Share News

Chennai: వాతావరణ మార్పులు.. ప్రబలుతున్న ‘మద్రాసు ఐ’

ABN , Publish Date - Nov 06 , 2024 | 10:48 AM

వాతావరణ మార్పుల కారణంగా నగరంలో ‘మద్రాసు ఐ’('Madras Eye') ప్రబలుతోంది. గత నెల చివరి వారం నుంచే ఈ వ్యాధి వ్యాప్తిచెందుతోందని, బాధితులు వైద్యులను సంప్రదించి మందులు వాడాలని ఆరోగ్యశాఖ సూచిస్తోంది. కంటి వాపు, ఎర్రబడడం, కంటి నుంచి నీరు కారడం వంటివి మద్రాసు ఐ లక్షణాలు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో కండ్ల కలక కేసులు అధికమవుతుంటాయి.

Chennai: వాతావరణ మార్పులు.. ప్రబలుతున్న ‘మద్రాసు ఐ’

చెన్నై: వాతావరణ మార్పుల కారణంగా నగరంలో ‘మద్రాసు ఐ’('Madras Eye') ప్రబలుతోంది. గత నెల చివరి వారం నుంచే ఈ వ్యాధి వ్యాప్తిచెందుతోందని, బాధితులు వైద్యులను సంప్రదించి మందులు వాడాలని ఆరోగ్యశాఖ సూచిస్తోంది. కంటి వాపు, ఎర్రబడడం, కంటి నుంచి నీరు కారడం వంటివి మద్రాసు ఐ లక్షణాలు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో కండ్ల కలక కేసులు అధికమవుతుంటాయి. ప్రస్తుతం నగరంలో కురుస్తున్న వర్షాల కారణంగా కండ్ల కలక వ్యాధి వ్యాప్తిస్తోంది.

ఈ వార్తను కూడా చదవండి: మహారాష్ట్ర నూతన డీజీపీగా సంజయ్‌ వర్మ


nani1.2.jpg

ఇది సాధారణ కంటి ఇన్ఫెక్షన్‌(Eye infection) అయినప్పటికీ, ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స అందించని పక్షంలో తీవ్రమైన సమస్యగా మారుతుందని వైద్యలు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధికి గురైన వారు అధికంగా మెడికల్‌ షాపులకు వెళ్లి యాంటీ బయాటిక్స్‌(Antibiotics) వాడుతుంటారని, కానీ తగ్గకపోవడంతో అప్పుడు ఆస్పత్రులకు వస్తున్నారని వైద్యులంటున్నారు. అలాకాకుండా కంటి వైద్యుడిని సంప్రదించి వారి సూచనల మేరకు యాంటీబయాటిక్స్‌, కంటి చుక్కల మందు వినియోగించాలని వారు సూచిస్తున్నారు.


nani1.3.jpg

ఈవార్తను కూడా చదవండి: అయ్యోపాపం. ఎంతఘోరం.. పాఠశాల గేటు పడి విద్యార్థి దుర్మరణం

ఈవార్తను కూడా చదవండి: తెలంగాణలో కులగణన.. దేశానికి నమూనా

ఈవార్తను కూడా చదవండి: Medical Student: అయ్యా.. నాది ఏ రాష్ట్రం?

ఈవార్తను కూడా చదవండి: Uttam: కేంద్ర నిబంధనల మేరకే ధాన్యం కొనుగోళ్లు!

Read Latest Telangana News and National News

Updated Date - Nov 06 , 2024 | 10:48 AM