ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kejriwal: ఢిల్లీ హైకోర్టుకు అరవింద్ కేజ్రీవాల్.. వెంటనే విచారించాలని రిక్వెస్ట్

ABN, Publish Date - Mar 23 , 2024 | 06:20 PM

లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ఈడీ విధించిన రిమాండ్‌ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. రిమాండ్ పిటిషన్‌ను ఆదివారం లోపు విచారించాలని కోరారు. లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఢిల్లీ: లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) హైకోర్టును ఆశ్రయించారు. తనకు ఈడీ విధించిన రిమాండ్‌ను సవాల్ చేస్తూ హైకోర్టులో (High Court) పిటిషన్ వేశారు. రిమాండ్ పిటిషన్‌ను ఆదివారం లోపు విచారించాలని కోరారు. లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్‌ను (Kejriwal) ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కేజ్రీ అరెస్ట్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేతలు తీవ్రంగా ఖండించారు. ఇది ముమ్మాటికీ కక్షసాధింపు చర్య అని అభివర్ణించాయి.

లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ అధికారులు వరసగా సమన్లు జారీచేశారు. 9 సార్లు సమన్లను దాటవేశారు. విచారణ నుంచి స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించడంతో గురువారం రాత్రి కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు. శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్‌‌ను 6 రోజుల ఈడీ రిమాండ్‌కు ఇచ్చింది. తన అరెస్ట్, రిమాండ్ అక్రమం అని కేజ్రీవాల్ అంటున్నారు. తనను వెంటనే విడుదల చేయాలని పిటిషన్‌లో కేజ్రీవాల్ కోరారు.

లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్ ముఖ్య కుట్రదారు అని ఈడీ రిమాండ్ పిటిషన్‌లో పేర్కొంది. కేజ్రీవాల్ మనీష్ సిసొడియా, కల్వకుంట్ల కవితతో సంప్రదింపులు జరిపారని ఆరోపించింది. ఢిల్లీలో న్యూ లిక్కర్ పాలసీ రూపకల్పనలో ముఖ్యమంత్రి ప్రమేయం ఉందని పేర్కొంది. లిక్కర్ స్కామ్‌తో తనకేం సంబంధం లేదని అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 23 , 2024 | 06:20 PM

Advertising
Advertising