Share News

Amit Shah: సీఏఏ అంశంపై మమత, స్టాలిన్, ఒవైసీలపై అమిత్ షా ఫైర్.. ఏ వర్గానికి భయపడేది లేదని వెల్లడి

ABN , Publish Date - Mar 14 , 2024 | 10:56 AM

దేశంలో ఇటివల పౌరసత్వ సవరణ చట్టం(CAA) అమలు అంశాన్ని ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించడం మొదలుపెట్టాయి. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఈ అంశంపై స్పందించి ప్రతిపక్షాలపై మండిపడ్డారు.

Amit Shah: సీఏఏ అంశంపై మమత, స్టాలిన్, ఒవైసీలపై అమిత్ షా ఫైర్.. ఏ వర్గానికి భయపడేది లేదని వెల్లడి

దేశంలో ఇటివల పౌరసత్వ సవరణ చట్టం(CAA) అమలు అంశాన్ని ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించడం మొదలుపెట్టాయి. ప్రధానంగా పశ్చిమ బెంగాల్(bengal), కేరళ(kerala), తమిళనాడు(tamilnadu) రాష్ట్రాల్లో ఈ చట్టాన్ని అమలు చేసేందుకు అనుమతించబోమని ఆ రాష్ట్రాల సీఎంలు ప్రకటించారు. ఈ అంశంపై తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా స్పందించారు. దీని అమలును తిరస్కరించే హక్కు మీకు ఉందా అని హోం మంత్రి షా ప్రశ్నించారు.

మన రాజ్యాంగంలో పౌరసత్వానికి సంబంధించిన చట్టాలను రూపొందించే హక్కు పార్లమెంటుకు మాత్రమే ఉందన్నారు. చట్టం, దానిని అమలు చేసే అధికారం కేంద్రానిదే తప్ప రాష్ట్రాలకు లేదని అన్నారు. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 11 పౌరసత్వానికి సంబంధించిన నిబంధనలను రూపొందించడానికి పార్లమెంటు(parliament))కు అన్ని అధికారాలను ఇస్తుంది. ఎన్నికల తర్వాత అందరూ సహకరిస్తారని భావిస్తున్నానని చెప్పారు.


మైనార్టీల ఓట్ల కోసం

కేంద్రం CAAని అమలు చేసిన వెంటనే తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్(stalin), పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata banerjee), కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్(pinarayi vijayan) ఈ చట్టాన్ని విమర్శించారు. తమ రాష్ట్రాల్లో దీనిని అమలు చేయబోమని చెప్పారు. ఈ క్రమంలోనే సీఏఏపై తన వైఖరిని స్పష్టం చేయాలని అమిత్ షా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే(uddhav thackeray)కు సవాల్ విసిరారు. సీఏఏను అమలు చేయాలా వద్దా అనే విషయాన్ని స్పష్టం చేయాలని ఉద్ధవ్ ఠాక్రేని కోరుతున్నట్లు చెప్పారు. మైనార్టీల ఓట్ల కోసం అనేక మంది బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో అసదుద్దీన్ ఒవైసీ(asaduddin owaisi), రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ సహా ప్రతిపక్షాలన్నీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. అసలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో వివరణ ఇవ్వాలని అమిత్ షా అన్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Fire Accident: నాలుగు అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం..ఊపిరాడక నలుగురు మృతి


భయపడాల్సిన అవసరం లేదు

2019లో బీజేపీ(BJP) మేనిఫెస్టోలో సీఏఏ తీసుకొచ్చి ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ శరణార్థులకు పౌరసత్వం ఇస్తామని చెప్పింది. 2019లో దీనిని ఉభయ సభలు ఆమోదించాయి. కానీ కోవిడ్(covid) కారణంగా ఆలస్యమైందన్నారు. అంతేకాదు సీఏఏలో ఎవరి పౌరసత్వాన్ని తొలగించే నిబంధన లేదని, ఏ వర్గానికి లేదా ఏ వ్యక్తికి భయపడాల్సిన అవసరం లేదని హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.

ఇది రద్దు చేయడం అసాధ్యం

పౌరసత్వ సవరణ బిల్లును డిసెంబర్ 11, 2019న పార్లమెంట్ ఆమోదించింది. ఈ బిల్లుకు ఒక్కరోజులోనే రాష్ట్రపతి ఆమోదం లభించింది. CAA ద్వారా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి హిందూ, సిక్కు, జైన్, బౌద్ధ, పార్సీ, క్రైస్తవ వర్గాలకు చెందిన మైనారిటీలు భారత పౌరసత్వం పొందడం సులభం అవుతుంది. అలాంటి మైనారిటీలు డిసెంబర్ 31, 2014 లేదా అంతకు ముందు భారతదేశంలోకి ప్రవేశించారు. సీఏఏను మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిందని అన్నారు. దాన్ని రద్దు చేయడం సాధ్యం కాదన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి వచ్చి సహకరిస్తామని అమిత్ షా(Amit Shah) ఉద్ఘాటించారు.

Updated Date - Mar 14 , 2024 | 11:12 AM