Budget 2024: కేంద్ర ఆర్థిక మంత్రిగా సరికొత్త రికార్డ్ నెలకొల్పనున్న నిర్మలా సీతారామన్..
ABN, Publish Date - Jul 05 , 2024 | 05:02 PM
Union Budget 2024: జూన్ 24వ తేదీన 18వ లోక్‌సభ మొదటి సెషన్ ప్రారంభం కాగా.. జూన్ 26న బీజేపీ ఎంపీ ఓం బిర్లా రెండోసారి లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సైతం త్వరలోనే ప్రారంభం కానున్నాయి.
Union Budget 2024: జూన్ 24వ తేదీన 18వ లోక్‌సభ మొదటి సెషన్ ప్రారంభం కాగా.. జూన్ 26న బీజేపీ ఎంపీ ఓం బిర్లా రెండోసారి లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సైతం త్వరలోనే ప్రారంభం కానున్నాయి. జులై 22వ తేదీ నుంచి ఆగస్టు 9వ తేదీ వరకు వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయనే విశ్వసనీయ సమాచారం. ఈ సెషన్‌లోనే పూర్తిస్థాయి బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టనున్నారు.
Also Read: మళ్లీ సార్వత్రిక ఎన్నికలు.. సిద్దంకండి
లోక్‌సభ ఎన్నికల కారణంగా 2024లో రెండుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సి వస్తోంది. ఫిబ్రవరి 1వ తేదీన మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం.. జులై ద్వితీయార్థంలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఇక బీజేపీ నాయకురాలు నిర్మలా సీతారామన్.. ఆర్థిక మంత్రిగా మరోసారి నియామకం అయ్యారు. జులైలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ సమర్పించనున్నారు.
Also Read: అన్నంలో పాము.. ఆ తరువాత ఏం జరిగిందంటే..
నిర్మలా సీతారామన్ రికార్డ్..
కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ సరికొత్త రికార్డ్ నెలకొల్పనున్నారు. వరుసగా రెండోసారి ఆర్థిక మంత్రిగా ఎన్నికైన ఆమె.. 2024-25 బడ్జెట్‌ను సమర్పించనున్నారు. అయితే, వరుసగా ఆరుసార్లు బడ్జెట్‌లను సమర్పించిన మాజీ ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్‌ని అధిగమించనున్నారు. మొరార్జీ దేశాయ్ వరుసగా ఆరుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈసారి కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెడితే.. వరుసగా ఏడు కేంద్ర బడ్జెట్‌లను సమర్పించిన ఆర్థిక మంత్రి ఆమె సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తారు.
Also Read: ఆ ఇద్దరు మహిళలకు నా అభినందనలు..
కేంద్ర బడ్జెట్ 2024 ఎప్పుడు ప్రవేశపెడతారు?
ఎన్డీయే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బడ్జెట్‌ను ప్రతి ఏటా ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్‌లో ప్రవేశపెడుతోంది. ఈ సంవత్సరం సార్వత్రిక ఎన్నికలు జరిగిన నేపథ్యంలో.. గత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఫిబ్రవరి 1వ తేదీన మధ్యంతర బడ్జెట్‌ను ప్రశేపెట్టారు నిర్మలా సీతారామన్. ఈసారి కూడా కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటవడం, కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ నియామకం అవడంతో పూర్తిస్థాయి బడ్జెట్‌ను సైతం ఆమెను ప్రవేశపెట్టనున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. జులై 24వ తేదీన ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక సర్వేను జులై 23వ తేదీన ప్రకటించనున్నారు. అయితే, ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. మొత్తంగా జులై 22 నుంచి ఆగస్టు 9వ తేదీ వరకు జరగనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే బడ్జెట్‌ను ప్రవేశపెడతారని అధికార వర్గాలు చెబుతున్నాయి.
For More National News and Telugu News..
Updated Date - Jul 05 , 2024 | 05:02 PM