AAP: కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయొచ్చు.. అతని ఆలోచనలను కాదు: ఆప్ నేతలు
ABN, Publish Date - Mar 21 , 2024 | 09:30 PM
లిక్కర్ స్కామ్‌లో ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. కొత్తగా రూపొందించిన ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు జరిగాయని ఈడీ అధికారులు చెబుతున్నారు. కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయడాన్ని ఆప్ నేతలు ముక్తకంఠంతో ఖండించారు.
ఢిల్లీ: లిక్కర్ స్కామ్‌లో ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ( Arvind Kejriwal) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు అరెస్ట్ చేశారు. కొత్తగా రూపొందించిన ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు జరిగాయని ఈడీ అధికారులు చెబుతున్నారు. కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయడాన్ని ఆప్ నేతలు ముక్తకంఠంతో ఖండించారు.
‘అరవింద్ కేజ్రీవాల్ అంటే ప్రజలకు ప్రేమ, అభిమానం. ఏవో సాకు చూపి, కారణాలు చూపి కేజ్రీవాల్ అరెస్ట్ చేయొచ్చు.. కానీ అతని ఆలోచనలను అరెస్ట్ చేయలేరు. కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేస్తే వీధిలో మరో కేజ్రీవాల్ పుట్టుకొస్తారు. సోదాల పేరుతో ఈడీ అధికారులు కేజ్రీవాల్ ఫోన్ తీసుకున్నారు. కేజ్రీవాల్ సెక్రటరీ మొబైల్ కూడా తీసుకున్నారు. కేజ్రీవాల్ అరెస్ట్‌తో బీజేపీ పన్నాగం బయటపడింది అని’ ఆప్ నేతలు సౌరభ్ భరద్వాజ్, అతిషి అన్నారు. లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటికీ ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని అతిషి స్పష్టం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Mar 21 , 2024 | 09:30 PM