Fire Accident: థాయ్ ల్యాండ్‌లో ఘోర ప్రమాదం.. సుమారు 25మంది మృతి..
ABN, Publish Date - Oct 01 , 2024 | 03:14 PM
థ్యాయ్ ల్యాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సెంట్రల్ ఉతాయ్ థాని ప్రావిన్స్ నుంచి విహార యాత్రకు వెళ్లివస్తున్న పాఠశాల బస్సులో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగి 25మంది చనిపోయినట్లు స్థానిక అధికారులు భావిస్తున్నారు.
బ్యాంకాక్: థ్యాయ్‌ల్యాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సెంట్రల్ ఉతాయ్ థాని ప్రావిన్స్ నుంచి విహారయాత్రకు వెళ్లివస్తున్న పాఠశాల బస్సులో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగి 25మంది చనిపోయినట్లు స్థానిక అధికారులు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 44మంది ఉన్నట్లు తెలుస్తోంది. రక్షణ చర్యలు చేపట్టిన అధికారులు ఇప్పటివరకూ 16మంది విద్యార్థులను, ముగ్గురు టీచర్లను కాపాడారు. మిగిలిన వారి కోసం ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఘటనపై థాయ్‌ల్యాండ్ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ ఘోర ప్రమాదంపై థాయ్‌ల్యాండ్ ఇటీరియర్ మంత్రి అనుతిన్ చర్నవిరకుల్ స్పందించారు. పాఠశాల బస్సులో 38మంది విద్యార్థులు, ఆరుగురు టీచర్లు మెుత్తం 44మంది ప్రయాణిస్తున్నారని మంత్రి తెలిపారు. వీరంతా బ్యాంకాక్ నుంచి సెంట్రల్ ఉతాయ్ థాని ప్రావిన్స్‌కు విహారయాత్ర నిమిత్తం వెళ్లారని ఆయన తెలిపారు. తిరిగి వస్తున్న క్రమంలో బ్యాంకాక్ నగరంలో ప్రమాదవశాత్తూ బస్సుకు మంటలు అంటుకున్నాయని వెల్లడించారు. అయితే ఇప్పటివరకూ స్థానిక అధికారులు 16మంది విద్యార్థులను, ముగ్గురు టీచర్లను కాపాడారని మంత్రి తెలిపారు. మిగిలిన వారిపై ఇంకా స్పష్టత రాలేదన్నారు. మృతుల సంఖ్యను ఇంకా ధృవీకరించాల్సి ఉందని చెప్పారు. ప్రమాద స్థలంలో దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని ఆయన తెలిపారు. ప్రమాదం నుంచి బయటపడిన వారిచ్చిన సమాచారం ప్రకారం 25మంది మృతిచెందినట్లు తెలుస్తోందని ఆయన వెల్లడించారు. మృతదేహాలు ఇంకా బస్సులోనే ఉన్నట్లు అనుతిన్ చర్నవిరకుల్ పేర్కొన్నారు.
అయితే ప్రమాదానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీడియోల్లో బస్సు తగలబడుతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దట్టమైన పొగ, భారీగా మంటలు ఎగసిపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదానికి గురైన విద్యార్థుల వయసు ఇంకా తెలియరాలేదు. మరోవైపు బస్సు టైరు పేలిపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Haryana Assembly Elections: మాజీ డిప్యూటీ సీఎం కాన్వాయ్‌పై దాడి
Kerala Express: విరిగిన పట్టాలపై దూసుకెళ్లిన రైలు.. తప్పిన భారీ ప్రమాదం
Updated Date - Oct 01 , 2024 | 03:39 PM