Wall Collapsed: గోడ కూలి 9 మంది చిన్నారులు మృతి, ఇద్దరికి గాయాలు
ABN , Publish Date - Aug 04 , 2024 | 02:17 PM
విద్యార్థులు శివలింగాన్ని తయారు చేయడానికి ఓ ప్రాంగణానికి చేరుకున్నారు. ఆ క్రమంలోనే భారీ వర్షాలకు ఓ ఇంటి గోడ కూలిపోయి(wall collapsed) పెను ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 9 మంది చిన్నారులు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
శివలింగాన్ని తయారు చేయడానికి షాపురా ప్రాంతంలోని హర్దోయ్ శివాలయం వద్ద పెద్ద సంఖ్యలో పాఠశాల విద్యార్థులు గుమిగూడారు. అక్కడ సావన్ మాసంలో శివుని ఆరాధనతో పాటు భగవత్ కథ కూడా నిర్వహిస్తారు. విద్యార్థులు శివలింగాన్ని తయారు చేస్తున్న ఆలయ ప్రాంగణానికి సమీపంలోనే మల్లు కుష్వాహ అనే వ్యక్తికి పురాతనమైన ఇల్లు ఉంది. ఆ క్రమంలోనే భారీ వర్షాలకు 50 ఏళ్ల నాటి ఇంటి గోడ ఆకస్మాత్తుగా కూలిపోయి(wall collapsed) పెను ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 9 మంది చిన్నారులు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని సాగర్(Sagar)లో చోటుచేసుకుంది. మరణించిన వారిలో 10 నుంచి 14 ఏళ్లలోపు చిన్నారులు ఉన్నారు.
రూ.2 లక్షల సాయం
సమాచారం అందుకున్న పోలీసులు(police) ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన చిన్నారులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఈ ఘటనపై విషయం తెలుసుకున్న మాజీ మంత్రి గోపాల్ భార్గవ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు. ఈ ఘటనపై సంతాపం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ బాధితుల కుటుంబానికి ఒక్కొక్కరికి రూ.2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.
పిల్లల పరిస్థితి
ఆదివారం కావడంతో సాగర్‌లోని పాఠశాలలకు(schools) సెలవు. దీంతో శివలింగాన్ని తయారు చేసేందుకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ ఘటనలో మరణించిన చిన్నారుల్లో దివ్యాన్ష్, వంశ్, నితేష్, ధ్రువ్, దివ్యరాజ్, సుమిత్ ప్రజాపతి, ఖుషి, పర్వ్ విశ్వకర్మ అనే అమాయక చిన్నారులు ఉన్నారు. అదే సమయంలో గాయపడిన వారిలో కొంతమంది పిల్లల పరిస్థితి విషమంగా ఉందని, వారికి చికిత్స కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.
మరో ఘటనలో
మరో ఘటనలో ఓ జీప్ ట్రక్కును ఢీకొనడంతో(accident) ఇద్దరు మహిళా కార్మికులు మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు. జిల్లా కేంద్రానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న సియోని బాలాఘాట్ రోడ్డు సమీపంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. కూలీలు ఉమర్వాడ నుంచి ధర్నాకలా గ్రామంలో వరిపంట పనులకు వెళ్లి ఇళ్లకు తిరిగి వస్తుండగా ట్రక్కును వారి జీపు ఢీకొట్టింది. వరుస ప్రమాదాల నేపథ్యంలో ఆ ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
Also Read:
Business Idea: పెట్టుబడి లేకుండా వ్యాపారం.. ఏటా 50 లక్షలకుపైగా సంపాదించే ఛాన్స్!
Top 8 Floods India: దేశాన్ని కుదిపేసిన 8 ప్రధాన వరద సంఘటనలు..10 వేల మంది మృతి!
For Latest News and National News Click Here