Share News

BJP: కోర్ గ్రూప్ భేటీల్లో ఏపీలో పొత్తులపై బీజేపీ ప్రస్తావన

ABN , Publish Date - Mar 07 , 2024 | 09:18 AM

న్యూఢిల్లీ: బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌లో అర్థరాత్రి దాటేవరకు సమావేశాలు నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల కోర్ గ్రూప్ నేతలతో భేటీలు జరిపింది. ఆయా రాష్ట్రాల్లో అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘ చర్చలు జరిపింది. ఏపీలో పొత్తులు, స్థానాలపై చర్చలు జరిపింది. చర్చలు పూర్తికాకపోవడంతో గురువారం మళ్లీ బీజేపీ సమావేశం జరగనుంది.

BJP: కోర్ గ్రూప్ భేటీల్లో  ఏపీలో పొత్తులపై బీజేపీ ప్రస్తావన

న్యూఢిల్లీ: బీజేపీ (BJP) హెడ్‌క్వార్టర్స్‌లో (Head Quarters) అర్థరాత్రి దాటేవరకు సమావేశాలు నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సహా వివిధ రాష్ట్రాల కోర్ గ్రూప్ నేతలతో (Core Group Leaders) భేటీలు జరిపింది. ఆయా రాష్ట్రాల్లో అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘ చర్చలు జరిపింది. ఏపీలో పొత్తులు, స్థానాలపై చర్చలు జరిపింది. చర్చలు పూర్తికాకపోవడంతో గురువారం మళ్లీ బీజేపీ సమావేశం జరగనుంది.

కోర్ గ్రూప్ భేటీల్లో ఏపీలో పొత్తులపై ప్రస్తావన..

కోర్ గ్రూప్ భేటీల్లో ఏపీలో పొత్తులపై బీజేపీ నేతలు ప్రస్తావించారు. 2వ జాబితాను దాదాపు 150 మంది అభ్యర్థులతో విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే తొలి జాబితాలో తెలంగాణ సహా మొత్తం 195 మంది అభ్యర్థుల పేర్లు బీజేపీ అధిష్టానం విడుదల చేసిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌లోని మిగిలిన 8 స్థానాలపై జరిగిన చర్చ జరిగింది. హర్యానాలోని మొత్తం 10 స్థానాల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తోంది. మహారాష్ట్ర కోర్ గ్రూప్ భేటీలో బీజేపీ పోటీ చేసే సీట్లపై చర్చించారు. ఉత్తర ముంబై స్థానం నుంచి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ బరిలోకిదిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఒడిశాలో సంభల్‌పూర్ నుంచి ధర్మేంద్ర ప్రధాన్, పూరీ నుంచి సంబిత్ పాత్రను ఎంపిక చేసే అవకాశముంది. తమిళనాడులో కన్యాకుమారి నుంచి మహిళా మోర్చా అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్‌ను దించే అవకాశం కనిపిస్తోంది. కర్ణాటకలో దాదాపు 12 సీట్లలో సిట్టింగ్‌లను మార్చనున్నట్టు తెలియవచ్చింది.

Updated Date - Mar 07 , 2024 | 09:19 AM