2026 నాటికి నక్సలిజం అంతం: అమిత్ షా
ABN, Publish Date - Aug 25 , 2024 | 04:29 AM
ప్రజాస్వామ్య వ్యవస్థకు నక్సలిజం అతి పెద్ద సవాలని, నక్సలిజంపై అంతిమ దాడికి సమయం ఆసన్నమైందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు.
రాయ్‌పూర్/హైదరాబాద్, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్య వ్యవస్థకు నక్సలిజం అతి పెద్ద సవాలని, నక్సలిజంపై అంతిమ దాడికి సమయం ఆసన్నమైందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు.
2026 నాటికి నక్సలిజం అంతమవుతుందని తేల్చిచెప్పారు. శనివారం ఆయన తెలంగాణ, ఏపీ, ఛత్తీ్‌సగఢ్ సహా.. ఏడు నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, ఇతర ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన ‘అంతర్రాష్ట్ర సమన్వయ కమిటీ’ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గడిచిన 4 దశాబ్దాల్లో నక్సలిజం కారణంగా 17వేల మంది ప్రాణాలను కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు.
2014లో మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటయ్యాక.. తాము వామపక్ష తీవ్రవాదాన్ని సవాలుగా తీసుకుని, దానిపై దృష్టి సారించామని గుర్తుచేశారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 147 మంది నక్సలైట్లు హతమయ్యారని, 723 మంది నక్సల్స్‌ను అరెస్టు చేశామని.. రానున్న మూడేళ్లలో ఛత్తీ్‌సగఢ్ నక్సల్స్ రహిత రాష్ట్రంగా మారుతుందని స్పష్టం చేశారు.
Updated Date - Aug 25 , 2024 | 04:29 AM