మరిన్ని ఎన్నారై వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 19 , 2025 | 02:53 PM